సాక్షి, నల్గొండ : నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మతి భ్రమించింది తమకు కాదని కేసీఆర్ ఇచ్చిన షాక్‌కి గుత్తాకే మతిభ్రమించి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని ధ్వజమెత్తారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామని నిప్పులు చెరిగారు. పార్టీని బ్రతికించడానికే పోటీచేస్తున్నామన్నారు. తానే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో మాట్లాడి ఎంపీగా గెలిపిస్తే పార్టీలు మారింది గుత్తా సుఖేందర్ రెడ్డి అని తూర్పారబట్టారు. మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే అని, ఆయనంత అవినీతిపరుడు దేశంలోనే లేడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment