‘కొత్త సంవత్సరం అంటే పార్టీ చేసుకోవడం మాత్రమే కాదు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం’ అనే ఎరుకతో వ్యవహరించాలి. ‘కొత్త సంవత్సరం తీసుకునే నిర్ణయాలు అట్టే కాలం ఉండవు’ అనే మాట ఎలా ఉన్నా ఎంతోమంది తమను తాము మెరుగుపరుచుకోవడానికి, వ్యసనాలకు దూరం కావడానికి అవి ఉపయోగపడ్డాయి.
- మే ది న్యూ ఇయర్ బ్రింగ్ యూ మోర్ హ్యాపీనెస్, సక్సెస్, లవ్ అండ్ బ్లెస్సింగ్స్
- 2024 ఈజ్ యువర్ ఇయర్, ఐ కెన్ ఫీల్ ఇట్. చీర్స్ టు ఏ న్యూ ఇయర్ అండ్ న్యూ ఆపర్చునిటీస్
- న్యూ ఇయర్ బ్రింగ్స్ అజ్ లాట్స్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జ్జయిటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ లివ్స్ దిస్ న్యూ ఇయర్ విల్ బీ అవర్ ఇయర్.. హ్యాపీ న్యూ ఇయర్
- ఏ న్యూ ఇయర్ ఈజ్ లైక్ ఏ బ్లాంక్ బుక్, అండ్ ది పెన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.. ఇట్ ఈజ్ యువర్ చాన్స్ టు రైట్ ఏ బ్యూటీఫుల్ స్టోరీ ఫర్ యువర్ సెల్ఫ్.. హ్యాపీ న్యూ ఇయర్.
ఫుల్ జోష్‌తో ఫ్యూచర్ ప్లాన్..
ఆరోజుల్లో రావుగోపాల్‌రావు ఏమన్నారండీ? ‘మడిసన్నాక కాస్త కళాపోసణ ఉండాలి’ అని. ‘కళా పోషణ’ మాట ఎలా ఉన్నా కలర్‌ఫుల్ ఫ్యూచర్ ప్లాన్
కంపల్సరీగా ఉండాలి. ప్రతి విజేత విజయం వెనుక బలమైన ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం మన జీవితాల్లోకి
వస్తుంది. 365 పేజీల ఖాళీ పుస్తకం మన చేతికి అందుతుంది. మొదటి పేజీలో ‘ఫ్యూచర్ ప్లాన్’ రాసుకున్న వారికి చివరి పేజీ కల్లా విజయం చేతికి అందుతుంది. ఈసారి ప్రయత్నించి చూడండి..
- మోస్ట్ చాలెంజింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌గా చెప్పుకునే ‘నీట్’లో మెరిసిన విజేతలు చారుల్ హోనరియ, ఉమర్ అహ్మద్ గనై. పెద్ద విజయాలు సాధించడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డుగోడ కాదు అని నిరూపించారు వీరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కర్తార్‌పూర్ గ్రామానికి చెందిన చారుల్ ‘నీట్’ ప్రవేశ పరీక్షలో 720 మార్కులకు 680 మార్కులు తెచ్చుకుంది. ఆమె తండ్రి పేద రైతు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుమార్తెను చదువుకు దూరం చేయలేదు.
- జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమర్ అహ్మద్ గనై ‘నీట్’లో 720 మార్కులకు 601 మార్కులు తెచ్చుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన ఉమర్ అహ్మద్ కూలీపనులు చేస్తూనే చదువుకున్నాడు. ‘నీట్’లో ఆల్–ఇండియా ర్యాంక్(ఏఐఆర్) తెచ్చుకున్న ఈ ఇద్దరు విజేతలు అదృష్టవశాత్తు అపూర్వ విజయం సాధించిన వారు కాదు. ఈ ఇద్దరి విజయం వెనుక బలమైన ఫ్యూచర్ ప్లాన్ ఉంది.
- భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకున్నప్పుడు మన బలాబలాల గురించి విశ్లేషించుకునే అవకాశం దొరుకుతుంది. డాక్టర్ కావాలనేది చారుల్ లక్ష్యం. ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్న చారుల్ తన ఫ్యూచర్ ప్లాన్‌లో ‘ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించాలి’ అని రాసుకుంది. అక్షరాలా సాధించింది.
- ‘కొన్నిసార్లు చాలా కష్టపడినప్పటికీ ఫలితం చేతికి అందదు. దీనికి కారణం సరిౖయెన ప్రణాళిక లేకపోవడమే’ అంటున్న ఉమర్ అహ్మద్ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లాడు. ‘నీట్’ గత విజేతలు చెప్పిన టిప్స్, సలహాలు నోటు చేసుకునేవాడు. పొద్దున కూలి పనులతో అలిసిపోయినా, ఆ అలసటను పక్కన పెట్టి ‘నీట్’ కోసం ప్రిపేరయ్యేవాడు.
ఈ ఇద్దరు మాత్రమే కాదు ‘భవిష్యత్ ప్రణాళిక’ ఆధారంగా వివిధ రంగాలలో విజయం సాధించిన యువతీ, యువకులు ఎంతోమంది కనిపిస్తారు.
- ‘భవిష్యత్ దర్శనం అనూహ్యం, అసాధ్యమైనది కాదు. నేటి ప్రణాళికతో అద్భుత భవిష్యత్ సృష్టించుకోవచ్చు’
- ‘నేటి ప్రణాళిక.. రేపటి ఫలితం’
- ‘నేటి కార్యాచరణపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది’
- ‘మనలో డ్రీమర్, ప్లానర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వారు కలిసినప్పుడే విజయం సాధ్యం అవుతుంది’
- ‘ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్.. లివ్ ఫర్ టుడే’ ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు ఎన్నో ఉన్నాయి.
► చెన్నైకి చెందిన 22 సంవత్సరాల అరుణ్‌ను కొన్ని సంవత్సరాలుగా ‘స్మోకింగ్’ అనే వ్యసనం దెయ్యంలా పట్టి పీడిచింది. గత సంవత్సరం తొలిరోజు ‘ఈరోజు నుంచి సిగరెట్ ముట్టను’ అన్నప్పుడు ఫ్రెండ్స్ బిగ్గరగా నవ్వారు. అయితే అరుణ్ ఇప్పటి వరకు ఒక్క సిగరెట్ కూడా ముట్టలేదు. ‘చాలా పెద్ద విజయం సాధించినట్లుగా ఉంది. సిగరెట్ తాగను అని ప్రతిజ్ఞ అయితే చేశానుగానీ నా మీద నాకే డౌట్ వచ్చేది. అయితే బయటికి మాత్రం గంభీరంగా ఉండేవాడిని. ఒక వ్యసనానికి వారం రోజులు దూరంగా జరిగితే చాలు మన మీద మనకు నమ్మకం వస్తుంది. ఒక నెల దూరంగా జరిగితే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక కొన్ని నెలలు దూరంగా ఉంటే ఎంత పెద్ద వ్యసనమైనా మన పరిసరాల్లో లేకుండా పారిపోతుంది’ అంటున్నాడు అరుణ్.
గతంలో యువతరం కొత్త సంవత్సరం ఎజెండాలో వ్యసనానికి దూరంగా ఉండాలనేది ప్రధానంగా కనిపించేది. ఇప్పుడు మాత్రం అనేకానేక అంశాలు ఆ ఎజెండాలో వచ్చి చేరాయి. అందులో కెరీర్ ప్లానింగ్ ప్రధానమైనది. అదిగో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా!
Comments
Please login to add a commentAdd a comment