భారతదేశంలో రైల్వేస్టేషన్ లేని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా..?. అరచేతిలో ప్రపంచాన్ని చూసేలా టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతున్న రోజుల్లో ఇంకా అలాంటి రాష్ట్రం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోకండి. అయితే ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలకు నెలవు.
అలాంటి రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి తప్పక ఉంటుంది కదా..! అంటారేమో..అయినప్పటికీ రైల్వే నిర్మాణ సాధ్యం కాలేదు. ఈ ఆధునాత కాలంలో టెక్నాలజీనే శాసించే స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే నిర్మాణం సాధ్యం కాలేదని సందేహాలు మెదులుతున్నాయి కదూ..! ఇంకెందుకు ఆలస్యం అది ఏ రాష్ట్రం, దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!.
భారతదేశం అత్యంత ప్రశంసనీయమైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం. అలాంటి దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రం కూడా ఉందంటే.. నమ్మశక్యంగా లేదు కదా!. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో ఉంది. సినిమా వాళ్ల ఫేమస్ లోకేషన్ పాయింట్ కూడా ఇదే. మంచు కొండల్లో పాట అనగానే మనవాళ్లు చకచక వచ్చి వాలిపోయే రాష్టం. అదేనండి సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.
ఇక్కడ ఉండే ప్రకృతి రమ్యతకు ఎలాంటి వారైనా పరవశించిపోవాల్సిందే. అంతలా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదంటే..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు ఉన్నాయి. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మిచడం సాధ్యం కాలేదు.
అదీగాక ఇక్కడ తరుచుగా కొండచరియలు విరిగిపడతాయి. అక్కడ ఆ ప్రమాదం అత్యంత సర్వసాధారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంతవరకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారనుంది. ఇటీవలే మోదీ అక్కడ రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్‌పో స్టేషన్‌ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్.
ఇక్కడ సరస్సుల ప్రసిద్ధ ఆకర్షణ. తప్పక సందర్శించాల్సిన టూరిజం స్పాట్‌లు కూడా ఈ సరస్సులే. రత్నాల వలే భూమిలో పొదిగి ఉన్న ఆ సరస్సుల సహజ సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ రాష్ట్రంలో సందర్శించాల్సిన సరస్సులివే..
క్రోస్ లేక్, ఉత్తర సిక్కిం
క్రోస్ లేక్, స్థానికంగా కల్పోఖ్రి సరస్సు అని పిలుస్తారు. ఇది ఉత్తర సిక్కింలో దాచిన రత్నం. 4,260 మీటర్ల ఎత్తులో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
చోళము సరస్సు, ఉత్తర సిక్కిం
చోళము సరస్సు, ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది 5,330 మీటర్ల ఎత్తులో ఉత్తర సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దులో ఉంది.
కథోక్ సరస్సు, పశ్చిమ సిక్కిం
పశ్చిమ సిక్కింలోని ప్రసిద్ధ పట్టణం యుక్సోమ్ సమీపంలో ఉన్న కథోక్ సరస్సు ప్రశాంతమైన ప్రదేశం. ఈ అందమైన సరస్సు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. ఇది సిక్కిం మొదటి చోగ్యాల్ (రాజు) చారిత్రక పట్టాభిషేకంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.
(చదవండి: శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని)
Comments
Please login to add a commentAdd a comment