సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తెలిపారు.
సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు’ తెలిపారు.
స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2024
Comments
Please login to add a commentAdd a comment