హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే లిస్టెడ్ సంస్థ రామ్‌ఇన్ఫో వచ్చే మూడేళ్లలో టాప్ 5 మధ్య స్థాయి టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. అంకుర సంస్థలకోసం అమెరికాలో రెండు, భారత్‌లో ఒకటి చొప్పున ఇన్‌క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎల్ శ్రీనాథ్‌రెడ్డి బుధవారమిక్కడ తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా 1994లో ఏర్పాటైన రామ్‌ఇన్ఫో .. ఈసేవ, మీసేవ, సువిధా వంటి సొల్యూషన్స్‌తో అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలకు ఐటీ, డిజిటల్ పరివర్తన సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సాగిస్తున్న కార్యకలాపాలను 2024–25లో 15 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 135 మిలియన్ డాలర్ల ఆదాయం నిర్దేశించుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment