Track record
-
ఆర్థిక వృద్ధిలో భారత్ ఎకానమీ ట్రాక్ రికార్డ్ - ఎస్అండ్పీ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్ రికార్డు) కలిగి ఉందని రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతం వృద్ధి అంచనాలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ’స్లోయింగ్ డ్రాగన్స్, రోరింగ్ టైగర్స్’ అనే శీర్షికతో వెలువరించిన ఆసియా–పసిఫిక్ క్రెడిట్ అవుట్‌లుక్, 2024లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సేవల రంగం పురోగతి, పెట్టుబడులకు సంబంధించిన మూలధనం క్రమంగా పురోగమించడం, వృద్ధికి దోహదపడే విధంగా యువత అధికంగా ఉండడం, ఉత్పాదకత మెరుగు వృద్ధికి ప్రధాన కారణాలు. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 6.9 శాతంగా ఉంటుంది. వడ్డీరేట్లు అధికంగా ఉండడం రుణ భారాలను పెంచే అంశం. అయితే వృద్ధి బాట పటిష్టంగా ఉండడం మార్కెట్ విశ్వాసానికి, రెవెన్యూ సృష్టికి దోహదపడుతుంది. ► శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాలకు సంబంధించి నియంత్రణలు, సవాళ్లు తొలగడం తదుపరి దశ వృద్ధికి దోహదపడే అంశాలు. ► ఆర్థిక వ్యవస్థలో సేవల ప్రభావం కాలక్రమేణా పెరిగింది. వ్యవసాయం, ఇతర ప్రాథమిక పరిశ్రమలు వెయిటేజ్‌లు ఎకానమీలో తగ్గాయి. సేవల రంగం మరింత పురోగమిస్తుందని విశ్వసిస్తున్నాం. -
టీసీఎస్ కొత్త సీఈవో ట్రాక్ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్ కె. కృతివాసన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్‌గా ఉన్న కృతివాసన్ కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు) చెన్నై నుంచి ముంబైక షిప్ట్ అవ్వడమే పెద్ద చాలెంజ్ టీసీఎస్ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్ అని సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్ఇండియన్ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట. కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎవరీ కృతివాసన్ చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్‌గా, ప్రేమగా ఉండే కృతివాసన్‌కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మరియు సేల్స్‌లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్ నిర్వహించారు. అలాగే టీసీఎస్ Iberoamerica , ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు. కృతివాసన్ శాలరీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ గతవారం వరుస రికార్డులతో దూసుకెళ్లింది. మొత్తం ఐదు ట్రేడింగ్ రోజుల్లో.. ఏకంగా నాలుగు రోజులు సూచీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. జీఎస్టీలో వడ్డనలు లేకపోవడం, అమెరికా–చైనాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ ఒప్పందానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకారం తెలపడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో గడిచిన వారంలో సెన్సెక్స్ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. శుక్రవారం 12,294 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 12,272 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 41,810 పాయింట్లకు చేరుకుని.. చివరకు 41,682 వద్ద నిలిచింది. ఈ స్థాయి రికార్డులతో జోరుమీదున్న మన మార్కెట్.. ఈవారంలో ఏ విధంగా ఉండనుందనే అంశానికి, ప్రధానంగా అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్‌కు చాన్స్..! వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీ మార్కెట్ ఈ వారంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. వాల్యుయేషన్స్ ప్రియంగా మారడమే ఇందుకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే ఈ వారంలో కొనుగోలు చేయడం వివేకవంతమైన విధానమని, మార్కెట్ బాగా పెరిగినందున కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వీపీ అజిత్ మిశ్రా అన్నారు. బాగా పెరిగిన షేర్ల నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగి వ్యాల్యూ పిక్స్ వైపునకు పెట్టుబడులు మారే అవకాశం ఉన్నందున తాను కూడా కన్సాలిడేషన్ జరగవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ నాయర్ చెప్పా రు. ఏడాది చివరి రోజులు కావడంతో స్టాక్ స్పెసి ఫిక్ ర్యాలీకి మాత్రమే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు. సెన్సెక్స్ 30 సూచీ నుంచి యస్ బ్యాంక్ అవుట్ బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ) బెంచ్‌మార్క్ సూచీ (సెన్సెక్స్)లోని 30 షేర్ల జాబితాలో ఈ వారంలోనే భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్ఈ చేర్చనుంది. ఇదే విధంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ వంటి పలు సూచీల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ఫండ్ మేనేజర్లు వారి పోర్ట్‌ఫోలియోలో భారీ మార్పులను చేయనున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్ సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఉండడం వల్ల రికార్డుల ర్యాలీ కొనసాగేందుకు అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. క్రిస్మస్ సందర్భంగా బుధవారం (25న) దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (26న) ఉదయం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుంది. -
క్రెడిట్ స్కోరు కొట్టండిలా..
ప్రస్తుతం రుణం తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా మంచి క్రెడిట్ స్కోరు, చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉండటం తప్పని సరిగా మారింది. క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దరఖాస్తుదారుకి భారీ ఆదాయం, విలువైన ఆస్తులు, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఇలా ఎన్ని ఉన్నా.. ట్రాక్ రికార్డు సరిగ్గా లేకపోతే ఏవీ పనిచేయవు. ఇంతటి కీలకమైన క్రెడిట్ రిపోర్టు, క్రెడిట్ స్కోరు గురించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్)పై ఆధారపడుతుంటాయి. ఈ సంస్థ నిర్వహించే రికార్డుల్లో ఎగవేతదారులుగా (డిఫాల్టర్లు) గానీ ముద్రపడితే రుణాలు పొందాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో సిబిల్ రికార్డుల్లో డిఫాల్టర్లుగా ఎక్కకూడదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిపైనే ఈ కథనం. సిబిల్ దగ్గర ప్రత్యేకంగా డిఫాల్టర్ల జాబితా అంటూ ఒకటి ఉంటుంది, అందులో ఉన్నవారిని బ్యాంకులు నిర్ద్వంద్వంగా దూరం ఉంచుతాయన్న అపోహలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి సిబిల్ ఇలాంటి ప్రత్యేక జాబితా ఏమీ తయారు చేయదు. తమ దగ్గర సభ్యులైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే సమాచారాన్ని క్రోడీ కరించి, మంచి..చెడు అనే భేదం లేకుండా వ్యక్తుల క్రెడిట్ రికార్డును రూపొందిస్తుంది. దీని ఆధారంగా స్కోరు ఇస్తుంది. సాధారణంగా క్రెడిట్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేని వారిని మాత్రమే బ్యాంకులు డిఫాల్టర్లుగా పరిగణిస్తుంటాయి. అలాగని, ట్రాక్ రికార్డు సరిగ్గా లేని ప్రతీ ఒక్కరు ఎగవేతదారులని భావించడానికీ లేదు. డిఫాల్టర్లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటారు. కావాలని ఎగ్గొట్టే వారు కొందరైతే, పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు, నిబంధనలు తెలియక మరికొందరు ఈ కోవలో పడిపోతుంటారు. కావాలని ఎగ్గొట్టిన వారిని పక్కన పెట్టి మిగతా వారి సంగతి పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యల కారణంగా గడువులోగా కొన్ని వాయిదాలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన వారు రెండో రకానికి చెందుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పాటించే నిబంధనలు తెలియక ఇరుక్కునే అమాయక రుణగ్రస్తులు మూడో కోవకి చెందినవారు. నిజానికి ఈ రెండు వర్గాల వారు తెలియనితనం కారణంగానే డిఫాల్టర్లుగా మారతారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. కనుక, ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కొనాలి అన్నది తెలుసుకుంటే ఇలాంటి సమస్యలో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. వన్ టైమ్ సెటిల్మెంట్ .. బ్యాంకులకు భారీ మొత్తం బకాయిపడినప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ చాలా మధురంగా అనిపిస్తుంది. ఎంతో కొంత కట్టేసి బైటపడొచ్చు కదా అనిపిస్తుంది. తీరా సెటిల్ చేసుకున్న తర్వాత ఇక మన పేరున ఎటువంటి బకాయిలు లేవని బ్యాంకు ఒక లెటరు ఇచ్చినంత మాత్రాన అకౌంటు క్లోజ్ అయినట్లు కాదు. ఈ ఓటీఎస్ విషయం మీ క్రెడిట్ రిపోర్టులో సెటిల్డ్ అనో ‘పోస్ట్ (డబ్ల్యూఓ) సెటిల్డ్’ అనో కనిపిస్తుంది. ఇది కూడా మీ క్రెడిట్ హిస్టరీకి మచ్చలాంటిదే. కనుక, సెటిల్ చేసుకోవడం కన్నా పూర్తి స్థాయి క్లోజర్ కోసం బేరమాడుకోవడం మంచిది. మరో విషయం, ఈ రెండింటికీ బ్యాంకులు ఇచ్చే లెటర్లు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి, ఏది ఇచ్చారన్నది సరిగ్గా చూసుకోవాలి. గడువు తేదీ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రెడిట్ అకౌంటును సెటిల్ చేసుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని సార్లు ఆఫర్ లెటరు పంపిస్తుంటాయి. ఒకవేళ సెటిల్ చేసుకుని, అకౌంటు మూసేద్దామనుకున్న పక్షంలో ఆ లెటర్లో పేర్కొన్న ఆఖరు తేదీలోగా చెల్లించేయాలి. ఇక్కడ ఆఖరు తేదీ (డ్యూ డేట్) అంటే మీరు కట్టే డబ్బు బ్యాంకు చేతికి అందాల్సిన రోజని గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా డ్యూ డేట్ రోజున చెక్కు వేస్తే కుదరదు. బ్యాంకు దగ్గరికి చెక్కు చేరి, దాన్ని మార్చుకునేలోగా ఆఖరు తేదీ దాటిపోతుంది. ఫలితంగా గడువులోగా మీరు చెల్లించలేదని రికార్డులకు ఎక్కుతుంది. సెటిల్మెంట్ ఆఫర్ రద్దయి, మీ అకౌంటు కొనసాగుతూనే ఉండే అవకాశమూ ఉంది. మీరు కట్టిన మొత్తాన్ని బ్యాంకు.. బకాయిలో కొంత భాగం కింద జమ వేసుకుంటుందే తప్ప అకౌంటును మూసేయదు. కనుక, లెటర్లో పేర్కొన్న ఆఖరు తేదీకి సాధ్యమైనంత ముందుగానే కట్టేయడం ఉత్తమం. ఒకవేళ తప్పని పరిస్థితుల కారణంగా సరిగ్గా ఆఖరు తేదీనే కట్టాల్సి వస్తే.. నగదు చెల్లింపు జరిపి, రసీదు దగ్గర పెట్టుకోవడం మంచిది. రుణం పునర్వ్యవస్థీకరించడం.. ఊహించని ఆర్థిక సమస్యల కారణంగా ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కొన్నిసార్లు రీషెడ్యూలిం గ్‌కి వెళ్లడం మంచిదనకుంటూ ఉంటాం. దీనికి బ్యాంకు కూడా అంగీకరించవచ్చు. అయితే, సదరు బ్యాంకు ఈ రుణాన్ని ‘రీస్ట్రక్చర్డ్’ పేరిట సిబిల్‌కి సమాచారం ఇస్తుంది. ఇలాంటివి కూడా క్రెడిట్ రికార్డుకు ప్రతికూలమైన అంశాలు. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడే తక్కువ ఈఎం ఐలు ఉండేలా కాస్త దీర్ఘకాలానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది. సాధారణంగా ప్రతి నెలా కట్టే ఈఎంఐలు.. నెల జీతంలో 40% దాటకుండా చూసుకోవడం శ్రేయస్కరం. మరీ తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే, తక్కువ ఈఎంఐ ఆఫర్లు అందిస్తున్న బ్యాంకుకు మీ రుణాన్ని బదలాయించుకునే అంశాన్ని పరిశీలించుకోవచ్చు. దీని వల్ల మాత్రం క్రెడిట్ రికార్డుకు ఎటువంటి ఢోకా ఉండదు. క్రెడిట్ అకౌంటు మూసేస్తే సరిపోదు.. రుణం సెటిల్మెంట్ ప్రక్రియకు సంబంధించి.. మనం ఎంత తక్కువ కట్టేలా బేరమాడితే అంత మంచిదనుకుంటాం. నిజానికి ఎంత తక్కువ కట్టామన్నదానికన్నా సరైన మొత్తం కట్టామా లేదా అన్నదే ముఖ్యం. రుణం లేదా క్రెడిట్ కార్డు బకాయి సెటిల్మెంట్ ఆఫర్ విషయంలో ‘అసలు బాకీ’ అంటూ ఒకటి ఉంటుంది. మొత్తం బకాయి ఎంత ఉందన్నది తెలుసుకుని, సాధ్యమైనంత వరకూ అసలు మొత్తమే క్లియర్ అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నించాలి. లేకపోతే ఇది కూడా క్రెడిట్ రిపోర్టులో ప్రతిబింబిస్తుంది. కార్డు అకౌంటు క్లోజింగ్ ఇలా.. సిబిల్ రిపోర్టుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో క్రెడిట్ కార్డు అకౌంట్‌ను రద్దు చేయడం ఒకటి. ఉపయోగంలో ఉన్న క్రెడిట్ కార్డు అకౌంటును మూసేయడం అంటే.. బకాయిలు చెల్లించేసి, కార్డును ధ్వంసం చేస్తే చాలు అనుకుంటారు చాలా మంది. కానీ ఇది సరికాదు. నిజంగా అకౌంటు క్లోజింగ్ అన్నది పేపరు రూపంలో కనిపించాలి. కాబట్టి మొత్తం చెల్లింపులు చేసేసిన తర్వాత అకౌంటును మూసేయదల్చుకుంటున్నట్లు బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీకి తెలియజేయాలి. ఖాతా మూసివేసినట్లు వాటి దగ్గర్నుంచి అధికారికంగా లెటరు వచ్చే దాకా వేచి చూడాలి. అది వచ్చిన వెంటనే, ‘నో డ్యూస్’ లెటరు ఇవ్వాలని కోరాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఖాతా క్లోజ్ అయిందని చూపేందుకు వీటి కాపీలను భద్రపర్చుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలంగా నలుగుతున్న క్రెడిట్ ఖాతాను మూసివేస్తున్నా లేదా సెటిల్ చేసుకుంటున్నా, మీరు చెల్లించిన రసీదులతో పాటు ఆఫర్ లెటర్ల కాపీలను కూడా భద్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఆధారాలుగా ఇవే ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డు ఖాతాలను రద్దు చేసుకున్న తర్వాత ఎటువంటి బకాయిలు లేవంటూ తెలిపే నో డ్యూస్ లెటర్ తీసుకోవడం మరవొద్దు. -
గిన్నిస్ బుక్ ఎక్కెందుకు ప్రయత్నిస్తున్నా: ఎంఎస్
భీమవరం కల్చరల్ : 17 సంవత్సరాల నటనా జీవితం.. 700 సినిమాలు.. ఐదు నందులు.. ఒక ఫిల్మ్‌ఫేర్.. ఇది తన ట్రాక్ రికార్డ్ అంటున్నారు హాస్యనటుడు ఎంఎస్ నారాయణ. భీమవరంలో మాజీ ఎంపీ మెంటే పద్మనాభం నివాసానికి వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటాల్లోనే.. ‘తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం ‘గోవిందుడు అందరి వాడే’తో పాటు 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్‌లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.’ అని అన్నారు. -
ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే
‘హీరోగా, నిర్మాతగా దాదాపు పదేళ్ల ప్రయాణం’... తెలుగు చిత్ర సీమలో ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే. తనే కల్యాణ్‌రామ్. మహానటుడు ఎన్టీఆర్ మనవడైన కల్యాణ్‌రామ్‌కు నిర్మాతల కొరత లేదు. కానీ... బయట సినిమాలను ఎక్కువగా ప్రిఫర్ చేయరాయన. క్వాలిటీ నెపంతో నిర్మాతలతో అతిగా ఖర్చుపెట్టించడం ఇష్టం లేకపోవడమే అందుకు కారణం. నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకోవడానికి కారణం కూడా అదే. నచ్చిన పాత్రలు చేస్తారు. నచ్చినట్లు సినిమా తీస్తారు. దటీజ్ కల్యాణ్‌రామ్. ఇప్పటివరకూ ఏడాదికి ఒక్క సినిమా చేస్తూ వచ్చిన ఈ నందమూరి అందగాడు... ఇప్పుడు వేగం పెంచారు. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘పటాస్’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఇక రెండో సినిమా ‘షేర్'. చాలా కాలం తర్వాత బయట సంస్థలో కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ఇది. విజయలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై కొమరం వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే... నిర్మాతగా మరో అడుగు ముందుకేసి బయట హీరోలతో కూడా చిత్రాలు నిర్మించడానికి సమాయత్తమయ్యారు కల్యాణ్‌రామ్. అందులో భాగంగానే రవితేజ హీరోగా ‘కిక్’ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. దీనితో పాటు తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రీతిగా కెరీర్‌ని జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తున్నారు కల్యాణ్‌రామ్. నేడు ఆయన పుట్టిన రోజు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ఈ యువహీరో... విరివిగా విజయాలందుకోవాలని ఆకాంక్షిద్దాం.