Future planning
-
NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం
ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచి్చన కొత్తలో రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా మారిపోతుంది. పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కలి్పంచేదే ఎన్పీఎస్ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కలి్పంచే కథనమిది... తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరి్థక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50–60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి సమకూరుతుంది. వాత్సల్య ఎవరికి? 2024–25 బడ్జెట్లో పిల్లల కోసం పింఛను పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను ఆరి్థక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్పీఎస్ వాత్సల్య వీలు కలి్పస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్పీఎస్ టైర్–1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్పీఎస్కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ట పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.సంరక్షకుల హక్కుఖాతాదారు (మైనర్) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.ఉపసంహరణ వాత్సల్యకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్ధేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు. ఎక్కడ ప్రారంభించాలి? ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ–ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు రంంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎన్పీఎస్ వాత్సల్యను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో ప్రొటీన్ ఈ–గవ్ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్ ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు. వైదొలగడం పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్ లీవింగ్ సరి్టఫికెట్/ఎస్ఎస్సీ/పాన్ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి. అర్హతలు 18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ), ఓవర్సీస్ సిటిజన్íÙప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్దిదారు మైనరే అవుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్ పేరిట పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్/ప్రాన్)ను పీఎఫ్ఆర్డీఏ కేటాయిస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు యాక్టివ్ చాయిస్: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి. ఆటో చాయిస్: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్సీ)–75, ఎల్సీ–50, ఎల్సీ–25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్సీ–75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్సీ–50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్సీ–25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి. డిఫాల్ట్ చాయిస్: పైన చెప్పుకున్న ఎల్సీ–50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.చిన్న మొత్తమే అయినా.. పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ జారీ చేసింది. మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జని్మంచిన నాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్ మహిమ. ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు ఫించను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ‘‘ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్ డెట్ విభాగం 9.1 శాతం, జీ–సెక్ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్పీఎస్ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్ ఆరి్థక భద్రతపై దృష్టి సారించాలి’’అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపులతో కూడిన ఆప్షన్లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు. ఆన్లైన్లో ఎలా ప్రారంభించుకోవచ్చు? → ఈఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో ‘ఎన్పీఎస్ వాత్సల్య (మైనర్స్) రిజిస్ట్రేషన్’ను ఎంపిక చేసుకోవాలి. → ఇక్కడ మైనర్, గార్డియన్ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ కాపీలను అప్లోడ్ చేసి ‘కన్ఫర్మ్’ చేయాలి. → మొదట గార్డియన్ పుట్టిన తేదీ వివరాలు, పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి ‘బిగిన్ రిజి్రస్టేషన్’ను క్లిక్ చేయాలి. → మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. → ఆన్లైన్లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. → ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్ జారీ అవుతుంది. మైనర్ పేరిట ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభం అవుతుంది. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
భవిష్యత్తు ప్రణాళిక బహు క్లిష్టం
సాక్షి, హైదరాబాద్: సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు.. ఎవరైనా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కీలకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళిక క్లిష్టంగా మారుతోంది. భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, స్తబ్ధతలో కూరుకుపోతున్నామనే భా వనలో మెజారిటీ ప్రజలున్నారు. 69 శాతం మంది భారతీయులు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని తేలింది. ఊహించని మార్పులను ఎదుర్కొంటున్నట్టుగా 91 శాతం మంది అంగీకరించారు. పరిస్థితుల ›ప్రభావంతో ఆత్మవిశ్వాసం, నమ్మకం సన్నగిల్లుతుండడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధంగా లేమని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తులుగా.. సరైన వేళకు.. సరైన నిర్ణయాలు తీసుకో లేకపోతున్నామని మధనపడుతున్నట్లు 57 శాతం పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం.. హెచ్ఎస్బీసీ సంస్థ ఆధ్వర్యంలో.. భారత్, హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, యూకే, యూఎస్‌లలోని వివిధ రంగాలు, మార్కెట్లకు చెందిన దాదాపు 18వేల మంది వ్యక్తులు (దాదాపు 4 వేల బిజినెస్ లీడర్లు)పై జరిపిన గ్లోబల్ స్టడీ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలపై హెచ్ఎస్బీసీ ఇండియా హెడ్ (వెల్త్ అండ్ పర్సనల్ బ్యాంకింగ్) సందీప్ బాత్రా స్పందిస్తూ.. దైనందిన జీవనంలో సమస్యలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనేందుకు.. ఏదో ఒక రూపంలో సహాయపడాలని హెచ్ఎస్బీసీ భావిస్తోందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జీవితంలో క్లిష్టమైన సవాళ్లు ఎదురైనపుడు అంతర్జాతీయ నెట్వర్క్ సహాయంతో అనిశి్చతిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివేదికలో ఏముందంటే.. » వేగంగా మార్పులు సంభవిస్తున్న యుగంలో తామున్నట్టు 91 శాతం మంది భారతీయుల భావన » భవిష్యత్ ప్రణాళికల రచనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 69 శాతం మంది ఉన్నారు. » తీసుకున్న నిర్ణయాల అమలుకు సిద్ధంగా లేమని భావిస్తున్నవారు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనుకున్నవారు 62 శాతం మంది ఉన్నారు. » తగిన సమయంలో అవకాశాలు కోల్పోయినందుకు, తగిన నిర్ణయం తీసుకోలేకపోయినందుకు చింతిస్తున్నవారు 57 శాతం మంది ఉన్నారు. » తాము తీసుకున్న నిర్ణయాలు చివరకు సరైనవి కావనే భావనలో 46 శాతం మంది ఉన్నారు. » సరైన నిర్ణయాలు తీసుకోలేక.. వాటిని వీలైనంత వాయిదా వేస్తున్న వారు 42 శాతం మంది ఉన్నారు. » నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 33 శాతం మంది ఉన్నారు.భారత్‌కు యూఎస్ తోడుఈ అధ్యయనానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. భారత్‌లో మాదిరిగానే యూఎస్ఏలోనూ 47 శాతం మంది అ మెరికన్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు.» అమెరికన్లలో 33 శాతం మంది తాము తీసుకున్న పాత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. » ఐదేళ్లలో.. ఇతరులతో సంబంధం లేకుండా వేరుగా ఉన్నామనే భావనలో 43 శాతం అమెరికన్ మహిళలున్నారు. అదే పురుషుల విషయానికొస్తే 26 శాతంగా ఉంది.» యూఎస్‌లో బిజినెస్ లీడర్లు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోల్చితే భవిష్యత్ ప్రణాళికలు మరింతగా సవాళ్లతో కూడుకున్నవనే భావనలో 51 శాతం మంది ఉన్నారు. -
ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా!
‘కొత్త సంవత్సరం అంటే పార్టీ చేసుకోవడం మాత్రమే కాదు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం’ అనే ఎరుకతో వ్యవహరించాలి. ‘కొత్త సంవత్సరం తీసుకునే నిర్ణయాలు అట్టే కాలం ఉండవు’ అనే మాట ఎలా ఉన్నా ఎంతోమంది తమను తాము మెరుగుపరుచుకోవడానికి, వ్యసనాలకు దూరం కావడానికి అవి ఉపయోగపడ్డాయి. మే ది న్యూ ఇయర్ బ్రింగ్ యూ మోర్ హ్యాపీనెస్, సక్సెస్, లవ్ అండ్ బ్లెస్సింగ్స్ 2024 ఈజ్ యువర్ ఇయర్, ఐ కెన్ ఫీల్ ఇట్. చీర్స్ టు ఏ న్యూ ఇయర్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ న్యూ ఇయర్ బ్రింగ్స్ అజ్ లాట్స్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జ్జయిటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ లివ్స్ దిస్ న్యూ ఇయర్ విల్ బీ అవర్ ఇయర్.. హ్యాపీ న్యూ ఇయర్ ఏ న్యూ ఇయర్ ఈజ్ లైక్ ఏ బ్లాంక్ బుక్, అండ్ ది పెన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.. ఇట్ ఈజ్ యువర్ చాన్స్ టు రైట్ ఏ బ్యూటీఫుల్ స్టోరీ ఫర్ యువర్ సెల్ఫ్.. హ్యాపీ న్యూ ఇయర్. ఫుల్ జోష్‌తో ఫ్యూచర్ ప్లాన్.. ఆరోజుల్లో రావుగోపాల్రావు ఏమన్నారండీ? ‘మడిసన్నాక కాస్త కళాపోసణ ఉండాలి’ అని. ‘కళా పోషణ’ మాట ఎలా ఉన్నా కలర్‌ఫుల్ ఫ్యూచర్ ప్లాన్ కంపల్సరీగా ఉండాలి. ప్రతి విజేత విజయం వెనుక బలమైన ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం మన జీవితాల్లోకి వస్తుంది. 365 పేజీల ఖాళీ పుస్తకం మన చేతికి అందుతుంది. మొదటి పేజీలో ‘ఫ్యూచర్ ప్లాన్’ రాసుకున్న వారికి చివరి పేజీ కల్లా విజయం చేతికి అందుతుంది. ఈసారి ప్రయత్నించి చూడండి.. మోస్ట్ చాలెంజింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌గా చెప్పుకునే ‘నీట్’లో మెరిసిన విజేతలు చారుల్ హోనరియ, ఉమర్ అహ్మద్ గనై. పెద్ద విజయాలు సాధించడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డుగోడ కాదు అని నిరూపించారు వీరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కర్తార్‌పూర్ గ్రామానికి చెందిన చారుల్ ‘నీట్’ ప్రవేశ పరీక్షలో 720 మార్కులకు 680 మార్కులు తెచ్చుకుంది. ఆమె తండ్రి పేద రైతు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుమార్తెను చదువుకు దూరం చేయలేదు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమర్ అహ్మద్ గనై ‘నీట్’లో 720 మార్కులకు 601 మార్కులు తెచ్చుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన ఉమర్ అహ్మద్ కూలీపనులు చేస్తూనే చదువుకున్నాడు. ‘నీట్’లో ఆల్–ఇండియా ర్యాంక్(ఏఐఆర్) తెచ్చుకున్న ఈ ఇద్దరు విజేతలు అదృష్టవశాత్తు అపూర్వ విజయం సాధించిన వారు కాదు. ఈ ఇద్దరి విజయం వెనుక బలమైన ఫ్యూచర్ ప్లాన్ ఉంది. భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకున్నప్పుడు మన బలాబలాల గురించి విశ్లేషించుకునే అవకాశం దొరుకుతుంది. డాక్టర్ కావాలనేది చారుల్ లక్ష్యం. ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్న చారుల్ తన ఫ్యూచర్ ప్లాన్‌లో ‘ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించాలి’ అని రాసుకుంది. అక్షరాలా సాధించింది. ‘కొన్నిసార్లు చాలా కష్టపడినప్పటికీ ఫలితం చేతికి అందదు. దీనికి కారణం సరిౖయెన ప్రణాళిక లేకపోవడమే’ అంటున్న ఉమర్ అహ్మద్ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లాడు. ‘నీట్’ గత విజేతలు చెప్పిన టిప్స్, సలహాలు నోటు చేసుకునేవాడు. పొద్దున కూలి పనులతో అలిసిపోయినా, ఆ అలసటను పక్కన పెట్టి ‘నీట్’ కోసం ప్రిపేరయ్యేవాడు. ఈ ఇద్దరు మాత్రమే కాదు ‘భవిష్యత్ ప్రణాళిక’ ఆధారంగా వివిధ రంగాలలో విజయం సాధించిన యువతీ, యువకులు ఎంతోమంది కనిపిస్తారు. ‘భవిష్యత్ దర్శనం అనూహ్యం, అసాధ్యమైనది కాదు. నేటి ప్రణాళికతో అద్భుత భవిష్యత్ సృష్టించుకోవచ్చు’ ‘నేటి ప్రణాళిక.. రేపటి ఫలితం’ ‘నేటి కార్యాచరణపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది’ ‘మనలో డ్రీమర్, ప్లానర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వారు కలిసినప్పుడే విజయం సాధ్యం అవుతుంది’ ‘ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్.. లివ్ ఫర్ టుడే’ ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు ఎన్నో ఉన్నాయి. ► చెన్నైకి చెందిన 22 సంవత్సరాల అరుణ్‌ను కొన్ని సంవత్సరాలుగా ‘స్మోకింగ్’ అనే వ్యసనం దెయ్యంలా పట్టి పీడిచింది. గత సంవత్సరం తొలిరోజు ‘ఈరోజు నుంచి సిగరెట్ ముట్టను’ అన్నప్పుడు ఫ్రెండ్స్ బిగ్గరగా నవ్వారు. అయితే అరుణ్ ఇప్పటి వరకు ఒక్క సిగరెట్ కూడా ముట్టలేదు. ‘చాలా పెద్ద విజయం సాధించినట్లుగా ఉంది. సిగరెట్ తాగను అని ప్రతిజ్ఞ అయితే చేశానుగానీ నా మీద నాకే డౌట్ వచ్చేది. అయితే బయటికి మాత్రం గంభీరంగా ఉండేవాడిని. ఒక వ్యసనానికి వారం రోజులు దూరంగా జరిగితే చాలు మన మీద మనకు నమ్మకం వస్తుంది. ఒక నెల దూరంగా జరిగితే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక కొన్ని నెలలు దూరంగా ఉంటే ఎంత పెద్ద వ్యసనమైనా మన పరిసరాల్లో లేకుండా పారిపోతుంది’ అంటున్నాడు అరుణ్. గతంలో యువతరం కొత్త సంవత్సరం ఎజెండాలో వ్యసనానికి దూరంగా ఉండాలనేది ప్రధానంగా కనిపించేది. ఇప్పుడు మాత్రం అనేకానేక అంశాలు ఆ ఎజెండాలో వచ్చి చేరాయి. అందులో కెరీర్ ప్లానింగ్ ప్రధానమైనది. అదిగో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా! -
పెళ్లా? కెరీరా?.. క్షణం ఆలోచించకుండా తేల్చేస్తున్న అమ్మాయిలు..
పెళ్లా...? కెరీరా...? గతంలో అమ్మాయిలంతా ఎటూ తేల్చుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కెరీర్‌కే మొగ్గు చూపుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాతే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని...జీవితం హాయిగా సాగుతుందని భావిస్తున్నారు. అందువల్లే విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న జిల్లా అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. సాక్షి, అనంతపురం: ఇరవై ఏళ్లకు పెళ్లి, పాతికేళ్లకు పిల్లలు, ఇరవై ఎనిమిదేళ్లకు కెరీర్ ముగించి గృహిణిగా స్థిరపడడం...ఇది గతం. కానీ ఇప్పుడు అమ్మాయిలు కెరీర్‌ను సవాల్‌గా తీసుకుంటున్నారు. చదువు పూర్తికావాలి, ఆ తర్వాత ఉద్యోగం.. అప్పుడే పెళ్లి అంటున్నారు. 90 శాతం మంది అమ్మాయిల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. భర్త సంపాదన మీద నేను ఆధారపడటం కాదు నా సంపాదన కూడా కుటుంబానికి ముఖ్యం కావాలి అంటున్నారు. 24 ఏళ్ల వరకూ చదువులు, ఉద్యోగాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న వారి తీరు నిండైన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. పెళ్లిచేసుకుని భర్త వెంట అమెరికా, కెనడా వంటి దేశాలకు డిపెండెంట్ వీసా కింద వెళ్లడం కంటే...తానే అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని వెళితే.. మంచిది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ సవాల్‌గా తీసుకుని.. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో గతంలో ఓపెన్ కేటగిరీలో 30 శాతం కంటే మించని అమ్మాయిల సీట్లు... ఇప్పుడు 60 శాతానికి వెళ్లాయి. అమెరికాలో రమారమి 30కిపైన ప్రధాన యూనివర్సిటీల్లో అనంతపురం జిల్లా అమ్మాయిలు చదువుతున్నట్టు తేలింది. ఇక ఏటా విదేశాలకు విద్య, ఉద్యోగావకాశాలకోసం వెళ్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంటెక్ కోర్సులకు జిల్లా దాటి వెళ్లని వారు... ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక నిట్లు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు. దీన్ని బట్టి కెరీర్‌ను ఎంత సవాల్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ కొన్ని రోజులుగా మార్పు వస్తోంది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసి బాధ్యతలు దించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు స్వేచ్ఛనిస్తున్నారు. చదవండి: (తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!) ముందు ఎదగాలి జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యం. అందుకే నేను కూడా బీఫార్మసీ... ఆ తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేశా. పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. ఉన్నత చదువుతో సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. మా నాన్న కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ చదివిస్తున్నారు. – ఎన్. సుశీల, ఎంఫార్మసీ, ఎస్కేయూ పోటీతత్వం పెరిగింది అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా పెంపొందించుకుంటున్నారు. సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో పోటీతత్వం పెరిగింది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడే విధంగా అంతర్జాతీయ సదస్సులు, జాతీయ సదస్సుల్లో తరచుగా పాల్గొనేలా మేమూ ప్రేరణ కలిగిస్తున్నాం. – డాక్టర్ వి. శైలజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంబీఏ విభాగం, ఎస్కేయూ. స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి సమాజం పురోగతి చెందాలంటే లింగ వివక్ష, అసమానతలు ఉండకూడదు. మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థిక, సమాజ, రాజకీయ సాధికారిత సాధిస్తున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోనూ ఇలాంటి అంశాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ వరలక్ష్మి దేవి, పరీక్షల విభాగం సమన్వయకర్త, ఎస్కేయూ మంచి ఉద్యోగంతో గుర్తింపు అమ్మాయిలు గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం అనిపించకూడదు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా స్థిరపడతామో అప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. – బి.హిమవర్షిణి, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, మైక్రాన్ టెక్నాలజీ -
భవిష్యత్తు బాగుండాలంటే..?
‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్డౌన్లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు. ఆదాయం ఆగిపోతుంది.. సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్‌తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి. ప్రశాంతత కోసం.. భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. అపరాధ భావం ఎందుకు? చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు.. అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు. వారసత్వం విషయంలో... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి. పెద్ద లక్ష్యాలు జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఆర్థిక స్వేచ్ఛ వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు. పురోగతి జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్‌నిస్తుంది. పదేళ్ల కెరీర్ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు. మెరుగైన మార్గం.. చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్’ పాత్ర ఉంటుంది. రుణ ఊబిలోకి వెళ్లొద్దు.. రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుసరించాల్సిన ప్రణాళిక ► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్ రూపంలో చేస్తున్న డెట్ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ► ఎండోమెంట్, మనీబ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. -
మనసు మాట విందాం!
సాక్షి, హైదరాబాద్: ‘ఖాళీ బుర్ర దెయ్యాల కొంప’ అని నానుడి. కరోనా విపత్తు వేళ అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఈ ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా మలచుకుంటుంటే.. పలువురు భవిష్యత్తుపై బెంగతో దిగులు చెందుతున్నారు. ఒకపక్క మహమ్మారిపై భయాందోళనలు.. మరోపక్క రేపటి గురించి చింత మనిషిని నిస్పృహలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా యోగ, ధ్యానం, పుస్తక పఠనం, ఇతరత్రా వ్యాపకాలతో సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలని, ఆలోచనల్ని నియంత్రించుకోవడం ఈ సమయంలో కీలకమని ప్రపంచ ప్రసిద్ధ రచనలు చెబుతున్నాయి. కొందరు ప్రసిద్ధ రచయితలు తమ పాపులర్ రచనల్లో ఏం చెప్పారంటే.. ఆలోచనల్లోనే ఆ ‘సీక్రెట్’.. ‘చిన్నారులు ఎంత చలాకీగా, ఎంత స్వచ్ఛంగా ఉంటారో, చింతలు, చికాకులు లేకుండా ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారో అంత ఉత్సాహంగా ఉండగలగడమే నిజమైన ఆరోగ్యం’ – రోండాబర్న్, ‘ది సీక్రెట్’ రచయిత్రి మనసులో దేన్నైతే నమ్ముతామో..అదే అవుతుంది. భగవద్గీత చెప్పేది కూడా అదే– ‘నువ్వు ఏమని భావిస్తావో అదే అవుతావు’ అని. అందుకే ఆరోగ్యం, వికాసం కోసం మంచి ఆలోచనలు చేయాలి. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేలా ఆలోచనల్ని మలచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంపై అనవసర భయాలు వదిలేయాలి. ‘నేను బాగున్నాను’ అనే భావన మనిషిని శక్తిమంతం చేస్తుంది. ‘ది సీక్రెట్’ పుస్తకమంతా ఈ ఆరోగ్యకరమైన ఆలోచనా రహస్యాలనే చెబుతుంది. మైండ్ ‘పవర్’ ఎంతో తెలుసా? ‘భయం స్థానంలో ధైర్యాన్ని, అనారోగ్యం స్థానంలో ఆరోగ్యాన్ని, నిరాశ స్థానంలో ఆశావహ దృక్పథాన్ని నింపుకోవాలి. ‘నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా’ననే భావన మంచి ఆరోగ్యాన్నిస్తుంది’ – జోసెఫ్ మర్ఫీ, ‘ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్’ రచయిత మనలో సానుకూల ఆలోచనా ధోరణి పెరగాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలని, అదే సమయంలో కుటుంబసభ్యుల్ని, బంధుమిత్రుల్ని, సమాజాన్ని ప్రేమించాలని, మనకు సేవలందిస్తున్న వారిపై కృతజ్ఞత కలిగి ఉండాలంటాడు రచయిత జోసెఫ్ మర్ఫీ. ‘ఆందోళనలు, అనారోగ్యాలు సహజం. అయితే వాటిని అధిగమిస్తాన’నే భావన మంచి చేస్తుందని వివరిస్తాడు. ఈ మాటలు ఈ సమయంలో ఆచరణీయమని మానసిక నిపుణుడు వీరేందర్ అంటున్నారు. ఈ ఖాళీ సమయంలో బంధుమిత్రులు, సన్నిహితులతో కొత్త సంబంధాలు ఏర్పర్చుకోవచ్చని, జీవితంలో సాయపడ్డ గురువులు, శ్రేయోభిలాషులను ఫోన్లో పలకరించి కృతజ్ఞతలు చెప్పవచ్చని, కొత్త స్నేహాలకు శ్రీకారం చుట్టొచ్చని చెబుతున్నారు. విజయానికి కొత్తదారి.. ‘అవరోధాలే భవిష్యత్తుకు నిచ్చెనలు. కష్టాలు, సమస్యలు ఎదురైతే భయపడకుండా కొత్త దారి వెతుక్కోవాలి. జీవితాన్ని మరింత ఆనందంగా, ఆర్థికంగా మలచుకునేందుకు దీనినో అవకాశంగా భావించాలి. ఈ ఆలోచనా ధోరణి సంతోషాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది’ – ‘రోడ్ టు సక్సెస్’లో నెపోలియన్ హిల్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఉ ద్యోగాలు పోతాయని, జీతాల్లో కోతలుంటాయనే భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రజల్లో అభద్రతభావం పెరుగుతోంది. ఇలాంటి క్లిష్ట స మయంలోనే మనిషి తానేం టో నిరూపించుకోవాలని, తీ వ్ర శ్రమ, ఉన్నత వ్యక్తిత్వం, సానుకూల ఆలోచనలు, సరైన ప్రణాళికలు, మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాల ని పై పుస్తకం చెబుతోంది. క్రమబద్ధమైన ఆలోచనలు, ప్రయత్నాలు, కొత్త ఆశలు, ప్రార్థనలు విజయతీరాలకు చేరుస్తాయి. ఇందుకోసం సానుకూల భావాలతో ఉండటమే మార్గం. ఈ పుస్తకంలోని ఉన్నత వ్యక్తిత్వాలను చదివి ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్ఫూర్తిపొందారని మానసిక నిపుణుడు వీరేందర్ అంటున్నారు. చింత వీడితే ఆనందమే అంతా.. ‘వివేకవంతునికి ప్రతిరోజూ కొత్త జీవితమే. ఈ రోజును నేను ఎంతో ఉత్సాహంగా, ఉన్నతంగా మలచుకుంటా. ఆ రోజున ఆరోగ్యంగా ఉంటా, తెలివిగా వ్యవహరిస్తా, నా కలలను నెరవేర్చుకుంటా’ – డేల్ కార్నెగీ, ‘హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ రచయిత ‘నాకు ప్రతిరోజూ కొత్త జీవితమే.. ఈ విధంగా రోజూ ఉదయాన్నే సంకల్పాన్ని తీసుకోవాలి. మనలోని ఆందోళనకు మూలమేమిటో కచ్చితంగా కనుక్కోవాలి. అప్పుడు పరిష్కారం గురించి ఆలోచించి అమల్లో పెట్టాలి. సమస్యేమిటో తెలిస్తే సగం రోగం నయమైనట్టే’ అంటారు రచయిత డేల్ కార్నెగీ. మానసిక ఆందోళన నుంచి బయట పడటానికి నిత్యం ఏదో పనిలో నిమగ్నం కావాలని, కొత్త వ్యాపకాలు కల్పించుకోవాలని చెబుతారు. డేల్ కార్నెగీ చెప్పినట్టే.. ప్రస్తుత పరిస్థితులను యథాతథంగా తీసుకొని, కొత్త జీవితాన్ని ఆస్వాదించడమే మన ముందున్న మార్గమని ప్రముఖ మానసిక నిపుణుడు వీరేందర్ అంటున్నారు. -
నగరంలో మాస్టర్‌ప్లాన్
నగర పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి తొలివిడతలో దేవరకొండకు స్థానం రానున్న 30ఏళ్లలో పెరిగే జనాభాకనుగుణంగా ప్రణాళిక నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో బేస్ మ్యాప్‌ల సేకరణ దేవరకొండ : నగర పంచాయతీల్లో రానున్న 30 ఏళ్లలో పెరగనున్న జనాభా... ప్రజా అవసరాలు... ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పనులు... మౌలిక అవసరాలు.. భవిష్యత్ ప్రణాళికవంటి వాటిపై ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధమైంది. రాష్ట్రంలో 68 నగర పంచాయతీలు ఉండగా ముందస్తుగా 27 నగర పంచాయతీలను ఎంపిక చేసింది. అందులో జిల్లాలోని దేవరకొండ నగర పంచాయతీకి స్థానం దక్కింది. పురపాలక శాఖ ద్వారా మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించి ముందస్తుగా బేస్ మ్యాప్‌లను తయారు చేసేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో ఉపగ్రహ చాయాచిత్రాలను సేకరించే అవకాశం ఉంది. తద్వారా నగరాలు, పట్టణాల అభివృద్ధికి బీజం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దేవరకొండ నగర పంచాయతీ విస్తీర్ణం 28.1 స్క్వీయర్ మీటర్లు. మొత్తంగా 20వార్డులు ఉండగా జనాభా 35వేలు ఉంటుంది. ఇక రోజూవచ్చిపోయే వారి సంఖ్య అదనంగా 10వేలు ఉంటుందని అం చనా. పట్టణం నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీ య రహదారికి అతి సమీపంలో ఉంటుంది. హైవేపై ఉన్న కొండమల్లేపల్లి, దేవరకొండ పట్టణం కలిసే ఉంటాయి. ఇక..చందంపేట మండల వాసులు చాలా మంది పట్టణంలోనే నివాసం ఉంటారు. ఇక.. డిండి, చింతపల్లి మండలవాసులు వ్యాపారరీత్యా దేవరకొండకు వచ్చిపోతుంటారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి.. గత పరిస్థితులను అధిగమించేందుకే.. పాలకులు, అధికారులు మారుతున్నారు. అభివృద్ధి కోసం ఎవరి ప్లాన్ వారిది... ఒకరు ఒక ప్రాజెక్టు అవసరమని గుర్తిస్తే ఆ పనులు పూర్తయ్యేలోపు ప్రభుత్వాలు మారడం, ఆ పనికి ఫుల్స్టాప్ కూడా పడుతుంది. ఇలా ఎన్నో పనులు మరుగునపడ్డ దాఖలాలున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఉన్న జనాభా అవసరాలకు పనులను గుర్తిస్తే పెరిగే జనాభా వల్ల చేసిన అభివృద్ధి నిర్వీర్యం అవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పెరిగే జనాభా, భూ వినియోగం, ప్రజా ప్రయోజనాలు గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయనుంది. అమలైతే.. ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నగర ప్లాన్ అమలైతే రాను న్న ముందు తరాలకు పూర్తి స్థాయిలో అన్ని రకాలైన వసతులు ముందస్తుగానే ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న జనాభా మరో 20 ఏళ్ళలో పెరిగే జనాభాకు అనుగుణంగా కళాశాలలు, విద్యా, వైద్య సౌకర్యాలు జనాభాకు అనుగుణంగా నివాస స్థలలు,, రోడ్లు వంటి వసతులు వనగూరే అవకాశం ఉంది. ప్లాన్ ద్వారా ప్రజల అవసరాలను ముందస్తుగానే గుర్తించడం ద్వారా ముందు తరాలకు అన్ని సౌకర్యాలు ముందుగానే సమకూరుతాయి. -
ఏఐసిసి భవిష్యత్ ప్రణాళిక
న్యూఢిల్లీ: ఏఐసిసి గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమిని సమీక్షిస్తూ, పనిలో పనిగా భవిష్యత్ ప్రణాళికను కూడా రూపొందిస్తోంది. ఏఐసీసీ కార్యాలయంలో ఈ రోజు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, ఏకె ఆంటోని, జైరాం రమేష్ ఏపి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలపై చర్చించారు. రాష్ట్రాల నేతలు కారణాలను విశ్లేషించారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన ఏపి పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చిరంజీవి, జేడీ శీలం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారు. -
భవిత వైపు వడివడిగా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కార్యాచరణకు ఉపక్రమించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని.. పార్టీని ప్రజాక్షేత్రంలో బలమైన, బాధ్యతాయుతమైన రాజకీయపక్షంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం రాజమండ్రి వేదికగా నియోజకవర్గాల సమీక్షకు నిర్ణయించారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని ఈ నెల 4, 5 తేదీల్లో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. జిల్లా సమీక్ష ఇలా... పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ను ఈ నెల 4న నిర్వహిస్తారు. అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ సమీక్షను కూడా ఆ రోజే నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను ఈ నెల 5న నిర్వహిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షకు అరగంట సమయం కేటాయించారు. ఈ సమావేశాల్లో పార్టీ అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15మంది వరకు ముఖ్య నేతలు పాల్గొంటారు. భవిత దిశగా అడుగులు... పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం.. భవిష్యత్తు కార్యాచరణే ప్రధాన లక్ష్యాలుగా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు. ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతోపాటు పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. రాష్ట్రస్థాయిలో పార్టీ విధానాలతోపాటు జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై కూడా దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘నేనున్నాను’అని జగన్మోహన్రెడ్డి సందర్భంగా భరోసా ఇవ్వనున్నారు. అధికారాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ పార్టీకి గణనీయమైన ఓట్లు రావడంతో కార్యకర్తలు డీలాపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పనున్నారు. ఇక నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని నేతలకు అధినేత స్పష్టం చేయనున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై జిల్లా నేతల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని నేతల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను క్రోడీకరించి హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో చర్చించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా ఉంది. అందువల్లే రాజమండ్రిలో జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ప్రజలకు మరింత చేరువవుతాం...
సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కమిషనర్‌గా ఏడాది పూర్తి సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన సేవలందించేందుకు తాము ప్రజలకు మరింత చేరువవుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 4వ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఈనెల 27కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆనంద్ గురువారం గతేడాది తాము సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ ప్రణాళికను మీడియాకు వివరించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అభయ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకుని, పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి దోషులకు శిక్షపడేలా చేయడంలో సఫలమయ్యామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐటీ కారిడార్ పోలిసింగ్‌ను డీజీపీ ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించామని, ఇందు కోసం ప్రత్యేకంగా ఐదు పెట్రోలింగ్ వాహనాలను, 40 మంది సిబ్బందిని, వీరిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ఇన్స్పెక్టర్ను నియమించామన్నారు. ఇక ఐటీ ఉద్యోగినిల భద్రత కోసం రవాణా వ్యవస్థను మెరుగపర్చడంతో పాటు ప్రతి క్యాబ్‌కు పోలీసు రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పని సరి చేశామన్నారు. దీనికి తోడు మహిళా ఇన్స్పెక్టర్ నేతత్వంలో మహిళా హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేసి.. ఐటీ ఉద్యోగినుల్లో ఆత్మస్థైర్యం పెంచామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయన్నారు. సైబరాబాద్‌లో సుమారు 250 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో గతంలో 80 కంపెనీలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉండగా... ఈ ఏడాది 150 కంపెనీలను చేర్చామన్నారు. భవిష్యత్తులో అన్ని కంపెనీలను ఇం దులో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేశామన్నారు. ఇక ఈనెలలో సిక్‌చావ్నీలో జరిగిన మతఘర్షణలు వేరే ప్రాంతాలకు విస్తరించకుండా తమ సిబ్బం ది, అధికారులు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి... నగర ట్రాఫిక్ చీఫ్‌గా తనకు ఉన్న గతానుభవంతో సైబరాబాద్‌లో సైతం ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతితో కలిసి ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు ఫలించాయన్నారు. రద్దీ జంక్షన్లను మోడ్రన్ జంక్షన్లుగా చేసి పాదచారులు సులువుగా రోడ్డు దాటే అవకాశం కల్పించామన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డుపై 24 గంటలూ పోలీసు గస్తీని ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల భరతం పట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ను ఉధృతం చేయడంతో పాటు దేశంలోనే మొదటిసారిగా ‘ఔటర్’పై లేన ్లవారీ వేగ నియంత్రణ అమలు చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. సిక్చావ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం... సిక్‌చావ్నీలో ఎన్నో ఏళ్లుగా రగులుతున్న మత విద్వేషాలకు చెక్ పెట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇరు మత పెద్దలతో ఇప్పటికే సమావేశమై ఈ విషయంపై చర్చించామన్నారు. ఒక వర్గానికి చెందిన జెండా విషయంలో తరచు గొడవలు జరగడం మంచిది కాదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయపార్టీల నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరువర్గాల మతపెద్దలతో త్వరలో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఆనంద్ వెల్లడించారు. -
ఆ విషయంలో కొన్ని తప్పులు చేశా!
‘జయం’ సినిమాలో నితిన్‌ని ‘వెళ్లవయ్యా వెళ్లూ...’ అంటూ ఆటపట్టించిన పరికిణీ పాప గుర్తుంది కదూ!? ఆ ఒక్క సినిమాతో తారాపథానికి దూసుకుపోయారు నటి సదా. శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ చేసి, హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత సడన్‌గా కెరీర్లో వెనకబడ్డారు. ఇటీవలే ‘యమలీల-2’లో గెస్ట్ సాంగ్ చేసిన సదా భవిష్యత్ ప్రణాళికలేంటి? కెరీర్ గురించి ఆమె విశ్లేషణేంటి? కొంత విరామం తర్వాత ‘యమలీల 2’లో ఐటమ్ సాంగ్ ద్వారా కనిపించనున్నారు.. ఈ పాట ఎలా ఉంటుంది? అది ఐటమ్ సాంగ్ కాదు. మామూలుగా ఏదైనా సినిమాలో ఒకే ఒక్క పాటకు డాన్స్ చేస్తే చాలు.. ఐటమ్ సాంగ్ అంటారు. ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఈ పాటను అలా అనలేం. కథానుసారంగా వచ్చే పాట ఇది. నేను దేవకన్య గెటప్‌లో కనిపిస్తాను. నా కాస్ట్యూమ్స్, డాన్స్.. అన్నీ బాగుంటాయి. కొన్ని కొన్నిసార్లు.. ఒక పాట, ఒక సీన్ కూడా బ్రేక్ తీసుకు రావచ్చంటారు.. మీరేమంటారు? నేనో సినిమా ఒప్పుకున్న తర్వాత, నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సినిమా మనకు మంచి బ్రేక్ అవుతుందా? లేదా లాంటివి ఆలోచించను. ‘జయం’తో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత బాగానే సినిమాలు చేశారు. హఠాత్తుగా అవకాశాలు తగ్గడానికి కారణం? అది దర్శక, నిర్మాతలను అడగాలి. నా వరకు నేను చేసిన సినిమాలన్నిటికీ పూర్తి న్యాయం చేశాను. కాకపోతే, కొన్ని సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. సినిమా పరిశ్రమలో నాకు ‘గాడ్‌ఫాదర్’ లేకపోవడంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేశాను. అది మైనస్ అయ్యింది. ఇలా జరిగినందుకు పశ్చాత్తాపపడుతున్నారా? లేదు. ఎందుకంటే, ‘సదా డెరైక్టర్స్ ఆర్టిస్ట్’ అనిపించుకోగలిగాను. అది చాలు. తప్పులెవరైనా చేస్తారు. నా తప్పులు నాకు మైనస్ అయ్యాయే కానీ, ఎవరికీ కష్టం కలిగించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నా కెరీర్లో నేనెవర్నీ ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అడగలేదు. వచ్చిన సినిమాలు చేశాను. మీరు ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవడం కూడా మైనస్ అయ్యిందనుకోవచ్చా? వృత్తిపరమైన లాభం కోసం స్నేహం నటించలేను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ఆత్మాభిమానం దెబ్బతినే పనులు చేయలేను. ఒకవేళ అవకాశాలు తగ్గడానికి ఇవే కారణం అయ్యుంటే, నేను బాధపడను. ఎందుకంటే, నా గౌరవాన్ని కాపాడుకోగలిగాననే తృప్తి మిగిలింది. దర్శకుడు శంకర్ సినిమాలో నటించిన కథానాయిక కెరీర్ అంతే సంగతులని చాలామంది అంటారు...? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. ‘జయం’తో తెలుగులో, ‘అపరిచితుడు’తో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను. బిజీగా సినిమాలు చేసేసి ఇప్పుడు ఖాళీగా ఉండటం బోరనిపించట్లేదా? ఆ దేవుడు నాకు కావాల్సినదాని కన్నా ఎక్కువే ఇచ్చాడు. అయినా సరే సంతృప్తి పడకపోతే, ఆయన క్షమించడు. నేనెప్పుడూ బిజీగా ఉండాలని, నెలకోసారి వెండితెరపై కనిపించాలనే ఆకాంక్ష లేదు. ఈ మధ్య వస్తున్న ఓ టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు కదా.. అసలు బుల్లితెరకు పచ్చజెండా ఊపడానికి కారణం ఏంటి? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ నేపథ్యంలో సాగే కార్యక్రమం కాబట్టి, దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే చాన్స్ రావడంతో ఎగ్జయిటయ్యా. వెంటనే ఒప్పుకున్నాను. బుల్లితెర ఎలాంటి అనుభూతినిస్తోంది? నేను చేస్తున్నది పిల్లలకి సంబంధించిన షో. పిల్లలందరూ డాన్స్‌లో కనబరుస్తున్న ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. షూటింగ్లో సమయం ఎలా గడిచిపోతోందో కూడా తెలియడంలేదు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళెప్పుడో ఆలోచించలేదు. జీవితంలో మనకెంతోమంది తారసపడతారు. వాళ్లల్లో మనకు నచ్చినవాళ్లుంటారు. కానీ, జీవిత భాగస్వామిని చేసుకోలేం. అందుకే, బెటర్ హాఫ్‌ని ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగు లేస్తా. ఇతణ్ణి పెళ్లాడితే మన మిగతా జీవితం ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తే చాలు... కచ్చితంగా ఆ వ్యక్తిని పెళ్లాడతా. ప్రేమ వివాహాన్ని మా వాళ్లు ఎప్పుడూ వ్యతిరేకించరు. - డి.జి. భవాని -
వైఎస్సార్సీపీకే మా మద్దతు: ఆడారి కిశోర్ కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత లక్ష్యంగా ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని సమైక్యాంధ్ర యువజన-విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు ఆడారి కిశోర్ కుమార్ ప్రకటించారు. వచ్చే నెల 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, తమ భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు జేఏసీ నేతలు మంగళవారం సచివాలయానికి వెళ్లగా వారికి సీఏం అనుమతి లభించలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని అన్నారు. వాస్తవాలు వివరించేందుకు వచ్చిన తమకు సీఎం కిరణ్ కనీసం అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు.