చిన్న షాక్ తగిలినా భారత ఎకానమీకి ముప్పే | Standard & Poor's sounds alarm on Govt's fiscal pressures | Sakshi
Sakshi News home page

చిన్న షాక్ తగిలినా భారత ఎకానమీకి ముప్పే

Published Tue, Apr 14 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

Standard & Poor's sounds alarm on Govt's fiscal pressures

ఎస్‌అండ్‌పీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆర్థిక అంశాలపరమైన బలహీనతల నుంచి భారత సార్వభౌమ రేటింగ్‌కు ముప్పు కొనసాగుతోందని రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఆర్థికపరమైన, కమోడిటీలపరమైన ఏ చిన్న షాక్ తగి లినా.. ఎకానమీని మెరుగుపర్చేందుకు ఇప్పటిదాకా చేసిన కృషి అంతా వృథాగా పోతుందని హెచ్చరించింది. ద్రవ్యపరంగా మరిన్ని సంస్కరణలు తీసుకోకపోతే నిలకడగా ప్రభుత్వ పెట్టుబడులను పెంచుకుంటూ పోవడం కేంద్రానికి కష్టంగా మారుతుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది.

భారత్‌లో ఇన్‌ఫ్రా ప్రగతికి ద్రవ్యపరమైన అవరోధాల పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వివరించింది. బడ్జెట్ లోటును కట్టడి చేసే దిశగా వ్యయాల్లో కోత పెట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం మంచి పరిణామమని ఎస్‌అండ్‌పీ క్రెడిట్ అనలిస్టు కిమ్ ఎంగ్ టాన్  పేర్కొన్నారు. అయితే, భారీ సబ్సిడీ వ్యయాలు భారంగా మారే అవకాశముందన్నారు. డిజిన్వెస్ట్‌మెం ట్ లక్ష్యాలను గానీ చేరుకోలేకపోతే ప్రభుత్వం పెట్టుబడుల్లో మరింత కోత విధించుకోవాల్సి రావొచ్చని టాన్ చెప్పారు. ప్రస్తుతం ఎస్‌అండ్‌పీ భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ రేటింగ్ ఇచ్చింది. పెట్టుబడులకు ఏమాత్రం అనువుగాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement