భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఒకటి. ఇప్పటి వరకు ఒక అకౌంట్ తీసుకుని చాలామంది దీనికి సంబంధించిన సేవలను వినియోగించుకునే వారు. కానీ 2025 జనవరి నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి.
జనవరి నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లు & ధరలు
అమెజాన్ ఇండియా వివిధ అవసరాలు, బడ్జెట్‌లకు అనుగుణంగా ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో నెలవారీ ప్లాన్ ధర రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, ఏడాది ప్లాన్ రూ. 1499 వద్ద ఉన్నాయి. ఎంచుకునే ప్లాన్‌ను బట్టి యూజర్లు ప్రయోజనాలను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment