TS: టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై సస్పెన్షన్ వేటు | Ec Suspended Telangana Tourism Md Manohar | Sakshi
Sakshi News home page

TS: టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై సస్పెన్షన్ వేటు

Published Fri, Nov 17 2023 6:39 PM | Last Updated on Fri, Nov 17 2023 7:05 PM

Ec Suspended Telangana Tourism Md Manohar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టూరిజం ఎండి మనోహర్‌ను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట తిరుమలకు వెళ్లిన మనోహర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలు తీసుకుంది.

కోడ్‌ అమల్లో ఉండగా ప్రభుత్వ అధికారులు ప్రొటోకాల్‌ పాటించనవసరం లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం ఈసీఐకి సీఈవో వికాస్ రాజు నివేదిక పంపారు. ఈ రిపోర్ట్‌ ఆధారంగా మనోహర్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement