ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు | 1. 5 million Indians lost jobs in Aug as unemployment rate soars | Sakshi

ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు

Sep 3 2021 6:31 AM | Updated on Sep 3 2021 6:31 AM

1. 5 million Indians lost jobs in Aug as unemployment rate soars - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆగస్టులో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.32 శాతంగా ఉందని వివరించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.64 శాతం ఉండగా, పట్టణ నిరుద్యోగిత రేటు 9.78 శాతం ఉంది. జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే 16 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అత్యధికంగా హరియాణాలో 35.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్‌ (26.7 శాతం), జార్ఖండ్‌ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బిహార్‌ (13.6 శాతం) నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement