మాటల్లోనే సామాజిక న్యాయం! | Chada Venkata reddy writes on social justice | Sakshi
Sakshi News home page

మాటల్లోనే సామాజిక న్యాయం!

Published Sun, Feb 26 2017 1:49 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

మాటల్లోనే సామాజిక న్యాయం! - Sakshi

మాటల్లోనే సామాజిక న్యాయం!

సందర్భం
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందా లనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. కానీ ఇవి ఇప్పటికీ అందరికీ  చెందలేదు. ఎందుకు అందలేదు, అవి ‘‘అందని ద్రాక్ష’’గానే ఎందుకు మిగిలిపోయాయి అనే అంశంపై సమీక్ష చేస్తే రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి భంగం కలిగించే పరి ణామాలు జరగడమే దీనికి కారణమని స్పష్టమౌతుంది. జాతీయ భావాలు కలి గిన తరం అంతరించిన కొలది రాజకీయాలలో మార్పులు సంభవించాయి. తాత్కాలిక భ్రమలలో ప్రజలను ఆకట్టుకునే కుటిల ప్రయత్నాలు సాగాయి.

1975 తదుపరి 20 సూత్రాల పథకం లాంటివి అమలులోకి వచ్చాయి. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వాధికారుల అవినీతి, రాజకీయ నాయకుల జోక్యం మూలంగా పేదవర్గాలలో చురుకైన వారికి మాత్రమే సబ్సిడీలు అందేవి. 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన తర్వాత ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణల విధానాల మూలంగా గ్రామీణ చేతివృత్తులు చితికిపోయాయి. పాశ్చాత్యదేశాల అల వాట్లు వ్యాపించాయి. ఆఖరుకు వ్యక్తిగత జీవితాలపై ఆ ప్రభావం సోకింది. మన దేశ సంస్కృతికి గొడ్డలిపెట్టు లాంటి చర్యలు అమలులోకి వచ్చాయి. ఆఖరుకు సాంకేతిక విప్లవం పేరుతో మనం నివసించే ఇండ్లు, కట్టుకునే వస్త్రాలు, వినిమయదారుల వస్తువులు, విదేశాల నుండి దిగుమతి చేసుకోవడమో లేక పరి శ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అయితే కార్పొరేట్, పారి శ్రామిక, వ్యాపార, వాణిజ్యసంస్థల ఆస్తులు అనూహ్యంగా పెరి గాయి. సామాన్యుల బ్రతుకులు ఇప్పటికీ పూరిగుడిసెలు వెతల బతుకులుగానే మిగిలాయి. అంతరాలు బాగా పెరిగిపోయాయి ధనవంతులు మరింత ధనవంతులుగాను, నిరుపేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. సామాజిక, ఆర్థిక రంగాలు: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు సంభవించినప్పటికి, అట్టి ఫలితాలు సంపన్న కుటుంబాలకు మాత్రమే చెందాయి.

ఇలాంటి పరిస్థితులలో ‘‘సామాజిక న్యాయం’’ అనే అంశం కేవలం ప్రభుత్వ బాధ్యతేనా? అది నినాదంగా మిగిలిపోవలసిం దేనా? అనే అంశంపై చర్చలు జరగాలి. సామాజిక న్యాయ అంశం చట్టాల ద్వారా బలవంతంగా అమలు చేసే అవకాశముంటుందా? ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలనే వాదన సరిౖయెంది. అయిుతే ప్రభుత్వం దాని అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. దీనికితోడు సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక అంశానికి పెద్ద పీట వేయాలి. వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంఘసేవకులు సామాజిక న్యాయం. తమ వ్యక్తిగత ఎజెండాగా గుర్తించి, అవినీతి, పక్ష పాతానికి పాల్పడకుండ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో, విద్య, వైద్య రంగాలలో సహకారం అందించగలిగితే తప్పనిసరిగా సామాజిక న్యాయం అర్హులకు అందుతుంది..

ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రసాదిం చిన కనీస ప్రాథమిక హక్కులు, మౌలిక సదుపాయాలను కూడా ఎందుకు అందించలేకపోయాయి? ఎన్నికల ముందు గరీబీ హటావో, స్వచ్ఛభారత్, అవినీతి, కుంభకోణాలు లేని ప్రభు త్వాలు ఏర్పరుస్తామంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు. ఎన్నికల కంటే ముందు ప్రజలు దేవుళ్ళు, తదుపరి దయ్యాలుగా భావిస్తుండటంతో అంతరాలు పెరిగి పోయాయి.

తరతమ భేదాలతో పార్లమెంటరీ వ్యవస్థలన్నీ అవినీతి, కుంభకోణాలలో కొట్టుమిట్టాడు తున్నాయి. ఎన్నికల నిబంధనలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? ఎన్నికల నిబంధనలు ఉల్లం ఘించిన ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. వారిపైన కఠిన మైన చర్యలు లేవు. విచిత్రమేమిటంటే అఖరుకు ఓటర్లు కూడా అవినీతిలో భాగమైనారనేది ఈ మధ్య బహిరంగంగా విమర్శ సాగుతున్నది. ఇలాంటి వ్యవస్థలో చీకట్లో వెలుగు రేఖలు ప్రస రించే అవకాశం ఉంటుందా అనేది ప్రధాన ప్రశ్న. రాజకీయ వ్యవస్థ పూర్తిగా కుళ్ళి, కృశించి, స్వార్థపూరితంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నది. న్యాయ వ్యవస్థ తరచుగా చురకలు వేస్తున్నా పెద్దగా పట్టించుకునే పరిస్థితిలేదు. న్యాయవ్యవస్థకు కూడా అవి నీతి చీడపట్టుకున్నది. ఈ వ్యవస్థలతో మమేకమైన బ్యూరోక్రసి పీకలలోతు అవినీతి ఊబిలో కూరుకుపోÆుుంది. ఇలాంటి పరిస్థితు లలో ఈ దేశంలో సగటు జీవి బ్రతుకు గురించి ఆలోచించే వారెవరు?

-కులాల వారిగా ఆర్థిక కేటాయింపులు, కార్పోరేషన్లు, పరిష త్తులు వేయటంకంటే, సమాజంలోని అన్ని పేదవర్గాల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు చేపట్టాలి. కులాలవారీగా కేటాయిం పులనేవి దోపిడి వ్యవస్థను కొనసాగించే కుట్రలో భాగాలు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలకిదొక మేలిముసుగు.

మద్యపానం సమాజంలోని పేదలను పీల్చిపిప్పి చేస్తుంది. చిన్న వయసులోనే అనారోగ్యం, నిస్సత్తువ, అకాల మరణాలు, వారి కుటుంబాలు అనాథలౌతుంటే, ఆ మద్యపానం ద్వారా వచ్చే ముదనష్టపు జబ్బుతో వితంతువుల పెన్షన్లు, సంక్షేమ కార్యక్ర మాలు చూపించి ఇదే సామాజిక న్యాయమంటారా! ఈ మోసా లకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరగాలి పోరాటాలు పెర గాలి. ప్రతిఘటించి నిలదీసే శక్తిగా మరాలి. అది రాజకీయ పోరాటం కావాలి.


- చాడ వెంకటరెడ్డి

వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
మొబైల్‌ : 94909 52301

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement