అల్లు అర్జున్ ముచ్చటైన ట్వీట్..!
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా అల్లుహీరో ముచ్చటైన ట్వీట్ చేశారు. తన ఇంట్లోకి మహాలక్ష్మిలా ప్రవేశించిన ఆడబిడ్డ ముచ్చటను, టాలీవుడ్ టాప్ హీరో అల్లుఅర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన కూతురు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు.
తన ముద్దుల తనయ అర్హా తరపున రిపబ్లిక్ డే స్పెషల్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు. తన బంగారు పాప క్యూట్ ఫోటో ను కూడా పోస్ట్ చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ అల్లు బేబి ఫోటోకి లైక్ ల వర్షం కురుస్తోంది.
Happy Republic Day ! Spl wishes from ALLU ARHA ! pic.twitter.com/tUs4MvwIkt
— Allu Arjun (@alluarjun) January 26, 2017