
సాక్షి, అమరావతి: సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉద యం 8.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు.
రేపు విశాఖ జిల్లా భీమిలిలో పర్యటన
సీఎం జగన్ శనివారం విశాఖ జిల్లా భీమిలిలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగే వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment