నామినీకి పాన్ అవసరమా? | Nominee to Pan necessary? | Sakshi
Sakshi News home page

నామినీకి పాన్ అవసరమా?

Published Mon, Feb 16 2015 2:13 AM | Last Updated on Fri, Oct 19 2018 7:00 PM

నామినీకి పాన్ అవసరమా? - Sakshi

నామినీకి పాన్ అవసరమా?

వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ప్రతినెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్ అన్నింటికీ నామినీగా నా భార్య పేరును సూచిం చా ను. నా భార్యకు పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డ్ లేదు. ఒక వేళ ఫండ్ సొమ్ములను నా భార్య క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, పాన్ కార్డ్ తప్పనిసరా?                - పురుషోత్తం, కొత్తగూడెం
 
సిక్కిమ్ రాష్ట్రంలోని ఇన్వెస్టర్లకు, సిప్ విధానంలో ఏడాది కాలంలో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.50,000 కు మించని పక్షంలో.. ఈ రెండు పరిస్థితుల్లో ఫండ్ సొమ్ములను క్లెయిమ్ చేయడానికి నామినీకి పాన్ కార్డ్ అవసరం లేదు. మీరు చెప్పిన పరిస్థితులను బట్టి చూస్తే మీ భార్యకు పాన్ కార్డ్ తప్పనిసరి. అందుకని వీలైనంత త్వరగా పాన్‌కార్డ్ తీసుకోండి.
 
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తం ప్రతినెలా డెబిట్ అయి ఆమేరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు నాకు వస్తున్నాయి. అలాగే  నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడానికి ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) మాండేట్ ఇవ్వాలా?
 - దేవదానం, గుంటూరు
 
ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈసీఎస్ సౌకర్యాన్ని ఎన్‌పీఎస్ కల్పిస్తోంది. ఈసీఎస్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అయి ఎన్‌పీఎస్‌లోకి వెళ్లిపోతుంది. పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఓపీ) వెబ్‌సైట్ నుంచి ఈసీఎస్ మాండేట్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసీఎస్ డెబిట్ చేసిన నాలుగో రోజున ఎంత ఎన్‌ఏవీ ఉంటుందో ఆ ధరకు ఎన్‌పీఎస్ యూనిట్లు మీకు లభిస్తాయి. ఒక వేళ నాలుగో రోజు సెలవు రోజు అయితే, తర్వాతి రోజు ఎన్‌ఏవీ ధరను పరిగణనలోకి తీసుకుంటారు.
 
బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ పండ్ గ్రోత్ డెరైక్ట్ ప్లాన్ ఎన్‌ఏవీ గత ఏడాది డిసెంబర్ 31న ఒక్క రోజులోనే 3.28 శాతం తగ్గింది. ఒక్క రోజులోనే అంత మొత్తం తగ్గుతుందా?     - ఫరీదా, హైదరాబాద్
 
ఒక్క రోజులోనే ఒక ఫండ్ ఎన్‌ఏవీ అంత మొత్తం తగ్గే అవకాశాలున్నాయి. ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్ల ధరలకనుగుణంగా ఆ ఫండ్ ఎన్‌ఏవీ ఉంటుంది. షేర్ల ధరలు ఒక్క రోజులో 3-5 శాతం వరకూ హెచ్చు తగ్గులకు లోను కావచ్చు. స్టాక్ మార్కెట్లంటే ఒడిదుడుకులకు పెట్టింది పేరు. ఇక మీ విషయానికొస్తే మీరు చెప్పిన బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ ఫండ్ గ్రోత్ డెరైక్ట్ ప్లాన్ ఎన్‌ఏవీ డిసెంబర్ 30న రూ.466.88గా ఉంది. డిసెంబర్ 31న ఈ ఫండ్ ఎన్‌ఏవీ రూ.469.78గా ఉంది. అంటే ఎన్‌ఏవీ 0.62గా ఉంది. దీర్ఘకాల పెట్టుబడుల నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని రోజువారీ వచ్చే హెచ్చు తగ్గులను పట్టించుకోకండి, ఆందోళన చెందకండి.
 
నేనొక గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్‌ఏవీలు  విభిన్నంగా ఉన్నాయి.  మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి?
 - సికిందర్ జైన్, సికింద్రాబాద్
 
వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్‌ఏవీలు వివిధ రకాలుగా ఉండటానికి చాలా కారణాలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎక్స్‌పెన్స్ రేషియోలు,   తదితర కారణాల వల్ల గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్‌ఏవీలు రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా చాలా గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక గ్రామ్‌వి ఉంటాయి. కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉదాహరణకు క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ మాత్రం అరగ్రాము ఉంటుంది. ఇలాంటి కారణం వల్ల కూడా ఎన్‌ఏవీలు విభిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్‌ఏవీలు రకరకాలుగా ఉన్నా, రాబడుల్లో మాత్రం పెద్ద తేడా ఏమీ ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలంటే.., ఆ  గోల్డ్ ఈటీఎఫ్ ఎన్‌ఏవీకి, ట్రేడింగ్ ధరకు పెద్దగా తేడా ఉండకూడదు. అలాగే ట్రేడింగ్ లావాదేవీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. గోల్డ్‌మన్ శాక్స్ గోల్డ్‌బీస్, కొటక్ గోల్డ్ ఈటీఎఫ్, యూటీఐ గోల్డ్‌షేర్.. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement