భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో.. అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్‌ను బతిమాలడం మొదట్టింది. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్‌ను కోరారు.
సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మాక్కూడా ఓ చరిత్ర ఉంది. మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్యానికి భారత్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. భారత్ నుంచి వచ్చేవారికి మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుంది. దయ చేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని కోరుతున్నా. మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యటకం ఆధారపడి ఉంటుంది’ అని ఇబ్రహీం ఫైసల్ భారత్‌ను కోరారు.
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక.. అప్పటి నుంచి మాల్దీవులు పర్యాటకం దెబ్బతింది. మరోవైపు.. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారతీ సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో కొంత మంది సైనికులు భారత్‌కు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment