ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం
న్యూఢిల్లీ: ఏఐసిసి గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమిని సమీక్షిస్తూ, పనిలో పనిగా భవిష్యత్ ప్రణాళికను కూడా రూపొందిస్తోంది. ఏఐసీసీ కార్యాలయంలో ఈ రోజు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, ఏకె ఆంటోని, జైరాం రమేష్ ఏపి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలపై చర్చించారు. రాష్ట్రాల నేతలు కారణాలను విశ్లేషించారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన ఏపి పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చిరంజీవి, జేడీ శీలం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారు.