
కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు పెంచితే.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) పేర్కొన్నారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.
ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో కీలకమని నితిన్ గడ్కరీ సూచించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని మంత్రి హాస్పిటాలిటీ రంగానికి తమ బలమైన మద్దతును వ్యక్తం ప్రకటించారు. ఇది విస్తారమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నవాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. ఇది పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాత్రమే.. ఆధునిక నగరాలు, ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సుముఖత చూపిస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment