Cricket Schedule
-
2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?
కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. జనవరి 3నుంచి కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుతో కొత్త సంవత్సర ప్రయాణాన్ని భారత జట్టు మొదలుపెట్టబోతుంది. గతేడాది టీమిండియా అద్భుతంగా రాణించి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ.. కీలకమైన వరల్డ్ కప్‌ను అడుగు దూరంలో కోల్పోయింది. ఇప్పటికీ అభిమానులు భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో 2024 జూన్‌లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే విధంగా భారత జట్టు కూడా ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదిలో భారత జట్టు షెడ్యూల్‌పై ఓ లూక్కేద్దం అఫ్గానిస్తాన్‌తో టీ 20 సిరీస్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది ►జనవరి 11న మొహాలీలో తొలి టీ 20 ►జనవరి 14న ఇండోర్‌లో రెండో టీ 20 ►జనవరి 17న బెంగళూరులో మూడో టీ 20 ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. ఇక ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ►జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు - హైదరాబాద్ ►ఫిబ్రవరి 02 నుంచి 06 వరకు రెండో టెస్టు - విశాఖపట్నం ►ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు మూడో టెస్టు - రాజ్‌కోట్ ►ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు - రాంచీ ►మార్చి 07 నుంచి 11 వరకు ఐదో టెస్టు - ధర్మశాల ►ఏప్రిల్- మే: ఐపీఎల్ సందర్భంగా రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ ►జూన్: టీ20 ప్రపంచకప్ (వెస్టిండీస్, యూఎస్ఏలో) ►జులైలో శ్రీలంక పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, 3 టీ20లు టీమిండియా ఆడనుంది ►సెప్టెంబరులో భారత్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రానుంది. రెండు టెస్టులు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడనుంది. ►అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్(ఇంకా తేదీలను ఖారారు చేయలేదు) ►నవంబర్, డిసెంబరులలో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించనుంది . అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. (ఇంకా తేదీలను ఖారారు చేయలేదు) -
3 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత శ్రీలంకతో టీమిండియా ఆడనుంది. భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 24 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్లు మూడు టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ముందుగా టెస్టు సిరీస్ జరుగుతుంది. నవంబర్ 11 నుంచి 13 వరకు ఇరు జట్ల మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డన్స్‌లో వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఇదే మైదానంలో నవంబర్ 16 నుంచి 20 వరకు తొలి టెస్టు ఆడతాయి. నవంబర్ 24 నుంచి 28 వరకు జరగనున్న రెండో టెస్టుకు నాగపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో టెస్టు(డిసెంబర్ 2-6) కూడా ఇక్కడే జరుగుతుంది. వన్డే షెడ్యూల్ మొదటి వన్డే: డిసెంబర్ 10, ధర్మశాల రెండో వన్డే: డిసెంబర్ 13, మొహాలి మూడో వన్డే: డిసెంబర్ 17, వైజాగ్ టి20 షెడ్యూల్ ఫస్ట్ టి20: డిసెంబర్ 20, కటక్ సెకండ్ టి20: డిసెంబర్ 22, ఇండోర్ థర్డ్ టి20: డిసెంబర్ 24, ముంబై -
22న అడిలైడ్‌లో... 23న పుణేలో
ఒక్క రోజు వ్యవధిలోనే రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆస్ట్రేలియా భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ షెడ్యూల్ విడుదల న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచ క్రికెట్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో చెప్పేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను చూస్తే అర్థమవుతుంది. ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు సంబంధించిన తేదీలను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నారుు. అరుుతే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ షెడ్యూల్ అటు ఆస్ట్రేలియా జట్టును తెగ ఇబ్బందిపెట్టనుంది. ఎందుకంటే ఈ సిరీస్ ప్రారంభానికి ఒక్క రోజు ముందే (ఫిబ్రవరి 22న) ఆసీస్ జట్టు అడిలైడ్‌లో శ్రీలంకతో టి20 డే అండ్ నైట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అంటే ఒక్క రోజు వ్యవధిలోనే ఆ జట్టు పుణేలో జరిగే తొలి టెస్టుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దీంతో ఆసీస్ పూర్తిగా రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే కెప్టెన్ స్టీవ్ స్మిత్, డాషింగ్ ఓపెనర్ వార్నర్, స్టార్క్‌లాంటి స్టార్ ఆటగాళ్లు టి20 సిరీస్‌కు దూరం కావాల్సిందే. గతంలో కూడా ఆసీస్ జట్టుకు ఇలాంటి అనుభవం ఎదురైంది. 2014, నవంబర్ 3న అబుదాబిలో పాక్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం 5న అడిలైడ్‌లో దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అరుుతే టెస్టు ఆడిన ఆటగాళ్లెవరూ టి20 జట్టులో లేరు. ఇదీ షెడ్యూల్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా పిలుచుకునే ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 29 వరకు సాగుతుందని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. తొలి మ్యాచ్‌కు పుణే ఆతిథ్యమివ్వనుండగా... మార్చి 4 నుంచి 8 వరకు జరిగే రెండో టెస్టు బెంగళూరులో జరుగుతుంది. 16 నుంచి 20 వరకు జరిగే మూడో టెస్టుకు రాంచీ... 25 నుంచి 29 వరకు జరిగే చివరి టెస్టుకు ధర్మశాల తొలిసారిగా ఆతిథ్యమివ్వనున్నారుు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగియగానే ఆసీస్ టెస్టు ఆటగాళ్లు భారత్‌కు రానున్నారు.