ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: భారతీయులు దాదాపు 45 శాతం మంది రాబోయే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్నారు. ఎక్కువ మంది అద్దెకు బదులుగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకుంటున్నరు. ‘వాయిసెస్ ఫ్రమ్ ఇండియా’’ పేరుతో ప్రాపర్టీ కన్సల్టెంట్-సీబీఆర్‌ఈ ఇండియా నిర్వహించిన ఒక సర్వే ఈ అంశాలను వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా 20,000 మంది ఈ సర్వేలో పాల్గొంటే ఇందులో భారతీయుల సంఖ్య 1,500. వీరిలో జెన్-జెడ్ (18-25 సంవత్సరాలు), లేట్ మిలీనియల్స్ (26-33 సంవత్సరాలు) ఎర్లీ మిలీనియల్స్ (34-41 మధ్య వయస్సులు), జెన్ ఎక్స్ (42-57 సంవత్సరాలు) బేబీ బూమర్స్ (58 దాటినవారు) ఈ సర్వేలో ఉన్నారు.
ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని ఇండియా మార్టిగేజ్ గ్యారెంటీ కంపెనీ (ఐఎంజీసీ) ఇటీవలే తన తాజా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30-50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఐఎంజీసీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment