
సాక్షి ,మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ పోటీచేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు