కొవిడ్ వల్ల కుదేలైన భారత పర్యాటకం తిరిగి పుంజుకొంటోంది. ప్రపంచ గమనానికి అనుగుణంగా పర్యాటక రంగంలో మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కొత్త వ్యాపార నమూనాలను చేపడుతున్నారు. సామాన్య ప్రజలు పర్యాటకం నుంచి గరిష్ఠ లబ్ధి పొందగలిగేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) గతంలోనే పిలుపిచ్చింది. సుందర ప్రదేశాలు, పుణ్య స్థలాలకు భారత్‌లో కొదవలేదు. ఆధునిక కాలంలో మెడికల్ టూరిజం, సాహస పర్యాటకం, సముద్ర విహారం, పర్యావరణ పర్యాటకం ఊపందుకొంటున్నాయి. దాంతోపాటు తాజాగా రివర్ టూరిజంను అభివృద్ధి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
రివర్ క్రూజ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి రూ.45 వేల కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోల్‌కతాలో జరిగిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) సమావేశంలో ఈ మేరకు ప్రకటన విడుదుల చేశారు. రూ.45 వేలకోట్లలో 2047 నాటికి క్రూజ్ వెసెల్స్ కోసం రూ.35వేల కోట్లు, క్రూజ్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మరో రూ.10వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: హౌతీ అటాక్స్.. ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న నౌకలు!
షిప్పింగ్ ఓడరేవుల మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పరిశ్రమల ప్రముఖులను కలిసి అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రివర్ క్రూజ్ టూరిజంను ఎనిమిది నుంచి 26 జలమార్గాలకు విస్తరించనున్నారు. రాత్రి బసలతో కూడిన క్రూజ్ సర్క్యూట్‌లను 17 నుంచి 80కి పెంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment