పెట్టుబడులకు ఇబ్బందులు: ఎస్‌అండ్‌పీ
ముంబై: భారత్‌లో పెట్టుబడుల వృద్ధికి కొన్ని ఇబ్బందులు పొంచి ఉన్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) అధ్యయనం ఒకటి తెలిపింది. విధాన సంస్కరణల అమల్లో అడ్డంకులు, అధికారుల అలసత్వం భారత్‌లో పెట్టుబడులకు ప్రధాన అడ్డంకులని పేర్కొంది. దేశంలో కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి మందగమనంలో ఉందని, రుణ భారం కొనసాగుతోందని.. ఇవన్నీ పెట్టుబడులకు, భారీ వృద్ధికి విఘాతం కలిగిస్తున్న అంశాలని వివరించింది.
భారత్‌సహా చైనా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలపై సైతం ఎస్‌అండ్‌పీ అధ్యయనం జరిపింది. ప్రస్తుతం ఎస్‌అండ్‌పీ భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌తో ‘బీబీబీమైనస్’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. పెట్టుబడులకు ఏమాత్రం సరికాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎగువ.
ధరలు పెరిగే అవకాశం: నోముర
ఇదిలాఉండగా, భారత్‌కు ఈ ఏడాది ఎల్ నినో ఇబ్బందులు పొంచి ఉన్నాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ- నోముర తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల దేశంలో ధరల తీవ్రత పెరగవచ్చని హెచ్చరించింది.