Gold ETF
-
పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్
కోల్‌కతా: ఇటీవల కొంతకాలంగా వెండి ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఏడాది కాలంలో సిల్వర్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ నాలుగు రెట్లు ఎగసింది. వెరసి గత నెల(అక్టోబర్)కల్లా వెండి ఈటీఎఫ్‌ల ఏయూఎం రూ. 12,331 కోట్లను తాకింది.2023 అక్టోబర్‌లో ఈ విలువ కేవలం రూ. 2,845 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లు సిల్వర్‌ను దేశీయంగా ధరల పెరుగుదలతోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు హెడ్జింగ్‌గా భావించడం ఇందుకు జతకలిసినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా అనలిటిక్స్ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం..2022లో షురూ సిల్వర్ ఈటీఎఫ్‌లకు 2022లో తెరతీశారు. వీటి అందుబాటు, పారదర్శకతల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరగుతోంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 215 శాతం జంప్‌చేసి 4.47 లక్షలకు చేరింది. 2023 అక్టోబర్‌లో ఇది 1.42 లక్షలు మాత్రమే. ఈ కాలంలో నికర పెట్టుబడులు 24 శాతం ఎగశాయి. రూ. 643 కోట్లను తాకాయి.మరోపక్క మార్కెట్లో 2023 ఏప్రిల్‌లో 8 వెండి ఈటీఎఫ్‌లు నమోదుకాగా.. 2024 ఆగస్ట్‌కల్లా 12కు పెరిగినట్లు ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్, సీనియర్ వీపీ అశ్వినీ కుమార్ వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగనున్నట్లు కుమార్ అంచనా వేశారు. సులభ నిర్వహణ సులభంగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ, చౌక వ్యయాలు వంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఆకర్షణను పెంచుతున్నాయి. ఫిజికల్ కొనుగోళ్లకు జీఎస్టీ వర్తించే సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్‌కావడంతో పెట్టుబడులకు లిక్విడిటీ సైతం ఉంటుంది. యూనిట్ల రూపంలో సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చునని కుమార్ తెలియజేశారు.అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు ఉత్తమ రిటర్నులను సైతం అందిస్తున్నాయి. నెల రోజుల్లో 7.6 శాతం, 3 నెలల్లో 16 శాతం, 6 నెలలు పరిగణిస్తే 20.25 శాతం సగటున రాబడినిచ్చాయి. ఏడాది కాలాన్ని తీసుకుంటే 32.5 శాతం రిటర్నులు అందించాయి. ఇదే కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడులతో పోలిస్తే ఇవి అధికంకావడం గమనార్హం! -
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) అక్టోబర్‌లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్‌లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్‌లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్‌లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు. గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్‌లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది. గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్... గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్జీబీ స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో గడువు తీరిన ఎస్‌జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్‌కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. ఈటీఎఫ్‌ల వైపు చూపు... గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్‌ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్‌ను బట్టి పన్ను విధింపు ఉండేది.రేటు రయ్ రయ్...భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. -
బంగారం బంగారమే
కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. సంప్రదాయ డెట్ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.వివిధ సాధనాలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు), డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్స్ మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్ ఈటీఎఫ్ ధర ఏరోజుకారోజు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్ఐసీ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.41 శాతంగా ఉంది. ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్పెన్స్ రేషియో కింద ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. గోల్డ్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడమే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పెన్స్ రేషియో.. తిరిగి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ఫామ్లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీల్లో రాబడి ఇండియా బులియన్‌అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్జీబీ 2016– సిరీస్1 బాండ్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. ఇతర వివరాలు ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.కేటాయింపులు ఎంత మేర? ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్ కూడా ఉండదు. బంగారం బాండ్లు భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. రిటర్నుల్లో ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్ఎస్ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. రాబడులు బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్ రాబడిని బంగారం ఇచి్చంది. ముందస్తు ఉపసంహరణ ఎలా? ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్ తన వద్దనున్న బాండ్‌ను ఆర్బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఇక ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ). కాకపోతే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్ తక్కువ కనుక మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది. -
బంగారం ఈటీఎఫ్‌ల జోరు
న్యూఢిల్లీ: అనిశ్చిత సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) మే నెలలో నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు ఏప్రిల్ నెలలో రూ.124 కోట్లను బంగారం ఈటీఎఫ్‌లలో నికరంగా పెట్టుబడి పెట్టగా, మే నెలలో 20 శాతం తక్కువగా, రూ.103 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దీనితో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలో మొత్తం ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ మే చివరికి రూ.23,128 కోట్లుగా ఉంది. ఏప్రిల్ చివరికి ఇది రూ.22,950 కోట్లు కావడం గమనార్హం. కాగా,అంతకుముందు నెల మార్చిలో (2023)లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ.266 కోట్లను ఉపసంహరించుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలు విడుదల చేసింది. మే నెలలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది లాభాల స్వీకరణ వల్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ బ్యాంకులు తదుపరి వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.165 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) వరుసగా మూడు నెలల పాటు అమ్మకాలు చూసిన తర్వాత తేరుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.165 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జనవరిలో రూ.199 కోట్లు, 2022 డిసెంబర్లో రూ.273 కోట్లు, అదే ఏడాది నవంబర్‌లో రూ.195 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం. 2022 అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు కొంత తగ్గడం పెట్టుబడుల రాకకు అనుకూలించిందని.. బంగారం ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు సహజంగానే వస్తుంటాయని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. భౌతిక బంగారానికి సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఇచ్చే గుర్తింపు) ఫిబ్రవరిలో 20వేలు పెరిగి మొత్తం 46.94 లక్షలకు చేరాయి. బంగారంలో రాబడులు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటాయని, అందుకే అది నేడు ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా మారినట్టు కవితా కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరి చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అన్నింటి పరిధిలోని నిర్వహణ ఆస్తుల విలువ రూ.21,400 కోట్లుగా ఉంది. -
కళ తప్పిన గోల్డ్ ఈటీఎఫ్‌లు
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సేంజెడ్ ట్రేడెడ్ ఫండ్స్ గతేడాది పెద్దగా పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 90 శాతం తగ్గిపోయి, రూ.459 కోట్లకు పరిమితమయ్యాయి. 2021లో గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రూ.4,814 కోట్లను ఆకర్షించగా, 2020లో రూ.6,657 కోట్ల పెట్టుబడులు వీటిల్లోకి రావడం గమనార్హం. అయితే గతేడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం/పెట్టుబడులు), ఫోలియోలు పెరగడాన్ని గమనించొచ్చు. ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపునే ఫోలియోగా చెబుతారు. 2021 చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.18,405 కోట్లుగా ఉంటే, 2022 డిసెంబర్ చివరికి 16 శాతం వృద్ధితో రూ.21,455 కోట్లకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య గతేడాది 14.29 లక్షలు పెరగడంతో మొత్తం ఫోలియోల సంఖ్య 46.28 లక్షలకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనక్కి తగ్గి ఉండొచ్చు. వడ్డీ రేట్లు పెరుగుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లతో ఈ ఏడాది ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థ సవాళ్లను చూడొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ రీసెర్చ్ మేనేజర్ కవితా కృష్ణన్ పేర్కొన్నారు. ఇక గతేడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపు మొగ్గు చూపించారు. ఈక్విటీ పథకాలు గతేడాది రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే తెలియజేస్తోంది. అయినప్పటికీ బంగారం ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం సానుకూలం. ఇక ముందు ఏంటి పరిస్థితి? మార్కెట్లలో అస్థిరతలు కొనసాగితే ఇక ముందూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గేమ్ ఆధారిత సేవింగ్స్ యాప్ ‘ఫెల్లో’ సీఈవో మనీష్మర్యాద మాత్రం సార్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు) మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లకు సైతం పన్ను ప్రయోజనం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మార్కెట్లో ఎస్‌జీబీల గురించే చర్చ నడుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే ఎస్‌జీబీల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎస్జీబీలకు పన్ను ప్రయోజనం ఉండడమే. ఎస్‌జీబీల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లు వృద్ధి చెందాలంటే, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును సగానికి తగ్గించాలి. ఇది మంచి సానుకూల చర్య అవుతుంది. బంగారంలో దీర్ఘకాలం కోసమే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. కనుక గోల్డ్ ఈటీఎఫ్‌లను ఈఎల్ఎస్ఎస్ మాదిరి పన్ను ఆదా సాధనం కింద వర్గీకరించడం వల్ల ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదొక ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతుంది’’అని మర్యాద చెప్పారు. -
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
పెట్టుబడికీ ‘ఓకే బంగారం’!
బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే లోహం ఇది. ఆభరణాలు, పెట్టుబడుల సాధనంగా డిమాండ్ అధికం. ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇక డిజిటల్ బంగారం సాధనాల్లో పెట్టుబడులు వేరే. బంగారం విలువైన లోహమే అయినప్పటికీ ధరల పరంగా ఇందులో అస్థిరతలు కూడా చాలా ఎక్కువ. ఈక్విటీ మార్కెట్లు అంత కాకపోయినా, గోల్డ్‌లోనూ ఆటుపోట్లు అధికమే. ఇక్కడ కూడా ఇన్వెస్టర్ల సహనమే రాబడులకు గీటురాయి అవుతుంది. అసలు బంగారంలో పెట్టుబడి దండగ? అని కొందరు అంటుంటారు. పోర్ట్‌ఫోలియోలో కనీసం 5–10 శాతం అయినా బంగారానికి కేటాయించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈ భిన్నమైన అభిప్రాయాలు, సూచనలతో ఇన్వెస్టర్లకు అయోమయం ఏర్పడొచ్చు. నిజానికి బంగారంలో పెట్టుబడి వద్దు అని చెప్పడానికంటే.. ఇన్వెస్ట్ చేసుకోండని సూచించడానికే కారణాలు బోలెడు ఉన్నాయి. బంగారం ధరల తీరుతెన్నులు, దీర్ఘకాల చరిత్రను పరిశీలిస్తే ఇందులో పెట్టుబడి పెట్టే విషయమై ఎలా నడుచుకోవాలన్న అవగాహన ఏర్పడుతుంది. పెట్టుబడి సాధనంగా బంగారం ఎంపిక ముందు తెలుసుకోవాల్సిన అంశాలతో కూడిన కథనమే ఇది. రాబడులు 1978 నుంచి 1985 వరకు బంగారం ధర ర్యాలీ చేసింది. మళ్లీ 1988 నుంచి 1992 వరకు పెరగడాన్ని చూడొచ్చు. తిరిగి 2002–2012 మధ్య కూడా బంగారం భారీ ర్యాలీ చేసింది. కానీ, మిగిలిన కాలాల్లో అక్కడక్కడే చలించింది. మొత్తానికి దీర్ఘకాలంలో రాబడులు ఇచ్చినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. విడిగా చూస్తే బంగారం నికర నష్టాలను ఇచ్చిన సంవత్సరాలు కూడా కనిపిస్తాయి. టేబుల్‌ను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. బంగారం ధర పెరగడమే కానీ, తగ్గదు? అన్నది నిజం కాదు. 1967 నుంచి 1974 మధ్య బంగారం ధర ఐదు రెట్లు పెరిగింది. 2004–2012 మధ్య కూడా ఐదు రెట్లు పెరిగింది. కానీ, మిగిలిన సంవత్సరాల్లో పెద్దగా పెరుగుదల లేదు. కనుక దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినప్పుడే ఈ పెరుగుదల ప్రయోజనం ఇన్వెస్టర్‌కు లభిస్తుంది. బంగారం నిర్ణీత కాలం పాటు అలా స్థిరంగా కొనసాగుతూ.. కేవలం రెండు, ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో రెట్లు పెరుగుతుందని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థల పనితీరు, కరెన్సీ మారకం తదితర అంశాల ప్రభావం బంగారంపై ఉంటుంది. దీర్ఘకాలం పాటు, ఒక సైకిల్ నుంచి మరో సైకిల్ వరకు బంగారంలో పెట్టుబడిని కొనసాగించడం ద్వారా అస్థిరతల ప్రభావం లేని, చక్కని రాబడులు సొంతం చేసుకోవచ్చు. రాబడి తీరు ఇదీ... సంవత్సరం సగటు రాబడి (శాతంలో) ఏడాది 13.6 మూడేళ్లు 12.9 ఐదేళ్లు 12.4 పదేళ్లు 12.3 పెట్టుబడి మార్గాలు.. బంగారం ఆభరణాల రూపంలో కలిగి ఉండాలా? కాయిన్ల రూపంలోనా? లేక ఈటీఎఫ్లోనా? ఇలాంటి సందేహాలు రావచ్చు. సార్వభౌమ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు), గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఈ గోల్డ్, 24 క్యారట్ల కాయిన్లు, బార్లు, ఆభరణాలు ఇన్ని రూపాల్లో బంగారాన్ని కలిగి ఉండే వెసులుబాటు ఉంది. వీటన్నింటిలోకి మెరుగైన మార్గాలు ఏవి అంటే ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు అని చెప్పుకోవాల్సిందే. ఆభరణాల రూపంలో బంగారాన్ని కలిగి ఉండొచ్చు. కానీ, పెట్టుబడి మార్గంలో ఆభరణాలను కలిగి ఉండడం కంటే, డిజిటల్ రూపంలో నిర్వహించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా సార్వభౌమ బంగారం బాండ్లు అయితే ఎనిమిదేళ్ల కాలవ్యవధితో వస్తాయి. భౌతిక రూపంలోనే బంగారాన్ని కలిగి ఉండేట్టు అయితే.. ఆభరణాలుగా కాకుండా, బ్యాంకుల నుంచి 24 క్యారట్ల కాయిన్ల రూపంలో కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే బంగారం ఆభరణాలు అయితే, తయారీ చార్జీలు, తరుగు, వృథా పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. బంగారం కాయిన్లు సైతం రుణాలు పొందేందుకు సాయపడతాయి. ఇక ఆ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌లు అన్నవి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ట్రేడ్ అవుతుంటాయి. షేర్ల మాదిరే కొనుగోలు విక్రయాలు చేసుకోవచ్చు. దీనికి ట్రేడింగ్, కమ్ డీమ్యాట్ ఖాతా ఉండాలి. మార్కెట్ ధర ఆధారంగానే గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరల్లో మార్పు ఉంటుంది. ఇక పలు ఎన్బీఎఫ్సీలు, వ్యాలెట్లు ఆఫర్ చేసే ఈ–గోల్డ్ (ఎలక్ట్రానిక్ గోల్డ్) అన్నది ఎంత మాత్రం మెరుగైన సాధనం కాదు. ఇందులో తెలియని చార్జీల రూపంలో, సరైన ధరల్లేమి కారణంగా కొంత నష్టపోవాల్సి వస్తుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా అంతే. చార్జీల రూపంలో రాబడిలో కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. ఎస్‌జీబీల్లో ఏ చార్జీలు ఉండవు. పోర్ట్‌ఫోలియో వైవిధ్యం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట పెట్టొద్దన్నది ప్రాథమిక సూత్రం. ఈక్విటీలు, డెట్, బంగారం, ప్రాపర్టీ ఇలా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. ఒక్కో కాలంలో ఒక్కో సాధనం ప్రతికూలతలను చూస్తుంటుంది. ఈక్విటీలు నేలచూపులు చూస్తున్న సమయాల్లో బంగారం ర్యాలీ చేస్తుంటుంది. అస్థిరతలను అధిగమించేందుకు ఇదొక సాధనం. పైగా ఇది అత్యంత లిక్విడిటీ ఉన్న సాధనం. కనుక పెట్టుబడుల్లో బంగారానికి చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. రిస్క్‌ను తగ్గించి దీర్ఘకాలంలో విలువను పెంచేది కనుక దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. బంగారంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? పెట్టుబడికి ఢోకా లేదు ఒక కంపెనీ షేరులో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ కంపెనీ వ్యాపారం దెబ్బతిని కుదేలైపోతే పెట్టుబడి కూడా హరించుకుపోతుంది. కానీ, బంగారంలో పెట్టుబడికి ఢోకా లేదు. 3,000 ఏళ్ల చరిత్రలో బంగారం విలువ కానీ, ధర కానీ సున్నా కాలేదు. అందుకే కష్టకాలంలో అసలైన ఆస్తులు ఏవంటే? బంగారం, భూమి అని చెబుతారు. పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉంటే, కష్టకాలం ఎదురైతే దీని సాయంతో గట్టెక్కొచ్చన్న భరోసా ఉంటుంది. అత్యవసరాల్లో ఆదుకుంటుంది.. బంగారం కష్టకాలంలో ఆదుకునే సాధనం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో, స్టాక్ మార్కెట్ పతనాల్లో సురక్షిత సాధనంగా పసిడివైపే చూస్తుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరం పడితే, బంగారం విక్రయించి గట్టెక్కొచ్చు. లేదంటే కనీసం ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందొచ్చు. రుణంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ప్రస్తుతం బంగారంపై బ్యాంకులు 8–9%రేటును వసూలు చేస్తున్నాయి. లిక్విడ్ అసెట్ బంగారం కొనుగోలు, విక్రయం చాలా సులభం. అంటే ఇది లిక్విడ్ అసెట్ అవుతుంది. భూమి/ఇల్లు లిక్విడ్ అస్సెట్ కాదు. ప్రాపర్టీ అనేది కోరుకున్న వెంటనే, అవసరంలో వేగంగా అమ్ముడుపోయే సాధనం కాదు. మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయిస్తే తప్ప ప్రాపర్టీల విక్రయానికి కొంత సమయం తీసుకుంటుంది. లావాదేవీ ముగిసి, చేతికి డబ్బు అందడానికి కనీసం మూడు నెలలు అయినా సమయం పడుతుంది. ప్రత్యేక నైపుణ్యాలు అక్కర్లేదు స్టాక్స్‌లో పెట్టుబడులకు మంచి పరిజ్ఞానం ఉండాలి. ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా కనీస పరిజ్ఞానం లేదా నిపుణుల సాయం కావాలి. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలంటే మార్కెట్ ధరల తీరు, భవిష్యత్ వృద్ధి అవకాశాల గురించి అవగాహన ఉండాలి. న్యాయ నిపుణుల సలహాలు కూడా అవసరం పడతాయి. క్రిప్టో కరెన్సీలు అయినా, బాండ్లు అయినా అవగాహనతో కొనుగోలు చేయాల్సిందే. కానీ, బంగారానికి ఇవేమీ అక్కర్లేదు. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ బంగారాన్ని ద్రవ్యోల్బణానికి హెడ్జ్‌గా పరిగణిస్తుంటారు. ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో కరెన్సీ విలువలు క్షీణిస్తుంటాయి. గత దశాబ్ద కాలంలో డాలర్ మారకంలో రూపాయి తన విలువను రెట్టింపు మేర కోల్పోయింది. కానీ, బంగారం ధర గత ఐదేళ్లలో రెట్టింపైంది. గత దశాబ్దంలో నాలుగు రెట్లు పెరిగింది. వడ్డీ రేట్లను దాటుకుని ద్రవ్యోల్బణం పరుగులు తీస్తున్న తరుణంలో బంగారంలో పెట్టుబడితో భరోసా లభిస్తుంది. పదేళ్ల కాలంలో బంగారంలో వార్షిక సగటు రాబడులను గమనిస్తే రెండంకెల్లో ఉన్నట్టు ఇక్కడి టేబుల్ చూస్తే తెలుస్తుంది. అంటే ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు రాబడి బంగారంలో సాధ్యమేనని తెలుస్తోంది. -
గోల్డ్ ఈటీఎఫ్, సావనీర్ గోల్డ్ బాండ్ ఏది బెటర్?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో నాకు పెట్టబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నామినీ పేరుమీదకు అప్పుడు బదలాయిస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, పిల్లల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే అందుకు మార్గం లేదు. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవాలని సూచించడమే మార్గం. గోల్డ్ ఈటీఎఫ్‌లతో సావరీన్ గోల్డ్ బాండ్లను పోల్చి చూడడం ఎలా? ఎస్‌జీబీలు మెరుగైన ఆప్షనేనా? - జోసెఫ్ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు) మెరుగైన ఆప్షన్ అవుతాయి. ఎస్‌జీబీలో ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం ధరల్లో వృద్ధికి ఇది అదనపు ప్రయోజనం. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా కాదు. మార్కెట్ ధరల పరంగా వచ్చిన లాభం ఒక్కటే ప్రయోజనం. ఎస్‌జీబీల్లో వడ్డీని అదనపు ప్రయోజనం కింద చూడాలి. ఎస్‌బీజీలను కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి వ్యయాలు, నిర్వహణ చార్జీల్లేవు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఎక్స్పెన్స్ రేషియో పేరిట ఒక శాతం కోల్పోవాల్సి వస్తుంది. పన్నుల పరంగా చూసినా ఎస్‌జీబీలు మెరుగైనవి. ఎస్‌జీబీల్లో బంగారం ధరల వృద్ధి రూపంలో వచ్చే లాభంపై పన్ను లేదు. 8 ఏళ్ల కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం. ఎస్‌జీబీలో పెట్టుబడిపై ఏటా స్వీకరించే 2.5 శాతం వడ్డీ ఆదాయం మాత్రం పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ల ఆదాయం పన్ను పరిధిలో ఉంటేనే ఎస్‌జీబీల లాభంపై పన్ను పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో లాభం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. అది కూడా ఈక్విటీయేతర మూలధన లాభాల పన్ను అమలవుతుందని గుర్తుంచుకోవాలి. ఒక్కలిక్విడిటీ విషయంలోనే ఎస్‌జీబీలు ఈటీఎఫ్‌ల కంటే దిగువన ఉంటాయి. ఎస్జీబీలను ఐదేళ్ల తర్వాత నుంచి ఆర్బీఐకి స్వాధీనం చేసి పెట్టుబడిని పొందొచ్చు. ఐదేళ్లలోపు అయితే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో విక్రయించుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా కాదు. వాటికి లిక్విడిటీ తగినంత ఉంటుంది. కనుక గడువులోపు విక్రయించుకోవాల్సిన అవసరం లేని వారికి ఎస్‌జీబీలు మెరుగైనవి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
గోల్డ్ పెట్టుబడులపై తగ్గని ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(గోల్డ్ ఈటీఎఫ్‌ల)లో పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నారు. ఫిబ్రవరి నెలలో రూ.491 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు రావడం దీన్నే సూచిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి చారిత్రక గరిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు 15 శాతానికి పైనే తగ్గాయి. ఇది కూడా ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించి ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.625 కోట్ల మేర పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరిలో ఈ వేగం తగ్గింది. 2020 డిసెంబర్ నెలలోనూ ఈ సాధనాల్లోకి రూ.431 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక అంతకుముందు కాలంలో 2020 నవంబర్‌లో రూ.141 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. 2020 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.6,657 కోట్ల మేర ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. మార్చి, నవంబర్ మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నికరంగా పెట్టుబడులు వచ్చాయి. తక్కువ ధరల సానుకూలత ‘‘2021లో ఇప్పటి వరకు బంగారం ధరలు 9 శాతం తగ్గాయి. ధరలు తగ్గినందున ఇన్వెస్టర్లు పరిణతితో తమ పోర్ట్‌ఫోలియోకు అదనంగా జోడిస్తున్నారు’’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి బలపడడం వల్ల దేశీయంగా కనిష్ట ధరలను ఇన్వెస్టర్లు అవకాశంగా తీసుకుంటున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక బలహీన పరిస్థితులు, కనిష్ట వడ్డీ రేట్లు, ద్రవ్యపరమైన విస్తరణ, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారంలో పెట్టుబడులు మధ్య కాలానికి అనుకూలమేనన్నారు. చదవండి: ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు సింగిల్ ఛార్జ్ తో 240 కి.మీ ప్రయాణం -
బంగారం ఈటీఎఫ్‌ల ‘తళతళ’
న్యూఢిల్లీ: బంగారంపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి మరింత అధికమైంది. దీన్ని సూచిస్తూ జనవరిలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 45 శాతం అధికంగా రూ.625 కోట్ల మేర వచ్చాయి. దీంతో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ జనవరి చివరికి 22 శాతం అధికమై రూ.14,481 కోట్లకు చేరుకుంది. 2020 డిసెంబర్ చివరికి బంగారం ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.14,174 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 నవంబర్ నెలలో రూ.141 కోట్లు బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా బయటకు వెళ్లిపోగా.. ఆ తర్వాత నుంచి ఈ విభాగం పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. 2020 డిసెంబర్లో నికరంగా రూ.431 కోట్ల మేర పెట్టుబడులు బంగారం ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: పోకో ఎం3 కాసుల వర్షం! శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు! -
గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 141 కోట్లు వెనక్కి
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ ఈటీఎఫ్(ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్)ల నుంచి ఇన్వెస్టర్లు గత నెలలో రూ.141 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. పుత్తడి ధరలు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులంటున్నారు. వరుసగా ఏడు నెలల నికర పెట్టుబడుల అనంతరం గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఈ నవంబర్లోనే పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కాగా గత ఏడాది ఇదే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.8 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయని ఆంఫీ వెల్లడించింది. (శాంసంగ్ మేకిన్ ఇండియా ఉత్పత్తులు) అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఈ ఏడాది జనవరిలో నికర పెట్టుబడులు రూ.202 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ.1,483 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మాత్రం రూ.195 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ వరుసగా ఏడు నెలల పాటు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు కొనసాగాయి. ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు, జూన్‌లో రూ.494 కోట్లు, జూలైలో రూ.921 కోట్లు, ఆగస్టులో రూ.908 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.597 కోట్లు, అక్టోబర్‌లో రూ.384 కోట్ల నికర పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ సంవత్సరం మంచి రాబడులు ఇచ్చిన అసెట్‌గా గోల్డ్ ఈటీఎఫ్‌లు నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ కాలానికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మొత్తం రూ.6,200 కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి. ఈ నవంబర్‌లో రూ.141 కోట్లు నికర పెట్టుబడుల ఉపసంహరణ జరగడంతో నవంబర్ చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు రూ.13,240 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ ఆస్తులు రూ.13,969 కోట్లుగా ఉన్నాయి. పుత్తడి... వ్యూహాత్మక ఆస్తి! కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తలు వస్తుండటం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి రానుండటం, స్టాక్ మార్కెట్లు జోరుగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో బంగారం ధరల విషయమై అనిశ్చితి నెలకొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్నింగ్‌స్టార్ ఇండియా ఎనలిస్ట్ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. అందుకని ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో పుత్తడి...వ్యూహాత్మక ఆస్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పుత్తడి సురక్షిత మదుపు సాధనంగా ఇన్వెస్టర్లను ఆదుకుంటుందని వివరించారు. పుత్తడి ఒక ప్రభావవంతమైన వైవిధ్యీకరణ ఆస్తి అని పేర్కొన్నారు. -
వన్నె తగ్గుతున్న గోల్డ్ ఈటీఎఫ్‌లు
న్యూఢిల్లీ: గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్) ప్రభ మసకబారుతోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– అక్టోబర్ కాలానికి ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.290 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడులు రూ.422 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్‌లు వన్నె తగ్గుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) తాజా నివేదిక పేర్కొంది. మరోవైపు ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో పెట్టుబడులు రూ.75,000 కోట్లకు పెరిగాయని ఈ నివేదిక తెలిపింది. ఒక్క అక్టోబర్‌లోనే ఈ ఫండ్స్‌లో రూ.14,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో నికరంగా రూ.81,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా ఈ నివేదిక ఏం చెప్పిందంటే., ♦ ఈ ఏడాది అక్టోబర్ నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు 8 శాతం తగ్గి రూ.4,621 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలానికి ఈ ఆస్తులు రూ.5,017 కోట్లుగా ఉన్నాయి. ♦ గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్ అంతకంతకూ దిగజారుతూ వస్తోంది. ♦ 2013–14లో రూ.2,293 కోట్లుగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ 2014–15లో రూ.1,475 కోట్లకు తగ్గింది. పెట్టుబడుల ఉపసంహరణ 2015–16లో రూ.903 కోట్లు, 2016–17లో రూ.775 కోట్లు, 2017–18లో రూ.835 కోట్లుగా ఉన్నాయి. ♦ 2012–13లో మాత్రం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో నికరంగా రూ.1,414 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ♦ గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీ మార్కెట్లో మంచి లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉంటున్నారు. ♦ మరోవైపు పుత్తడిని భౌతికంగా ఉంచుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారని, డీమ్యాట్ రూపంలో అంటే పెద్దగా ఆసక్తి ఉండదని నిపుణులంటున్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు
న్యూఢిల్లీ: గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో అనాసక్తి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు ఏప్రిల్, మేలో రూ.137 కోట్ల విలువ మేర గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇన్వెస్టర్లు విక్రయించి తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో 14 గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.66 కోట్ల మేర, మే నెలలో రూ.71 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో రాబడులు తీసికట్టుగా ఉండడం, అదే సమయంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడుల నేపథ్యంలో ఈ విక్రయాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఎందుకంటే ఇదే కాలంలో ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లలో నికర పెట్టుబడులు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్‌లకు అనాదరణే ఎదురవుతోంది. 2013–14లో రూ.2,293 కోట్లు, 2014–15లో రూ.1,475 కోట్లు, 2015–16లో రూ.903 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్‌లలో నికర విక్రయాలు చోటు చేసుకున్నాయి. 2016–17లో మాత్రం అమ్మకాలు కొంచెం నెమ్మదించాయి. గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ ఈ ఏడాది మే నెల చివరికి రూ.5,298 కోట్లకు తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్‌కు (31.10 గ్రాములు) 2012–13లో గరిష్ట స్థాయి 1,900 డాలర్లు నుంచి క్షీణించిన తర్వాత 1,050 – 1,350 డాలర్ల మధ్యలోనే స్థిరపడినట్టు మార్నింగ్ స్టార్ ఫండ్ రీసెర్చ్ హెడ్ కౌస్తభ్ బేలపుర్కార్ తెలిపారు. ‘‘ధరలు క్షీణించడం, రూపాయి బలపడడానికి తోడు ఈక్విటీ మార్కెట్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్మెంట్ పరంగా అంతగా ప్రాచుర్యం పొందిన ఆప్షన్లు కావు. ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌లకు కేటాయించకపోగా, క్రమంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు’’ అని బేలపుర్కార్ వివరించారు. -
బంగారం ఇప్పుడు కొనొచ్చా?
మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు! బంగారం ధర పెరిగిపోతుంది. సీజన్ ముగిసిపోయాక క్రమేపీ దిగివస్తుంది. ఇదే తరహాలో ఏడాదికాలంగా బంగారం ధర 8-10 శాతం హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతోంది. గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్య పెళ్లిళ్ల సీజన్ సమయంలో దేశీయంగా 10 గ్రాముల ధర రూ. 27,500 స్థాయికి పెరిగింది. తర్వాత రూ. 26,500 స్థాయికి పడిపోయింది. మళ్లీ ఈ మే నెలలో సీజన్ కావడంతో 27,500 స్థాయిని దాటేసింది. అయితే వచ్చే కొద్ది నెలల్లో ధర ఇంతటి గరిష్ట స్థాయిలో కొనసాగుతుందని చెప్పలేమన్నది విశ్లేషకుల మాట. అవన్నీ సరే! ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొనొచ్చా? ఇంకా తగ్గుతుందా? వేచి చూడాలా? ఏం చేయాలి?. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విశ్లేషకులు పెట్టుబడి కోసమైతే ఇపుడు అనవసరం... పెళ్లి కోసం, నగల కోసం ఎప్పుడు కొనాల్సి వస్తే అప్పుడు కొనాల్సిందే. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు ప్రస్తుత ధరలో కొనడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ వుండదని పలువురు కమోడిటీ విశ్లేషకులు చెపుతున్నారు. ఉదాహరణకు ఏడాది క్రితం బంగారం కొని ఉంటే ఇప్పటికి మీ సంపద 7% తగ్గిపోయినట్లే అని, అదే గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే అది 11 శాతం హరించుకుపోయేదని వారు గుర్తుచేస్తున్నారు. కాకపోతే రెండు, మూడేళ్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేస్తే బంగారం అనుకూల రాబడినిస్తుందని మరికొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏఎన్జెడ్ రీసెర్చ్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ విక్టర్ థైన్ప్రియా మాటల్లో చెప్పాలంటే... ‘‘గ్రీసు సంక్షోభం, అమెరికా ద్రవ్య విధానం తదితరాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి’’. ఎందుకంటే గ్రీస్ తన రుణాల్ని సకాలంలో చెల్లించలేకపోతే యూరప్‌లో ఆర్థిక సంక్షోభం వస్తుంది. దాంతో బంగారం ధరలు పెరిగిపోతాయి. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పుత్తడి ధర పతనమైపోతుంది. వచ్చే ఆరు నెలల్లో వీటిలో ఏది జరిగినా, బంగారం హెచ్చుతగ్గులు తీవ్రంగా వుంటాయి. లేదంటే గత కొద్దినెలల్లానే స్తబ్దుగా 8% శ్రేణిలో కదులుతూ వుంటుంది. మన దగ్గరే అంత డిమాండ్.. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య బంగారానికి భారత్‌లో పెరిగినంతగా డిమాండ్ (అభరణాలు, పెట్టుబడులు) మరే దేశంలోనూ పెరగలేదని తాజాగా విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా పుత్తడి దిగుమతి చేసుకునే దేశాలు చైనా, భారత్‌లు కాగా, చైనాలో డిమాండ్ 7% తగ్గగా, భారత్ లో 15% పెరిగింది. అలాగే చైనాలో అభరణాల బంగారానికి డిమాండ్ 10% క్షీణించగా, భారత్‌లో 22%ఎగిసింది. బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించడం, పుత్తడి డిపాజిట్ స్కీము వంటి ప్రోత్సాహకాల్ని బడ్జెట్లో ప్రకటించడం భారత్‌లో డిమాండ్ పెరగానికి కారణమని, చైనాలో ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది పెద్ద ర్యాలీ జరపడం వల్ల అక్కడి వినియోగదారుల్లో బంగారంపై ఆసక్తి తగ్గిందని నివేదిక పేర్కొంది. సుంకం తగ్గించినా పుత్తడి తగ్గుతుంది... ప్రస్తుతం బంగారంపై దేశంలో 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. మూడేళ్ల క్రితం బంగారం దిగుమతులు పెరిగిపోవడంవల్ల కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వ చ్చే, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో పుత్తడిపై సుంకాల్ని పెంచివేశారు. ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు సంతృప్తికరమైన స్థాయిలో వుంది. ఈ నేపథ్యంలో సుంకాల్ని క్రమేపీ తగ్గిస్తే, పుత్తడి ధర దిగివస్తుంది. కనుక ఈ తగ్గుదల ప్రమాదానికి లోబడి బంగారాన్ని కొనుక్కోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. నవంబర్-డిసెంబర్ అనుకూల సమయం.. అంతర్జాతీయంగా డాలరు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు 1180 డాలర్ల నుంచి 1225 డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో ఇక్కడి రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర రూ. 26,500 నుంచి రూ. 27,500కు పెరిగింది. కానీ రానున్న కొద్దినెలల్లో డాలరు మళ్లీ పెరుగుతుందని, దాంతో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌కల్లా ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 1100 డాలర్ల వరకూ తగ్గవచ్చని, అప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని కొందరి విశ్లేషకుల అంచనా. -
నామినీకి పాన్ అవసరమా?
వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ప్రతినెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్ అన్నింటికీ నామినీగా నా భార్య పేరును సూచిం చా ను. నా భార్యకు పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డ్ లేదు. ఒక వేళ ఫండ్ సొమ్ములను నా భార్య క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, పాన్ కార్డ్ తప్పనిసరా? - పురుషోత్తం, కొత్తగూడెం సిక్కిమ్ రాష్ట్రంలోని ఇన్వెస్టర్లకు, సిప్ విధానంలో ఏడాది కాలంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రూ.50,000 కు మించని పక్షంలో.. ఈ రెండు పరిస్థితుల్లో ఫండ్ సొమ్ములను క్లెయిమ్ చేయడానికి నామినీకి పాన్ కార్డ్ అవసరం లేదు. మీరు చెప్పిన పరిస్థితులను బట్టి చూస్తే మీ భార్యకు పాన్ కార్డ్ తప్పనిసరి. అందుకని వీలైనంత త్వరగా పాన్‌కార్డ్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తం ప్రతినెలా డెబిట్ అయి ఆమేరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు నాకు వస్తున్నాయి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడానికి ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) మాండేట్ ఇవ్వాలా? - దేవదానం, గుంటూరు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈసీఎస్ సౌకర్యాన్ని ఎన్పీఎస్ కల్పిస్తోంది. ఈసీఎస్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అయి ఎన్‌పీఎస్‌లోకి వెళ్లిపోతుంది. పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఓపీ) వెబ్సైట్ నుంచి ఈసీఎస్ మాండేట్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసీఎస్ డెబిట్ చేసిన నాలుగో రోజున ఎంత ఎన్ఏవీ ఉంటుందో ఆ ధరకు ఎన్పీఎస్ యూనిట్లు మీకు లభిస్తాయి. ఒక వేళ నాలుగో రోజు సెలవు రోజు అయితే, తర్వాతి రోజు ఎన్ఏవీ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ పండ్ గ్రోత్ డెరైక్ట్ ప్లాన్ ఎన్ఏవీ గత ఏడాది డిసెంబర్ 31న ఒక్క రోజులోనే 3.28 శాతం తగ్గింది. ఒక్క రోజులోనే అంత మొత్తం తగ్గుతుందా? - ఫరీదా, హైదరాబాద్ ఒక్క రోజులోనే ఒక ఫండ్ ఎన్ఏవీ అంత మొత్తం తగ్గే అవకాశాలున్నాయి. ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్ల ధరలకనుగుణంగా ఆ ఫండ్ ఎన్ఏవీ ఉంటుంది. షేర్ల ధరలు ఒక్క రోజులో 3-5 శాతం వరకూ హెచ్చు తగ్గులకు లోను కావచ్చు. స్టాక్ మార్కెట్లంటే ఒడిదుడుకులకు పెట్టింది పేరు. ఇక మీ విషయానికొస్తే మీరు చెప్పిన బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ ఫండ్ గ్రోత్ డెరైక్ట్ ప్లాన్ ఎన్ఏవీ డిసెంబర్ 30న రూ.466.88గా ఉంది. డిసెంబర్ 31న ఈ ఫండ్ ఎన్ఏవీ రూ.469.78గా ఉంది. అంటే ఎన్ఏవీ 0.62గా ఉంది. దీర్ఘకాల పెట్టుబడుల నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని రోజువారీ వచ్చే హెచ్చు తగ్గులను పట్టించుకోకండి, ఆందోళన చెందకండి. నేనొక గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు విభిన్నంగా ఉన్నాయి. మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి? - సికిందర్ జైన్, సికింద్రాబాద్ వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు వివిధ రకాలుగా ఉండటానికి చాలా కారణాలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎక్స్పెన్స్ రేషియోలు, తదితర కారణాల వల్ల గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా చాలా గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక గ్రామ్వి ఉంటాయి. కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉదాహరణకు క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ మాత్రం అరగ్రాము ఉంటుంది. ఇలాంటి కారణం వల్ల కూడా ఎన్ఏవీలు విభిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు రకరకాలుగా ఉన్నా, రాబడుల్లో మాత్రం పెద్ద తేడా ఏమీ ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలంటే.., ఆ గోల్డ్ ఈటీఎఫ్ ఎన్ఏవీకి, ట్రేడింగ్ ధరకు పెద్దగా తేడా ఉండకూడదు. అలాగే ట్రేడింగ్ లావాదేవీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. గోల్డ్‌మన్ శాక్స్ గోల్డ్‌బీస్, కొటక్ గోల్డ్ ఈటీఎఫ్, యూటీఐ గోల్డ్షేర్.. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చా?
హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఒకేసారి ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చా? - అమృత, హైదరాబాద్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే దాదాపు ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఉంటాయి. ఈ ఫండ్స్ నిధుల్లో 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈక్విటీల్లో 65% ఇన్వెస్ట్ చేస్తామని బ్యాలెన్స్డ్ ఫండ్స్ పేర్కొంటాయి. కానీ, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కనీసం 70 నుంచి 80%వరకూ ఉంటాయి. ఏతావాతా బ్యాలెన్స్డ్ ఫండ్స్ పనితీరు ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఉంటుందని చెప్పవచ్చు. స్టాక్‌మార్కెట్లు జోరుగా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ వృద్ధి బావుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లు పడిపోతే ఈ ఫండ్స్ కూడా క్షీణిస్తాయి. అందుకని ఈ ఫండ్స్‌లో ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు పతనమైతే మీకు కూడా పెద్ద మొత్తంలోనే నష్టాలు వస్తాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు కళ్లజూడవచ్చు. కానీ ధర తక్కువ అనేదానిని ఎవరూ పసిగట్టలేరు. ధర తగ్గుతుంటే ఇంకా తగ్గుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు ధర క్రమ క్రమంగా పుంజుకుంటుంది. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే ఓపిక మీకు లేకపోతే, మీ దగ్గరున్న మొత్తాన్ని కనీసం ఆరు సమాన భాగాలుగా చేసైనా ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నెలకు కొంత మొత్తం చొప్పున ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని మిత్రులంటున్నారు. ఇది సరైన నిర్ణయమేనా? -ప్రకాశ్, విజయవాడ ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదు. పుత్తడిలో పెట్టుబడులు వద్దని చెబుతూనే ఉన్నాం. గతంలో వివిధ కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులకు మంచి రాబడులే వచ్చాయి. ఈక్విటీ మార్కెట్లలో అని శ్చితి, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, డిమాండ్ అధికంగా ఉండడం, సరఫరా తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజు కుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ కారణాల వల్ల చూస్తే, ఈక్విటీల్లో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి బంగారం కంటే ఈక్విటీలే ఉత్తమం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పుత్తడిలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. నేను ఇటీవలనే రిటైరయ్యాను. గతంలో నేను వేసిన ఫిక్సడ్ డిపాజిట్లు మరో రెండు నెలల్లో మెచ్యూర్ అవుతాయి. ఈ మొత్తాన్ని ఏవైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ల్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడి వస్తుందా? ఏయే ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారు? - సంపత్‌కుమార్, కరీంనగర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్.. ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన ఇన్వెస్ట్మెంట్ విధానాలు. ఫిక్స్డ్ డిపాజిట్లలో స్థిరమైన ఆదాయం గ్యారంటీగా లభిస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి మార్కెట్ అనుసంధానత ఇన్వెస్ట్మెంట్ సాధనాలు, స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులు కారణంగా వీటిల్లో కూడా ఒడిదుడుకులుంటాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వలె మ్యూచువల్ ఫండ్స్ నుంచి గ్యారంటీడ్ ఆదాయం పొందలేము. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందవచ్చు. మీరు రిటైరయ్యారు కాబట్టి, మీ ఆదాయంలో వృద్ధి ఆగిపోతుంది. అందుకే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే ఆదాయంపైననే మీరు ఆధారపడాలి. మీ అసలు మొత్తం కొనుగోలు శక్తి అలాగే ఉండటంతో పాటు మీకు తగిన ఆదాయం మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రావలసి ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా, మీ ఖర్చులకు సరిపడేలా నెలవారీ కొంత ఆదాయం మీకు కావాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.