
( ఫైల్ ఫోటో )
కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. జనవరి 3నుంచి కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుతో కొత్త సంవత్సర ప్రయాణాన్ని భారత జట్టు మొదలుపెట్టబోతుంది. గతేడాది టీమిండియా అద్భుతంగా రాణించి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ.. కీలకమైన వరల్డ్ కప్‌ను అడుగు దూరంలో కోల్పోయింది.
ఇప్పటికీ అభిమానులు భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో 2024 జూన్‌లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే విధంగా భారత జట్టు కూడా ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదిలో భారత జట్టు షెడ్యూల్‌పై ఓ లూక్కేద్దం
అఫ్గానిస్తాన్‌తో టీ 20 సిరీస్
దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది
►జనవరి 11న మొహాలీలో తొలి టీ 20
►జనవరి 14న ఇండోర్‌లో రెండో టీ 20
►జనవరి 17న బెంగళూరులో మూడో టీ 20
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్..
ఇక ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
►జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు - హైదరాబాద్
►ఫిబ్రవరి 02 నుంచి 06 వరకు రెండో టెస్టు - విశాఖపట్నం
►ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు మూడో టెస్టు - రాజ్‌కోట్
►ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు - రాంచీ
►మార్చి 07 నుంచి 11 వరకు ఐదో టెస్టు - ధర్మశాల
►ఏప్రిల్- మే: ఐపీఎల్ సందర్భంగా రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్
►జూన్: టీ20 ప్రపంచకప్ (వెస్టిండీస్, యూఎస్‌ఏలో)
►జులైలో శ్రీలంక పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, 3 టీ20లు టీమిండియా ఆడనుంది
►సెప్టెంబరులో భారత్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రానుంది. రెండు టెస్టులు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడనుంది.
►అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్(ఇంకా తేదీలను ఖారారు చేయలేదు)
►నవంబర్, డిసెంబరులలో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించనుంది . అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. (ఇంకా తేదీలను ఖారారు చేయలేదు)