ఇండియా రేటింగ్‌ను మార్చట్లేదు: ఫిచ్‌ | Fitch keeps India rating unchanged at BBB minus | Sakshi
Sakshi News home page

ఇండియా రేటింగ్‌ను మార్చట్లేదు: ఫిచ్‌

Published Wed, May 3 2017 12:47 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

ఇండియా రేటింగ్‌ను మార్చట్లేదు: ఫిచ్‌ - Sakshi

ఇండియా రేటింగ్‌ను మార్చట్లేదు: ఫిచ్‌

స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’గా కొనసాగింపు  
11 ఏళ్లుగా ఇదే దిగువస్థాయి పెట్టుబడుల రేటింగ్‌  
2017–18లో వృద్ధి 7.7 శాతం


ముంబై: భారత్‌ సావరిన్‌ రేటింగ్‌లో ఎటువంటి మార్పు చేయడం లేదని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ స్పష్టం చేసింది. దీనితో ఈ రేటు స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’గా కొనసాగనుంది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇది దిగువస్థాయి రేటింగ్‌. మరో మాటలో చెప్పాలంటే ‘జంక్‌’ (చెత్త) స్థాయికి ఇది ఒక మెట్టు ఎక్కువ.  దాదాపు 11 సంవత్సరాల నుంచీ ఇదే రేటింగ్‌ను ఫిచ్‌ కొనసాగిస్తోంది.

భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను 2006 ఆగస్టు 1వ తేదీన ఫిచ్‌ ‘బీబీప్లస్‌’ స్థాయి నుంచి ‘స్టేబుల్‌ అవుట్‌లుక్‌’తో ‘బీబీబీ మైనస్‌’కు పెంచింది. 2012లో ఒకసారి అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’కు మార్చినా, అటు తర్వాతి సంవత్సరంలో మళ్లీ‘స్టేబుల్‌’కు మార్చింది. ఇదే రేటును కొనసాగించడానికి ప్రధాన కారణాల్లో ‘పటిష్టంగాలేని పబ్లిక్‌ ఫైనాన్స్‌ వ్యవస్థ’ ఒకటని ఫిచ్‌ వివరించింది.   2016–17లో వృద్ధిరేటు 7.1 శాతంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2017–18లో 7.7 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నట్లు ఫిచ్‌ తాజా  నివేదికలో పేర్కొంది. మరిన్ని వివరాలను పరిశీలిస్తే...

స్వల్పకాలంలో పటిష్ట వృద్ధి ధోరణిని, సానుకూల విదేశీ ఆర్థిక అంశాల సమతుల్యతను తాజా రేటింగ్‌ సూచిస్తోంది. బలహీన ద్రవ్య పరిస్థితి, క్లిష్ట వ్యాపార వాతావరణ పరిస్థితులు వ్యవస్థలో కొనసాగుతున్నాయి.

అయితే వ్యవస్థాగత సంస్కరణలు సరిగా అమలు చేస్తే– వ్యాపార పరిస్థితులు మెరుగుపడే వీలుంది.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఎన్‌డీఏ ప్రభుత్వం తాను కోరుకుంటున్న సంస్కరణల ఎజెండాను తరచూ ప్రకటిస్తోంది. దీనిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే  పెట్టుబడులు, వాస్తవ జీడీపీ వృద్ధిపై ఈ సంస్కరణల కార్యక్రమం ఏ మేరకు పడుతుందన్న అంశం...  ఆయా కార్యక్రమాల అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement