అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే? | Will Indians Become Rich Before India Grows Old Says Raghuram Rajan | Sakshi
Sakshi News home page

Raghuram Rajan: అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?

Published Mon, May 20 2024 5:17 PM | Last Updated on Mon, May 20 2024 6:37 PM

Will Indians Become Rich Before India Grows Old Says Raghuram Rajan

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 'భారత్' ఒకటి. అదే సమయంలో అత్యంత పేద దేశం కూడా.. అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2024లో నిరుద్యోగిత రేటు 8.1%గా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) పేర్కొన్న విషయాన్ని రాజన్ హైలైట్ చేశారు.

భారతదేశంలోని శ్రామిక జనాభాలో కేవలం 37.6 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు. పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిలోకి రావడం వల్ల భారత్‌కు మేలు జరుగుతుందన్నారు. యువకులకు కావలసిన ఉపాధి కల్పించగలిగితే.. దేశం మరింత వేగంగా డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.

భారత్ క్రమంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో చేరుతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా 2047 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని రఘురామ్ రాజన్ అన్నారు.

ఇక అసలు సమస్య ఏమిటంటే.. 2047-2050 నాటికి దేశంలో వృద్ధాప్యం పెరుగుతుంది. అప్పటికి భారతీయులంతా ధనవంతులు కాగలరా? అని రాజన్ అన్నారు. ప్రస్తుత జనాభా డివిడెండ్ శాశ్వతంగా ఉండదని, జనాభా వయస్సు పెరిగే కొద్దీ.. వర్క్‌ఫోర్స్‌లో సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement