
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైఎస్సార్‌సీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
పాలవలస కన్నుమూత
ఇటీవల, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం (81)అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్‌ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్‌లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. గురువారం నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment