ముంబై: భారత్ ఎకానమీ 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కేవలం 2.7 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 8.5 శాతంగా ఉంటుందని విశ్లేషించారు. మే 31వ తేదీన మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఎకనమిస్టులు తాజా నివేదికను వెలువరించారు.
కాగా, చమురు ధరలు ఎక్కువ కాలం పెరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జూన్ పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మళ్లీ రేట్లు పెంచుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య సన్నిహిత సమన్వయం హర్షణీయమని పేర్కొన్నారు. మహమ్మారిసవాళ్ల సమయంతోసహా ప్రతి ఆర్థిక కీలక సమయంలోనూ నెలకొంటున్న ఈ అంశం ఎకానమీకి చక్కటి సంకేతాలు పంపుతుందని విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment