Happy Republic Day
-
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉద యం 8.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు విశాఖ జిల్లా భీమిలిలో పర్యటన సీఎం జగన్ శనివారం విశాఖ జిల్లా భీమిలిలో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగే వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. -
సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తెలిపారు. సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు’ తెలిపారు. స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్… — YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2024 -
అల్లు అర్జున్ ముచ్చటైన ట్వీట్..!
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా అల్లుహీరో ముచ్చటైన ట్వీట్ చేశారు. తన ఇంట్లోకి మహాలక్ష్మిలా ప్రవేశించిన ఆడబిడ్డ ముచ్చటను, టాలీవుడ్ టాప్ హీరో అల్లుఅర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన కూతురు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు. తన ముద్దుల తనయ అర్హా తరపున రిపబ్లిక్ డే స్పెషల్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు. తన బంగారు పాప క్యూట్ ఫోటో ను కూడా పోస్ట్ చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ అల్లు బేబి ఫోటోకి లైక్ ల వర్షం కురుస్తోంది. Happy Republic Day ! Spl wishes from ALLU ARHA ! pic.twitter.com/tUs4MvwIkt — Allu Arjun (@alluarjun) January 26, 2017