
సాక్షి,సంస్థాన్ నారాయణపురం: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెలరోజుల్లో పడిపోతుంది.. సీఎం కేసీఆర్ కుటుంబం దాచుకున్న డబ్బులు బయటకు వస్తాయి’.. అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూసుకుంట్ల, గీసుకుంట్ల కాకుండా దమ్ముంటే సీఎం కేసీఆర్ మునుగోడులో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నిక తనది కాదని, మునుగోడు ప్రజల ఎన్నిక.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటికి తులం బంగారం ఇచ్చినా టీఆర్‌ఎస్ గెలవదని ఆయన స్పష్టం చేశారు.