కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరిపి జనవరి నెలాఖరులో ప్రవేశపెట్టటానికి మంచి కారణముందని...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరిపి జనవరి నెలాఖరులో ప్రవేశపెట్టటానికి మంచి కారణముందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ‘‘సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరపటం.. ప్రభుత్వ వ్యయాన్ని మెరుగుపరచటానికి, పన్ను ప్రతిపాదనలను ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు చేయటానికి దోహదపడుతుంది. దీనిని ప్రస్తుతం క్రియాశీలంగా పరిశీలిస్తున్నాం’’ అని వివరించారు.