
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సామాజిక న్యాయం.. బీసీలకు సముచిత స్థానం విషయంలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. దీంతో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచి రాజకీయమైనా.. ప్రభుత్వ కార్యక్రమమైనా సామాజిక న్యాయానికే అగ్రతాంబూలం. దానికి నిదర్శనం ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలే.. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపివేయడంతో.. బీసీలకు 10 శాతం సీట్లను అదనంగా పార్టీపరంగా కేటాయించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు 10 శాతానికి మించి జీవీఎంసీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించారు. మొత్తం 98 వార్డుల్లో ఏకంగా 65 వార్డుల్ని బీసీ వర్గాలకే కేటాయించి.. బీసీలకు సామాజిక న్యాయం అందించడంలో తానెంత ముందుంటానో నిరూపించారు. మహావిశాఖ నగరపాలకసంస్థకు ప్రభుత్వం బీసీలకు రిజర్వ్ చేసినవి 32 సీట్లుగా కాగా, అవి కాకుండా అన్‌రిజర్వ్‌డ్‌లోని మరో 33 సీట్లను కేటాయించారు. మొత్తం 65 సీట్లు బీసీలకు ఇచ్చి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. ఎస్సీలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వ్ చేసింది 8 కాగా, మరో 2 సీట్లు అదనంగా కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment