![Carried On The Shoulders Of A Nation Picture Is In Top 5 For Laureus Award - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/4/Sachin.jpg.webp?itok=8cgPW1k6)
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లారెస్ అవార్డు అందుకునే దిశగా సచిన్ ‘2011 ప్రపంచకప్ ఫైనల్ సంబర ఘట్టం’ మరో అడుగు ముందుకు వేసింది. ముంబై వాంఖడే మైదానంలో ఫైనల్ గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన దృశ్యం అవార్డు కోసం పోటీ పడుతుంది. ఇప్పటి వరకు 20 ఎంట్రీలు అవార్డు రేసులో ఉండగా వాటిని ఐదుకు కుదించారు. ఈ టాప్–5లో సచిన్ సంబరానికి చోటు దక్కింది. ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అనే టైటిల్‌తో నాటి క్షణం అవార్డు బరిలో నిలిచింది. ఫిబ్రవరి 16న ఓటింగ్ ముగిశాక... బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను 17న ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment