Sip policy
-
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
'సిప్' రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు వారం మంచిదా? నెలవారీ మంచిదా!
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా చేస్తున్నాం కదా అని వాదించొచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? – మంజునాథ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కానందున వీటి పట్ల నేను వ్యతిరేకం. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఫండ్ సంస్థ డివిడెండ్ ప్రకటించినట్టయితే ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్‌గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల డివిడెండ్ ఆదాయం కూడా మొత్తం ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు వారికి వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్ ప్లాన్ మెరుగైన ఎంపిక అవుతుంది. సెన్సెక్స్ 42,000కు చేరినప్పుడు ఈక్విటీల నుంచి 50 శాతం పెట్టుబడులు వెనక్కి తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను చేసింది తప్పు అని అర్థం చేసుకున్నాను. తిరిగి మళ్లీ ఇప్పుడు పెట్టుబడులు ఎలా పెట్టాలి? – రాజేష్ అందుకే మార్కెట్ టైమింగ్‌ను ఎప్పుడూ అంచనా వేసే ప్రయత్నం చేయకూడదు. మార్కెట్లు ఏ సమయంలో ఎలా నడుచుకుంటాయన్నదానిపై దృష్టి సారించకూడదు. దీనికి బదులు మీ పెట్టుబడుల లక్ష్యాలు, కాల వ్యవధి, ఎంత రిస్క్ తీసుకోగలరు తదితర అంశాల ఆధారంగానే నడుచుకోవాలి. దీన్ని ఒక అనుభవంగా తీసుకుని మార్కెట్ గమనాన్ని అంచనా వేసే ప్రయత్నం మానుకోండి. దీనికి బదులు పెట్టుబడుల నిర్ణయాలకు సమయాన్ని కేటాయించండి. మళ్లీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భిన్నంగా ఏమీ వ్యవహరించక్కర్లేదు. మీ దగ్గరున్న పెట్టుబడిని క్రమానుగతంగా వచ్చే 10–12 నెలల కాలంలో ఇన్వెస్ట్ చేసుకోండి. చదవండి👉 వారం/నెల ‘సిప్’.. ఏది మంచిది? -
బీమా నుంచి గాడ్జెట్ల దాకా!!
మన దేశీ జనాభాలో దాదాపు సగం మంది పాతికేళ్ల కన్నా తక్కువ వయసున్న వారే. ఇక ముప్ఫై అయిదేళ్ల కన్నా తక్కువ వయసున్న వారిని చూస్తే ఏకంగా 65 శాతం. ఇందులో చాలా మంది ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారో.. లేదా త్వరలో చేరబోయే వారో, స్వయం ఉపాధిలో ఉన్నవారో ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో యువజనాభా ఉండటం.. దేశానికి ప్రయోజనకరమే. అయితే, వీరంతా రిటైరయ్యాక పరిస్థితి ఏంటి? రిటైరయిన వారికీ భరోసానిచ్చేలా సామాజిక భద్రత పథకాలు, వృద్ధులకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయాన్నిచ్చే ఆర్థికపరమైన తోడ్పాటు మన దగ్గర లేకపోవడంతో.. వీరంతా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు సమస్యలు తప్పవు. పైగా.. దేశీయంగా ఉద్యోగానికి సైతం భద్రత తగ్గిపోతోంది. అందుకే... నేటి యువతరం కాస్త ముందు నుంచే ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం మంచిది. భవిష్యత్ అవసరాలు చిన్నవైనా, పెద్దవైనా... లక్ష్యాలు స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనవైనా... స్మార్ట్‌గా అధిగమించవచ్చు. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల కోసం సిప్‌లు.. అన్నింటికన్నా ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోవడం ప్రధానం. మీ కంపెనీ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్నప్పటికీ.. కుటుంబం మొత్తానికి ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఒకటి తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకోసం ప్రీమియం వార్షికంగా చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. మిగతా కాలవ్యవధులతో పోలిస్తే.. దీని వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అటుపైన స్వల్పకాలిక డెట్ ఫండ్‌లో నెలవారీగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో (సిప్) ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టండి. తర్వాత ప్రతి ఏటా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అవసరమైన మొత్తాన్ని క్రమంగా సదరు డెట్‌ఫండ్ సిప్ నుంచి విడ్‌డ్రా చేసి కట్టేయొచ్చు. ఈ విధానంతో రెండురకాల ప్రయోజనాలుంటాయి. మొదటిది... వార్షికంగా కట్టడం వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అదే సమయంలో మీరు సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చే పెట్టుబడి ఏడాది పొడవునా ఎంతో కొంత రాబడి అందిస్తూనే ఉంటుంది. అలాగే, కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే.. స్మార్ట్ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు.. ఇతర గాడ్జెట్స్ లాంటివి కొనుక్కోవడానికి ఈఎంఐల బాట పట్టకుండా సొంతంగానే కొనుక్కునే వీలుంటుంది. ఇందుకోసం కూడా స్వల్పకాలిక సిప్‌లు ప్రారంభించవచ్చు. తర్వాత వాటి నుంచి కొద్దికొద్దిగా విత్‌డ్రా చేసుకుని మీరు కోరుకున్న గాడ్జెట్స్.. లేదా వస్తువులు కొనుక్కోవచ్చు. దీర్ఘ కాలికానికీ సిప్‌లు... యుక్త వయసులో కాస్త రిస్కు సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది కనుక... దీర్ఘకాలంలో అధిక రాబడులిచ్చే అవకాశాలున్న ఈక్విటీల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే దీర్ఘకాలికంగా షేర్లలో రిస్కులు క్రమంగా తగ్గి రాబడులు పెరిగే అవకాశాలుంటాయి. పైపెచ్చు అనేక సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం వల్ల చక్రవడ్డీ తరహా కాంపౌండింగ్ మహిమ కూడా తోడై మరింత మెరుగైన రాబడులందుకునే ఆస్కారముంటుంది. చాలా మటుకు మిగతా ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు అధిక రాబడులు అందిస్తాయి. యుక్తవయస్సులోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం వల్ల పెట్టుబడుల్లో ఒకటి రెండు తప్పిదాలేమైనా చేసినా.. సత్వరం సరిదిద్దుకునేందుకు కొంత అవకాశం ఉంటుంది. అదే రిటైర్మెంట్కి దగ్గరవుతుండగా.. ఏ చిన్న తప్పిదం చేసినా సరిదిద్దుకునేందుకు ఎక్కువ సమయం ఉండదు. టాప్ రేటెడ్ ఫండ్స్‌లోనే... దీర్ఘకాలంలో సంపదను గణనీయంగా పెంచుకునే దిశగా టాప్ రేటెడ్ ఈక్విటీ ఫండ్స్‌లో మాత్రమే సిప్ చేయడం మంచిది. అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి... జీతం పెరిగే కొద్దీ కేటాయింపులూ పెంచుకుంటూ వెళ్లండి. ఉదాహరణకు.. సగటున పదిహేను శాతం వార్షిక రాబడులు ఇచ్చే సిప్‌లో ప్రతి నెలా రూ. 1,000 పెట్టుబడితో మొదలుపెట్టారనుకుందాం. ఏటా ఈ మొత్తాన్ని రూ. 1,000 చొప్పున పెంచుకుంటూ పోతే.. ముప్ఫై ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 4.8 కోట్ల సంపద పోగవుతుంది. కాబట్టి స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తే.. లక్ష్యం ఎలాంటిదైనా సులువుగా సాధించవచ్చు. -
కొత్త ఫండా? ప్రస్తుత సిప్‌ను పెంచాలా?
నేను ప్రస్తుతం ఏడు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మదుపు చేస్తున్నాను. ఇటీవలే ఒక ఇంక్రిమెంట్ వచ్చింది. జీతం పెరిగింది. దీంతో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కూడా పెంచాలనుకుంటున్నాను. కొత్తగా ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ప్రస్తుతం ఉన్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచమంటారా ? తగిన సలహా ఇవ్వండి. – అశ్వనీ కుమార్, విజయవాడ మీరు ఇప్పటికే ఏడు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది సరిపోతుంది. మరీ ఎక్కువ సంఖ్యలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఏమంత మంచిది కాదు. సాధారణంగా జరిగేదేమిటంటే, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తారు. ఆతర్వాత కొత్త ఫండ్స్ యూనిట్లను కొనుక్కుంటూ పోతారు. అలా అవసరం లేదు కూడా. ఇక మీ విషయానికొస్తే, పెరిగిన జీతంతో కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన పనిలేదు. ఉన్న సిప్‌ల్లో ఏదో ఒకటి, లేదా రెండు సిప్ల మొత్తాన్ని పెంచండి చాలు. మరో విషయం ఇన్వెస్ట్ చేయడానికి ఏడు ఫండ్స్ అవసరం లేదు. వాటిల్లోంచి 2–3 ఫండ్స్‌ను తగ్గించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది. మార్కెట్ మొత్తాన్ని ప్రతిబింబించేలా ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేసుకోవాలి. ఏదైనా ఒకటి లేదా రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. ఇక రెండవది. మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను నిర్వహించే ఫండ్స్ మేనేజర్లు వేర్వేరుగా ఉండాలి. ఉదాహరణకు ఒకే సంస్థకు చెందిన నాలుగు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. ఈ సంస్థ ఫండ్ మేనేజర్ల ఇన్వెస్ట్మెంట్ వ్యూహం దాదాపు ఒకేలాగా ఉంటుంది. మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు అందవు. అలా కాకుండా వివిధ సంస్థలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అప్పుడు ఈ ఫండ్స్ మేనేజర్ల ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు విభిన్నంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన రెండు అంశాలు సాకారం కావాలంటే 4–5 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నేను టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ప్యూర్ టర్మ్ పాలసీ తీసుకోవాలా లేకుంటే, సమగ్రమైన రైడర్లున్న టర్మ్ పాలసీ తీసుకోవాలా ? – శ్రీనివాస్, వరంగల్ బీమా అవసరాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయి. ఒక వ్యక్తికి సరిపోయినది, మరో వ్యక్తికి సరిపోకపోవచ్చు. ఆర్థికంగా మీపై ఆధారపడిన వాళ్లుంటే బేసిక్ టర్మ్ పాలసీ తప్పనిసరి. ఇక మీకు ఉన్న ప్రత్యేక అవసరాలను బట్టి రైడర్లను తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. బీమా కంపెనీలు వివిధ రైడర్లతో కూడిన టర్మ్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిలరేటెడ్ సమ్ అష్యూర్డ్, పార్షియల్, పర్మనెంట్ డిజేబిలిటీ, తదితర రైడర్లతో వివిధ బీమా సంస్థలు వివిధ టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి. అయితే వీటికి ప్రీమియం అదనంగా చెల్లించాల్సి రావచ్చు. అందరూ ఈ రైడర్లను తీసుకోవాలని రూలేమీ లేదు. ఒక వ్యక్తి తనకు తగిన రైడర్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తరుచుగా దూర ప్రయాణాలు చేసే ఉద్యోగం చేస్తున్నాడనుకుందాం. ఆ వ్యక్తి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకని ఆ వ్యక్తి యాక్సిడెంటల్ డెత్ రైడర్ ఉన్న పాలసీ ఎంచుకోవాలి. అయితే ఒకే రైడర్‌ను అందించే వివిధ సంస్థలకు చెందిన బీమా పాలసీలు షరతులు రకరకాలుగా ఉంటాయి. అందుకని రైడర్‌ను ఎంచుకునే ముందు, సంబంధిత వ్యయాలను, ప్రయోజనాలను, షరతులను, తదితర అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో గత కొంత కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి రెండు ఫండ్స్‌ను ఎంచుకున్నాను. ఒకటేమో గత 15 ఏళ్లలో 14 శాతం రాబడినివ్వగా, మరో ఫండ్ మూడేళ్లలోనే 22 శాతం చొప్పున రాబడినిచ్చింది. ఈ రెండింటిలో ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు ? – తులసి, హైదరాబాద్ పదిహేనేళ్లలో 14 శాతం రాబడి ఇచ్చిన ఫండ్–మార్కెట్లో భారీ ఉత్ధాన, పతనాలను చవి చూసి ఉంటుంది. పదిహేనేళ్లంటే దీర్ఘకాలం కిందే లెక్క. ఈ కాలంలో మార్కెట్లో రెండు బూమ్‌లు వచ్చాయి. ఇక రెండో ఫండ్ మూడేళ్లలో 22 శాతం రాబడినిచ్చింది. గత మూడేళ్లలో మార్కెట్ బూమ్‌లోనే ఉందని చెప్పవచ్చు. అంటే ఈ ఫండ్ మంచి రోజులనే చూసిందని చెప్పవచ్చు. అయితే మార్కెట్ చక్రీయంగా ఉంటుంది. మార్కెట్ బాగాలేకపోతే, నష్టాలూ వస్తాయి. మీరు చూడాల్సిన మరో ముఖ్యమైన విషయం. 14 శాతం రాబడినిచ్చిన ఫండ్‌ను నిర్వహించిన మేనేజర్ ఈ పదిహేనేళ్ల పాటూ ఈ ఫండ్‌కు మేనేజర్‌గానే వ్యవహరించాడా లేదా అన్న విషయం. దీనికి సమాధానం అవును అయితే మీరు 14 శాతం రాబడినిచ్చిన ఫండ్‌ను మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు పరిశీలించవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించి గతంలో పనితీరు ఎప్పుడూ భవిష్యత్తు పనితీరుకు కొలమానం కాదు. మరోవైపు పనితీరే... ఫండ్‌ను ఎంచుకోవడానికి ప్రాధాన్య నిర్ణయం కాదు. ఆ ఫండ్ ఏ తరహాది ? ఆ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్ వివరాలు, పన్ను ప్రయోజనాలు ఏమైనా లభిస్తాయా? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
విజయ్! ఫండ్స్‌తోనే కావాల్సిన నిధి
సిప్ చేస్తే దీర్ఘకాలిక లక్ష్యాలు ఈజీనే నా పేరు విజయ్‌కుమార్. వయసు 36 ఏళ్లు. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నాతో పాటు నా భార్య, 5 ఏళ్ల అబ్బాయి అరుణ్ ఉంటున్నారు. నాకు నెలకు రూ.లక్ష జీతం వస్తోంది. జీతంగా లక్ష రూపాయల వరకు వస్తున్నాయి. ఇందులో రూ.35,000 వరకు పొదుపు చేస్తున్నాను. నా సేవింగ్స్ విషయానికి వస్తే.. ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ట్యాక్స్ సేవింగ్ పథకం (ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ విలువ లక్ష రూపాయలుగా ఉంది. ప్రతి ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.18,000 కడుతున్నాను. ఈ పాలసీ 2027లో మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ కింద రూ. 6.5 లక్షలు వస్తాయి. ఈపీఎఫ్ కింద ప్రతి నెలా రూ. 3,500 జీతంలో కోత కోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖాతాలో రూ. 1.35 లక్షలు వరకు ఉన్నాయి. నా ఆర్థిక లక్ష్యాల విషయానికి వస్తే...55 ఏళ్ల నాటికి పదవీ విరమణ చేయాలనుకుంటున్నా. అప్పటికి పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనుకుంటున్నాను. అలాగే అరుణ్ ఉన్నత చదువులకు తగిన నిధి సమకూర్చుకోవాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం విద్యావ్యయం రూ.5 లక్షలుగా ఉంది. దీని ప్రకారం తగిన ఆర్థిక ప్రణాళికను సూచించగలరు. హాయ్!.. విజయ్‌కుమార్ గారు... మీ ఆదాయం, వ్యయాలు, పొదుపు, ఆర్థిక లక్ష్యాల గురించి చాలా వివరణాత్మకంగా రాశారు. అలాగే మీ పెట్టుబడులను అంతా ఒకేదానిలో కాకుండా వివిధ పథకాలకు కేటాయించడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు. మీ రెండు లక్ష్యాలు దీర్ఘకాలానికి చెందినవే. ఇందులో మొదటిది మీ అరుణ్ ఉన్నత విద్యకి చేరుకోవడానికి ఇంకా 15 ఏళ్లు అంటే 2031 వరకు సమయం ఉంది. ప్రస్తుతం మీరు చదివించాలనుకున్న చదువుకు రూ.5 లక్షలు అవుతాయి. ఏటా విద్యా వ్యయం 7.5 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తే.. 2031 నాటికి రూ.13.76 లక్షలు అవసరమవుతాయి. అదే రిటైర్మెంట్కు ఇంకా 19 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుతం మీ ఇంటి ఖర్చు నెలకు రూ.30,000 అవుతున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం ఏటా 6 శాతం చొప్పున లెక్కిస్తే 2035 నాటికి రిటైర్మెంట్ నిధి కనీసం రూ.3.59 కోట్లు అవసరమవుతాయి. రిటైర్మెంట్కు.. ఫండ్స్‌లో పెట్టుబడి! మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా అదనంగా రూ.34,000 అవసరమవుతాయి. ప్రస్తుతం మీరు రూ.35,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించండి. సిప్ విధానంలో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవచ్చు. మీ రిస్క్ సామర్థ్యాన్ని మధ్యస్థంగా అంచనా వేసుకొని ఈ పోర్ట్‌ఫోలియోను సూచించడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని పిల్లవాడి చదువుకు వినియోగించుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి రిటైర్మెంట్కు అక్కరకు వస్తుంది. -
నామినీకి పాన్ అవసరమా?
వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ప్రతినెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్ అన్నింటికీ నామినీగా నా భార్య పేరును సూచిం చా ను. నా భార్యకు పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డ్ లేదు. ఒక వేళ ఫండ్ సొమ్ములను నా భార్య క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, పాన్ కార్డ్ తప్పనిసరా? - పురుషోత్తం, కొత్తగూడెం సిక్కిమ్ రాష్ట్రంలోని ఇన్వెస్టర్లకు, సిప్ విధానంలో ఏడాది కాలంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రూ.50,000 కు మించని పక్షంలో.. ఈ రెండు పరిస్థితుల్లో ఫండ్ సొమ్ములను క్లెయిమ్ చేయడానికి నామినీకి పాన్ కార్డ్ అవసరం లేదు. మీరు చెప్పిన పరిస్థితులను బట్టి చూస్తే మీ భార్యకు పాన్ కార్డ్ తప్పనిసరి. అందుకని వీలైనంత త్వరగా పాన్‌కార్డ్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తం ప్రతినెలా డెబిట్ అయి ఆమేరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు నాకు వస్తున్నాయి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడానికి ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) మాండేట్ ఇవ్వాలా? - దేవదానం, గుంటూరు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈసీఎస్ సౌకర్యాన్ని ఎన్పీఎస్ కల్పిస్తోంది. ఈసీఎస్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అయి ఎన్‌పీఎస్‌లోకి వెళ్లిపోతుంది. పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఓపీ) వెబ్సైట్ నుంచి ఈసీఎస్ మాండేట్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసీఎస్ డెబిట్ చేసిన నాలుగో రోజున ఎంత ఎన్ఏవీ ఉంటుందో ఆ ధరకు ఎన్పీఎస్ యూనిట్లు మీకు లభిస్తాయి. ఒక వేళ నాలుగో రోజు సెలవు రోజు అయితే, తర్వాతి రోజు ఎన్ఏవీ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ పండ్ గ్రోత్ డెరైక్ట్ ప్లాన్ ఎన్ఏవీ గత ఏడాది డిసెంబర్ 31న ఒక్క రోజులోనే 3.28 శాతం తగ్గింది. ఒక్క రోజులోనే అంత మొత్తం తగ్గుతుందా? - ఫరీదా, హైదరాబాద్ ఒక్క రోజులోనే ఒక ఫండ్ ఎన్ఏవీ అంత మొత్తం తగ్గే అవకాశాలున్నాయి. ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్ల ధరలకనుగుణంగా ఆ ఫండ్ ఎన్ఏవీ ఉంటుంది. షేర్ల ధరలు ఒక్క రోజులో 3-5 శాతం వరకూ హెచ్చు తగ్గులకు లోను కావచ్చు. స్టాక్ మార్కెట్లంటే ఒడిదుడుకులకు పెట్టింది పేరు. ఇక మీ విషయానికొస్తే మీరు చెప్పిన బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ ఫండ్ గ్రోత్ డెరైక్ట్ ప్లాన్ ఎన్ఏవీ డిసెంబర్ 30న రూ.466.88గా ఉంది. డిసెంబర్ 31న ఈ ఫండ్ ఎన్ఏవీ రూ.469.78గా ఉంది. అంటే ఎన్ఏవీ 0.62గా ఉంది. దీర్ఘకాల పెట్టుబడుల నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని రోజువారీ వచ్చే హెచ్చు తగ్గులను పట్టించుకోకండి, ఆందోళన చెందకండి. నేనొక గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు విభిన్నంగా ఉన్నాయి. మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి? - సికిందర్ జైన్, సికింద్రాబాద్ వివిధ గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు వివిధ రకాలుగా ఉండటానికి చాలా కారణాలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎక్స్పెన్స్ రేషియోలు, తదితర కారణాల వల్ల గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా చాలా గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక గ్రామ్వి ఉంటాయి. కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉదాహరణకు క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ మాత్రం అరగ్రాము ఉంటుంది. ఇలాంటి కారణం వల్ల కూడా ఎన్ఏవీలు విభిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలు రకరకాలుగా ఉన్నా, రాబడుల్లో మాత్రం పెద్ద తేడా ఏమీ ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలంటే.., ఆ గోల్డ్ ఈటీఎఫ్ ఎన్ఏవీకి, ట్రేడింగ్ ధరకు పెద్దగా తేడా ఉండకూడదు. అలాగే ట్రేడింగ్ లావాదేవీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. గోల్డ్‌మన్ శాక్స్ గోల్డ్‌బీస్, కొటక్ గోల్డ్ ఈటీఎఫ్, యూటీఐ గోల్డ్షేర్.. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు.