‘గతంలో మేనిఫెస్టోని అమలు చేయకుండా చంద్రబాబు మాయ చేశారు’ | Minister Botsa Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘గతంలో మేనిఫెస్టోని అమలు చేయకుండా చంద్రబాబు మాయ చేశారు’

Published Tue, May 30 2023 6:43 PM | Last Updated on Tue, May 30 2023 6:55 PM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: మేం టీడీపీకి ఎందుకు భయపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ ఓ రాజకీయ పార్టీ.. వాళ్లేం సన్నాసులు కాదని ఎద్దేశా చేశారు. ‘ఓ పార్టీగా మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. చంద్రబాబు గతంలో కూడా మేనిఫెస్టోని ప్రకటించారు.. అమలు చేయకుండా మాయ చేశారు’ అంటూ మంత్రి దుయ్యబట్టారు..

‘‘నాలుగేళ్ల పాలన పూర్తైంది. భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటించాం. చెప్పింది చేశామని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డాం. ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నాం. నాలుగేళ్లలో మంచి జరిగిందో.. చెడు జరిగిందో ప్రజలే చెబుతారు. జగన్‌లా ధైర్యంలా మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా?’’ అని మంత్రి ప్రశ్నించారు.
చదవండి: అలర్ట్‌: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement