
న్యూఢిల్లీ: బంగారంపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి మరింత అధికమైంది. దీన్ని సూచిస్తూ జనవరిలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 45 శాతం అధికంగా రూ.625 కోట్ల మేర వచ్చాయి. దీంతో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ జనవరి చివరికి 22 శాతం అధికమై రూ.14,481 కోట్లకు చేరుకుంది. 2020 డిసెంబర్ చివరికి బంగారం ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.14,174 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 నవంబర్ నెలలో రూ.141 కోట్లు బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా బయటకు వెళ్లిపోగా.. ఆ తర్వాత నుంచి ఈ విభాగం పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. 2020 డిసెంబర్‌లో నికరంగా రూ.431 కోట్ల మేర పెట్టుబడులు బంగారం ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
చదవండి: