Best Affordable Gadgets: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు సరసమైన ధర వద్ద లభించే వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలంటి వారి కోసం రూ. 500 కంటే తక్కువ ధర వద్ద లభించే 5 బెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్
రూ. 399 వద్ద లభించే విఐహెచ్ఎమ్ ఇన్ 1 ఎలక్ట్రానిక్ క్లీనర్ కిట్ చాలా మందికి ఉపయోగపడే బెస్ట్ గ్యాడ్జెట్. ఇది మానిటర్లు, కీబోర్డులు, ఫోన్స్, ఎయిర్ పాడ్స్, ల్యాప్ టాప్ వంటి వాటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో క్లీనర్ కిట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
వైర్‌లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్
మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో గ్యాడ్జెట్ 'వైర్‌లెస్ బ్లూటూత్ 4.0 యాంటీ-లాస్ట్ అండ్ యాంటీ-థెఫ్ట్ అలారం డివైస్'. దీని ధర రూ. 200 కంటే తక్కువ కావడం గమనార్హం. QOCXRRIN వైర్‌లెస్ బ్లూటూత్ అనేది పేరుకు తగ్గట్టుగానే ఇది బ్లూటూత్ ట్రాకర్. అంతే కాకుండా దీనిని ఆండ్రాయిడ్ పరికరాలతో ఉపయోగించవచ్చు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, దీని పరిధి 25 మీటర్ల వరకు ఉంటుంది.
3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్
దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ మోడల్ 3 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్. దీని ధర రూ. 333 మాత్రమే. ఇది దాదాపు చాలా పరికరాలకు ఉపయోగపడే విధంగా రూపుదిదుకున్న యూనివెర్సల్ ఛార్జింగ్ కేబుల్. ఈ కేబుల్ ద్వారా యాపిల్ పరికరాలకు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వంటి వాటికి ఛార్జింగ్ వేసుకోవచ్చు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా రూపొందించారు.
(ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!)
మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్
కీ చైన్ అనేది మహిళలు, పురుషులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం. ఈ కారణంగా కీ చైన్ల వినియోగం ఆధునిక కాలంలో కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రూ. 200 కంటే తక్కువ ధర వద్ద కీ చైన్ కావాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ ఈ మల్టీ ఫంక్షన్ కీచైన్ లైట్ (Multi-function keychain light). ఇది కేవలం కీ చైన్ మాదిరిగా మాత్రమే కాకుండా లైట్‌గా కూడా పనికొస్తుంది.ఇందులో LED లైటింగ్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అయస్కాంతం ఉండటం వల్ల డోర్ లేదా హ్యాండిల్స్ వంటి వాటికి తగిలించుకోవచ్చు.
(ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!)
Hkaudio ఎమ్28 టిడబ్ల్యుఎస్ ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్
పవర్ బ్యాంక్‌తో కూడిన Hkaudio M28 TWS ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ధర కూడా రూ. 500 కంటే తక్కువ. ఇది USB టైప్ ఏ పోర్ట్ కలిగి బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో లభిస్తుంది. ఇది గేమింగ్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌గా ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment