ఢిల్లీ : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా బీఆర్‌ఎస్ పార్టీ తరుఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై న్యాయనిపుణులతో మాట్లాడేందుకు కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణలతో,రాజ్యాంగ నిపుణులతో ఇవాళ సాయంత్రం (ఆగస్ట్ 5న)భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నాం. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment