Government investments
-
8.3 శాతం వృద్ధికి అవకాశం
వాషింగ్టన్: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తాజాగా అంచనా వేసింది. పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, తయారీని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వృద్ధికి తోడ్పడతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కరోనా రెండో విడత ప్రబలడానికి ముందు ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనాల కంటే ఇది తక్కువేనని తెలిపింది. కరోనా రెండో విడత ప్రభావంతో ఆర్థిక రికవరీ నిలిచిపోయిందని.. వాస్తవానికి రికవరీ క్షీణించినట్టు కొన్ని సంకేతాల ఆధారంగా తెలుస్తోందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదికలో భారత్ జీడీపీ వృద్ధి 2021–22లో 7.5–12.5 మధ్య ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. దీంతో తన తాజా అంచనాల్లో దిగువ స్థాయికి వృద్ధి అంచనాలను సవరించినట్టు టిమ్మర్ పేర్కొన్నారు. కరోనా రెండో విడత ప్రభావం ఆర్థిక వ్యవస్థమీద ఎక్కువే ఉందన్నారు. కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరం కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరానికి అనుగుణంగానే ఉన్నాయని టిమ్మర్ అభిప్రాయపడ్డారు. ఇవి ఆర్థిక వ్యవస్థలో వెలుగు చూడని సామర్థ్యాలని బయటకు తీసుకొస్తాయని చెప్పారు. సామాజిక భద్రతా వ్యవస్థల కోసం నిధులను ఏర్పాటు చేయడం వంటివి సంఘటిత రంగంలోని కారి్మకులకే కాకుండా.. అసంఘటిత రంగంలోని వారికీ మేలు చేస్తుందన్నారు. ‘‘భారత్‌లో అమలు చేస్తున్న ఎన్నో స్వల్పకాలిక ఉపశమన చర్యలు దీర్ఘకాలం కోసం కాదు. దేశం మొత్తానికి సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సంస్కరణలు (కారి్మక, వ్యవసాయ) ఆ దిశలోనే ఉన్నాయి. కానీ, అదే సమయంలో చేయాల్సింది ఎంతో ఉంది’’ అని టిమ్మర్ వివరించారు. -
కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రాష్ట్రంలో కొత్తగా రూ.29,784 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి 108 ప్రతిపాదనలను వచ్చినట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా రూ.2,76,483 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే అందులో 10.77 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రాజెక్ట్స్ టుడే పేర్కొంది. మొత్తం రూ.54,714 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ప్రాజెక్ట్స్ టుడే సంస్థ దేశంలో కొత్తగా ప్రకటించిన పెట్టుబడులు, పిలిచిన టెండర్లు ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదికను రూపొందిస్తుంది. అందులో భాగంగా ప్రకటించిన తాజా సర్వేలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ప్రాజెక్టుల విలువలో మూడో వంతు కేవలం సాగు నీటి రంగానికి చెందిన అయిదు ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా సాగు నీటి రంగంలో పెట్టుబడులు తగ్గగా, కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.10,044.5 కోట్ల విలువైన మూడు భారీ ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్ఐ) స్కీం కింద ఫార్మా రంగంలో ఈ మూడు నెలల కాలంలో రూ.11,527.21 కోట్ల విలువైన 196 పెట్టుబడుల ప్రకటనలు వెలువడగా అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవి ఉన్నట్లుగా నివేదిక వివరించింది. కైనటిక్ గ్రీన్ ఎనర్జీ రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్‌తో పాటు లోయర్ సీలేరులో రూ.1,098.12 కోట్లతో ఏరా>్పటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రాజెక్టులుగా పేర్కొంది. పెరిగిన ప్రైవేట్ పెట్టుబడులు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్స్ టుడే స్పష్టం చేసింది. ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల్లో ప్రైవేటు సంస్థల వాటా 49.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. ప్రైవేటు రంగంలో రూ.1,36,946.3 కోట్ల విలువైన 711 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్న సంఖ్యలో కూడా వృద్ధి నమోదవుతోందని వివరించింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ.1,29,388.84 కోట్ల విలువైన 1,237 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని, ఇది అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 120 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. అక్టోబర్ – డిసెంబర్లో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు -
చిన్న షాక్ తగిలినా భారత ఎకానమీకి ముప్పే
ఎస్అండ్పీ హెచ్చరిక న్యూఢిల్లీ: ఆర్థిక అంశాలపరమైన బలహీనతల నుంచి భారత సార్వభౌమ రేటింగ్‌కు ముప్పు కొనసాగుతోందని రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తెలిపింది. ఆర్థికపరమైన, కమోడిటీలపరమైన ఏ చిన్న షాక్ తగి లినా.. ఎకానమీని మెరుగుపర్చేందుకు ఇప్పటిదాకా చేసిన కృషి అంతా వృథాగా పోతుందని హెచ్చరించింది. ద్రవ్యపరంగా మరిన్ని సంస్కరణలు తీసుకోకపోతే నిలకడగా ప్రభుత్వ పెట్టుబడులను పెంచుకుంటూ పోవడం కేంద్రానికి కష్టంగా మారుతుందని ఎస్అండ్పీ తెలిపింది. భారత్‌లో ఇన్ఫ్రా ప్రగతికి ద్రవ్యపరమైన అవరోధాల పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వివరించింది. బడ్జెట్ లోటును కట్టడి చేసే దిశగా వ్యయాల్లో కోత పెట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం మంచి పరిణామమని ఎస్అండ్పీ క్రెడిట్ అనలిస్టు కిమ్ ఎంగ్ టాన్ పేర్కొన్నారు. అయితే, భారీ సబ్సిడీ వ్యయాలు భారంగా మారే అవకాశముందన్నారు. డిజిన్వెస్ట్మెం ట్ లక్ష్యాలను గానీ చేరుకోలేకపోతే ప్రభుత్వం పెట్టుబడుల్లో మరింత కోత విధించుకోవాల్సి రావొచ్చని టాన్ చెప్పారు. ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ రేటింగ్ ఇచ్చింది. పెట్టుబడులకు ఏమాత్రం అనువుగాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎక్కువ.