komati reddy venkatareddy
-
మునుగోడుకు దూరం
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి సంపూర్ణ విధేయత ప్రకటించే ఆయన ఓరకంగా ధిక్కార స్వరాన్నే వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికపై సోమవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన కీలక భేటీకి ఆయన గైర్హాజరు అయ్యారు. ఆ తర్వాత ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ సోనియాగాంధీకి లేఖ పంపారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లలేనని అందులో స్పష్టం చేశారు. పార్టీ లోని కొందరు తనను అవమానపరుస్తున్నారని, పార్టీ కోసం మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న తనలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరి తనకు మనస్తాపాన్ని కలిగించిదని పేర్కొన్నారు. కాగా సోనియాగాంధీకి కోమటిరెడ్డి రెండు లేఖలు పంపారని, ఒక లేఖ బహిర్గతం కాగా మరో లేఖను గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. బహిర్గతమైన లేఖలో రేవంత్ వైఖరి కారణంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వెంకట్‌రెడ్డి కూలంకషంగా వివరించారని సమాచారం. పార్టీలో పరిణామాలన్నీ అర్థమయ్యే విధంగా రాసిన ఈ లేఖలో.. తెలంగాణ పార్టీలో జరగాల్సిన అంతర్గత మార్పుల గురించి కూడా ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది. బహిర్గతమైన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పార్టీకి విధేయుడిగానే కొనసాగుతాను కానీ.. ‘ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తాను. అయితే కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో పార్టీలోని కొన్ని వర్గాలు కావాలని నన్ను అవమానించడంతో పాటు పనికట్టుకుని దాడులు చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్న నన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం మనస్తాపాన్ని కలిగిస్తోంది. పార్టీలో కొత్తగా చేరినప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించారు. నేను పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయనకు పూర్తి సహకారం అందించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. కానీ రేవంత్‌రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. రోజురోజుకూ నాపై పెరుగుతున్న ఈ దాడులు.. పార్టీపై తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. గతంలో ఆయన నాకు చెప్పిన క్షమాపణలను కూడా నేను అంగీకరించాను. కానీ మళ్లీ నాతో పాటు ఇతర సీనియర్లను అవమానించడం వారికి పరిపాటిగా మారింది. నన్ను హోంగార్డులుతో పోల్చిన ఆయన తనకు తాను డైరెక్ట్ రిక్రూటీ ఐపీఎస్‌గా చెప్పుకున్నారు. నేను పార్టీ విధేయుడిగానే కొనసాగుతాను. కానీ నా పట్ల అవలంబిస్తున్న అవమానపూరిత వైఖరి కారణంగా నేను మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.’ అని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. వాళ్లతోనే ప్రచారం చేయించుకోండి: కోమటిరెడ్డి ఢిల్లీలో భేటీకి గైర్హాజరై హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వాళ్లను గుర్తించకుండా నాలుగు పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, తెలంగాణ కోసం కొట్లాడిన తనలాంటి వారిని పట్టించుకోకుండా హడావుడి చేసే వాళ్లను గుర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీ విషయంలో మాణిక్యం ఠాగూర్ దొంగనాటకాలాడుతున్నారని, పార్టీ కార్యకర్తలకు అవమానం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి వైఖరి కారణంగానే తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయిందని, దానికి ప్రతిఫలంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ప్రచారం చేసిన వాళ్లతోనే మునుగోడులోనూ ప్రచారం చేయించుకోవాలని అన్నారు. మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలన్నారు. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి నేతలను రాష్ట్ర పార్టీ ఇన్చార్జులుగా పంపాలనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. మరోసారి పార్టీ నేతలందరి అభిప్రాయాలను తీసుకుని కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌లో ‘నల్లగొండ’ కాక!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కాక మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న జిల్లా పర్యటనల్లో భాగంగా నల్లగొండ జిల్లాకు వెళ్తుండడం ఇందుకు కారణమయ్యింది. రేవంత్ నల్లగొండ పర్యటన ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, తాజాగా శుక్రవారం ఆయన నాగార్జునసాగర్‌కు వెళ్తుండడం, ఆయన పర్యటన గురించి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రేవంత్ నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ పార్టీ బలంగా ఉందని, ఉత్తమ్‌తో పాటు జానా, తాను అన్నీ చూసుకుంటామని, తామే అక్కడ పహిల్వాన్లమని కోమటిరెడ్డి గురువారం మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ బలంగా ఉన్న చోట్ల సమీక్షలు పెట్టినా పెట్టక పోయినా రాహుల్ సభకు జనాలు వస్తారని, బలం గా లేని జిల్లాలకు వెళ్లి అక్కడి నేతలు, కార్యకర్తలను సిద్ధం చేయాలంటూ కోమటిరెడ్డి సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్ ఓకే.. కోమటిరెడ్డి నో రేవంత్‌ను నల్లగొండకు రావద్దని నేరుగా చెప్పేందుకే కోమటిరెడ్డి అలా వ్యాఖ్యానించారని, రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా అంగీకరించేందుకు ఆయన లోలోపల ససేమిరా అంటున్నారని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమనే చర్చ జరుగుతోం ది. వాస్తవానికి, ఈ నెల 27న రేవంత్ నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకత్వంతో సమావేశం కావాల్సి ఉంది. కానీ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలతో చెప్ప కుండానే షెడ్యూల్ రూపొందించారనే కారణంతో కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన పర్యటన వాయిదా పడిందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మరోమారు పార్టీ నేతలతో మాట్లాడిన రేవంత్ తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకోవ డం గమనార్హం. ఈ సమావేశానికి హాజరు కావా లని ఉమ్మడి జిల్లాలోని నాయకులందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి హుజూర్నగర్ నుంచి ర్యాలీగా సాగర్‌కు వెళ్లేందుకు నల్ల గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కోమటిరెడ్డి మాత్రం ఈ సమావేశానికి తాను వెళ్లడం లేదని చెప్పడం చర్చకు తావిస్తోంది. తన నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమం ఉన్నందున తాను సాగర్‌కు వెళ్లడం లేదని కోమటిరెడ్డి చెప్పడం గమనార్హం. వెళ్లొద్దని ఎలా అంటారు? కోమటిరెడ్డి మనసులో ఏమున్నప్పటికీ, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని రాష్ట్రంలో ఫలానా చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం భావ్యం కాదనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా రేవంత్ వెళ్లవచ్చని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర నేతలు కూడా.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను ఏఐసీసీ నియమించిన తర్వాత అన్ని జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే అధికారం ఆయనకు ఉంటుందని, దీన్ని అడ్డుకునేందుకు, అభ్యంతర పెట్టేందుకు ఎవరికీ అధికారం ఉండదని అంటున్నారు. మొత్తంమీద రేవంత్ నల్లగొండ పర్యటన, ఆ పర్యటన గురించి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. -
Sakshi Cartoon: టీ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి నియామకం
టీ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి నియామకం -
బీజేపీ ఆలోచనలే కేసీఆర్ మాటలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరస నగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. సోమవారం ఢిల్లీలోని పార్ల మెంట్ ఆవరణలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌లు ‘రాజ్యాంగాన్ని రక్షించండి– కేసీఆర్‌ను శిక్షించండి’ అంటూ ప్లకార్డులను పట్టు కుని ఆందోళన చేశారు. గిరిజన, దళిత, బలహీన వర్గాలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన రక్ష ణను, హక్కుల్ని తొలగించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఆ పార్టీ ఆలోచనలను కేసీఆర్ ద్వారా మాట్లాడించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యల అం శంలో రాష్ట్రపతి, ప్రధాని వెంటనే స్పందించి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇస్తామన్నారు. పరిశీలనలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. ఆర్థిక ఆమోదం కోసం ప్రస్తుతం ఈ ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉందని, వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించాక యూజీసీ నిధులు కేటాయిస్తుందని సహాయ మంత్రి సుభాష్ సర్కార్.. రేవంత్‌రెడ్డి ప్రశ్నకు బదులిచ్చారు. -
రైతుల అభిమానం పొందిన నేత వైఎస్సార్: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి మరొక లీడర్ మళ్లీ రాడని, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు.శనివారం కోమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత కరెంటు ఇచ్చి రైతుల అభిమానం వైఎస్సార్ పొందారని తెలిపారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలే ఆయనను ప్రతిపక్షంలో కూర్చో బెట్టాయని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో చాలా గొడవలు ఉన్నాయని, రేవంత్‌రెడ్డి రాష్ట్రం మొత్తం గెలిపించలేడని అన్నారు. మహాబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, నల్గొండలో తాము గెలుపించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టీపీసీసీ అధ్యక్షపదవి ఇవ్వలేదని ఇన్ని రోజులు బాధపడ్డానని, అయితే తనకు కాంగ్రెస్ పార్టీలో ఎవరితో వైరుధ్యాలు లేవని స్పష్టం చేశారు. చదవండి: ‘విత్‌డ్రా’మా.. వివాదం.. ‘టీఆర్ఎస్ నేతలు సంతకం ఫోర్జరీ చేశారు.. కోర్టుని ఆశ్రయిస్తా’ వానకాలం వరిధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వరి ధాన్యం మార్కెట్లోకి తీసుకొచ్చి కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వానకాలం వరి ధాన్యం కనుగోలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తామని చెప్పారు. -
సోనియాను దెయ్యమ్మన్నవారు మా దాంట్లో ఉన్నారు
-
కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు హజరు కాలేను
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిర్వహించబోయే.. దళిత గిరిజన సభను వాయిదావేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ పర్యటన సందర్భంగా సభకు హజరు కాలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 21 తర్వాత ఎప్పుడు సభ పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరంలేదని కోమటిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవసభ వాయిదాపడే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. -
వైఎస్సార్ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి
-
లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్న కోమటిరెడ్డి
-
రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని పాలించాలని, ప్రజలను ఇబ్బందులు పెడుతే చూస్తూ ఉరుకొమని, గాడిల పాలనను బద్దలు కొడుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా పిచ్చి తుగ్లక్ పాలనకు స్వస్తి పలకాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్పైన ప్రజల పక్షాన కోర్టులో ఫీల్ దాఖలు చేశానని, ఎల్ఆర్ఎస్ రద్దు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం కాదు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం నీకు(కేసీఆర్) సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. శ్వాశతంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చెయాలి లేకపోతే కేసీఆర్, టీఆర్ఎస్ను శాశ్వంతంగా ప్రజలు రద్దు చేస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టవద్దన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్నారు. కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్లు అని దాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నావని ఫైర్ అయ్యారు. మూడు నెలలు రిజిస్ట్రేషన్ల్ అపీ ప్రజలను ఇబ్బంది పెట్టవని విరుచుకుపడ్డారు. నియంత్రణ వ్యవసాయం అని మళ్లీ రద్దు చేశామని, కేసీఆర్ నిర్ణయలను చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారని అన్నారు. బుర్ర దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకో అని హితవు పలికారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులపైన ప్రేమ పుట్టుకచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తావు, ఇక కేసీఆర్ అబద్దాలకు స్వస్తి పలకాలన్నారు. రైతులకు ఉచిత ఎరువులు అని రైతులకు శుభవార్త వారం రోజుల్లో చెబుతానన్నది ఏం అయిందని ప్రశ్నించారు. సకల జనులను ఏకం చేసి తెలంగాణ కోసం చేసిన ఉద్యమం కంటేని పెద్ద ఉద్యమం చేస్తామని కేసీఆర్ నియంత పాలనకు చరమగితం పాడుతామని, కేసీఆర్‌ను గద్దెదించుతామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. -
దుబ్బాక ఎన్నికలు: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ,బీజేపీలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ అభ్యర్ధి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రముఖ టీవీ ఛానెల్లో బ్రేకింగ్ నడిచినట్లు ఒక వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది. ఓటమి భయం తో హరీష్ రావు, రఘనందన్ చేసిన కుట్రే ఇది. ఈ కుట్రపై డీజీపీ కి ఫిర్యాదు చేశాం. కేరళలో ఇదేవిధంగా దుష్ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేసింది. కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త కుట్రకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నాడని తమకు అనుకూలమైన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నది లేన్నట్టు.. లేనిది ఉన్నట్టు గోబెల్స్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ప్రజల గొంతు వినిపించాల్సిన ఛానల్స్ కొన్ని పార్టీలే నడిపించడం వల్లే ఈ అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి ఛానల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కోరారు. చదవండి: దుబ్బాక పోలింగ్: చేగుంటలో కలకలం -
‘వైఎస్ రాజశేఖరరెడ్డితో మాట్లాడి ఎంపీగా గెలిపిస్తే..’
సాక్షి, నల్గొండ : నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మతి భ్రమించింది తమకు కాదని కేసీఆర్ ఇచ్చిన షాక్‌కి గుత్తాకే మతిభ్రమించి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని ధ్వజమెత్తారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామని నిప్పులు చెరిగారు. పార్టీని బ్రతికించడానికే పోటీచేస్తున్నామన్నారు. తానే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో మాట్లాడి ఎంపీగా గెలిపిస్తే పార్టీలు మారింది గుత్తా సుఖేందర్ రెడ్డి అని తూర్పారబట్టారు. మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే అని, ఆయనంత అవినీతిపరుడు దేశంలోనే లేడని ఆరోపించారు. -
వారు రాజకీయ మానసిక రోగులు: బూర నర్సయ్య
ఆలేరు: కోమటిరెడ్డి సోద రులు రాజకీయ మానసిక రోగులని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆలేరు, భువనగిరి, జనగాం నియోజకవర్గాల్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఎయిమ్స్‌ను తీసుకువస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాలంటే పక్షులు అటు ఇటు తిరిగినట్లు కాదని, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ గా, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరైంది కాదని దీన్ని రాజకీయ జబ్బు (మెంటలోమానియా) అంటారని విమర్శించారు. ఈ జబ్బు ఉన్నవాళ్లు నేనే చక్రవర్తినని అనుకుంటారని కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చురకలంటించారు. ఈ కార్యక్రమం లో బడుగుల లింగయ్య యాదవ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, రాజీవ్‌సాగర్ పాల్గొన్నారు. -
హైకోర్టులో కార్యదర్శులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఎట్టకేలకు ఊపిరిపీల్చుకున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలి పేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమ వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాము ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశామని, అసెంబ్లీ రద్దు కావడంతో ధర్మాసనం ఆ అప్పీళ్లతో పాటు సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను కూడా మూసేసిందని, అయినా కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందుకెళ్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరు తూ నిరంజన్‌రావు, నరసింహాచార్యులు వేర్వే రుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సింగిల్ జడ్జి తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను మూసేసినా కూడా సింగిల్ జడ్జి మాత్రం విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా న్యాయ, అసెంబ్లీ కార్యదర్శులకు బెయిలబుల్ వారంట్లు జారీ చేయడమే కాక, కోర్టు ముందు హాజరైన తర్వాత వారిని తిరిగి హైకోర్టు రిజిస్ట్రార్ కస్టడీకి అప్పగించారన్నారు. ఈ సమయంలో ధర్మాస నం.. కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయ వాది కోసం ఆరా తీసింది. అయితే ఏ ఒక్కరూ కోర్టులో లేకపోవడంతో, దీన్ని బట్టి ఈ కేసు పట్లవారు అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెషల్ జీపీ శరత్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్‌జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
గులాబీ గుబాళింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో 837 పంచాయతీలకు ఎన్నికలు జరగగా... టీఆర్ఎస్ మద్దతుదారులు 520 పంచాయతీల్లో విజయం సాధించి తమ పట్టును నిరూపించుకున్నారు. తొలి రెండు విడతల్లో దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లలో 20 మండలాల పరిధిలోని 580 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 380 పంచాయతీలు టీఆర్ఎస్ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి. బుధవారం మూడో విడత నల్లగొండ డివిజన్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 241 పంచాయతీల్లో (మొత్తం 257 కాగా, 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి) పోలింగ్ జరిగింది. మూడో విడతలో టీఆర్ఎస్ మద్దతుదారులు 140 పంచాయతీల్లో గెలిచారు. దీంతో మొత్తంగా జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్ మద్దతుదారులు 520 పంచాయతీల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 268 పంచాయతీల్లో, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుదారులంతా కలిపి 49 పంచాయతీల్లో విజయం సాధించారు. ఏకగ్రీవాల ద్వారానే 102 మూడు విడతల పంచాయతీ సమరంలో ఏకగ్రీవాల ద్వారానే టీఆర్ఎస్ మద్దతుదారులు 102 చోట్ల విజయం సాధించారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 21వ తేదీన దేవరకొండ డివిజన్లోని 305 గ్రామ పంచాయతీలకు గాను 52 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వీరిలో 50 మంది టీఆర్ఎస్ మద్దతుదారులే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 276 గ్రామ పంచాయతీలకుగాను 43 మంది సర్పంచులు ఏకగ్రీవం కాగా, వీరిలో 42 మంది టీఆర్ఎస్ వారే ఎన్నికయ్యారు. మూడో విడతలో 257 పంచాయతీల్లో కేవలం 16 పంచాయతీల్లో మాత్రం సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. మొత్తంగా మూడు విడతల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాల ద్వారానే 102 పంచాయతీలను సొంతం చేసుకున్నారు. చిత్రమైన పొత్తులు పల్లెలపై పట్టుకోసం ఆయా పార్టీలు పంచాయతీ సమరంలో చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకున్నాయి. పూర్తిగా పార్టీ రహిత ఎన్నికలే అయినా... ప్రతి పంచాయతీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, ఆ పార్టీ నేతల ప్రచారం చేయకుండా ఎన్నికలు జరగలేదు. ప్రధానంగా టీఆర్ఎస్లో సర్పంచ్ టికెట్లకు గట్టి పోటీ ఏర్పడింది. దీంతో పదుల పంచాయతీల్లో టీఆర్ఎస్ వర్గీయుల్లోనే పోటీ నెలకొంది. మరోవైపు పంచాయతీలను గెలుచుకునేందుకు స్థానిక పరిస్థితులను బట్టి పార్టీల మద్దతుదారులు పొత్తులు పెట్టుకున్నారు. అయితే.. ఒక పంచాయతీకి మరో పంచాయతీకి పోలికే లేకుండా అయ్యింది. కొన్ని పంచాయతీల్లో టీఆర్ఎస్, సీపీఎం, ఇతర పార్టీలు కలిస్తే, మరికొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ సీపీఎం, ఇతర పార్టీలు కలిశాయి. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీసీఎం, తదితర పార్టీలు కలిసి పోటీ చేసిన పంచాయతీలు కూడా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుదారులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీలో నిలిచిన వారికి ఎదుటి పక్షం వారూ మద్దతిచ్చి గెలిచిపించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పంచాయతీ సమరంలో చిత్రవిచిత్రమైన పొత్తులు కనిపించాయి. పొత్తుల్లో ఉప సర్పంచ్ పదవులే కీలకంగా మారాయి. ఉనికి నిలబెట్టుకున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులకు అనుకూలంగా గాలి వీచినా.. కొన్ని మండలాల్లో కాం గ్రెస్ మద్దతు దారులు సైతం సమ ఉజ్జీలుగా నిలిచారు. జిల్లా మొత్తంలో ఆ పార్టీ మద్దతుదారులు 268 పంచాయతీల్లో గెలిచారు. తొలి రెండు విడతల్లో ఏకంగా 167 చోట్ల విజయం సాధించారు. మూడో విడతలో 101 పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా మొత్తం గా 268 పంచాయతీల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులు తమ పార్టీ ఉనికిని నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు అభినందనలు : కోమటిరెడ్డి నల్లగొండ రూరల్ : నల్లగొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారంతా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడంతోపాటు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దన్నారు. పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గెలుపొందిన అభ్యర్థులు కృషి చేయాలని కోమటిరెడ్డి కోరారు. -
కేసీఆర్ కుటుంబం పాలైన తెలంగాణ
నల్లగొండ రూరల్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆ ర్ కుటుంబం పాలైందని మా జీ మంత్రి, కాంగ్రెస్ మేనిఫె స్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ మండలంలోని అన్నెపర్తి, అప్పాజిపేట, బుద్దారం, దీపకుంట, కంచనపల్లి, గుండ్లపల్లి, కుదావన్‌పూర్, దోనకల్, కొండారం, రాములబండ, దోమలపల్లి గ్రామాల్లో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయా గ్రామాల్లో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని, కేవలం కేసీఆర్ కుటుంబమే లబ్ధిపొందిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటింటికీ నల్లా ఇస్తామని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ రూ.500 కోట్లుతో ఇల్లు నిర్మించుకున్నాడని, పేదల ఇండ్ల నిర్మాణం విస్మరించాడని ఆరోపించారు. కేసీఆర్ చేసిన రుణమాఫీతో బ్యాంకర్లే బాగుపడ్డారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు తీసుకుని ప్రజలకు మాత్రం బర్లు, గొర్రు ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి, తెల్లకార్డు ఉన్నవారందరికీ ఏడాదికి 6 సిలిండర్లు అందిస్తామన్నారు. వృద్ధులైన భార్య, భర్తలకు నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. ప్రజల కోసమే బతికే వ్యక్తినని.. మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తిచేసి చెరువులు నింపిస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరానికి రూ.కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశాడని విమర్శించారు. టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ అహం కారం తగ్గాలంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ మాయమాటలు ప్రజలు నమ్మే స్థితిల్లో లేరన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భారీఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మహిళలతో కలిసి కోలాటం వేసి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, జెడ్పీటీసీ రాధ, నాయకులు వంగాల స్వామిగౌడ్, గుమ్మల మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, గంగుల సైదులు, శంకర్‌గౌడ్, వెంకన్న, యాదగిరిరెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్
నల్లగొండ రూరల్ : కాంగ్రెస్ పార్టీ మిగులు తెలంగాణగా ఇస్తే కేసీఆర్ నాలుగేళ్లలో రెండు లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మహాకూటమి నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌కు ఆహంకారం పెరిగిందని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. తాను చెప్పిన వారికే రాహుల్ గాంధీ టికెట్లు ఇచ్చారని తెలిపారు. తాను ఇతర జిల్లాలో ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని, ఐక్యంగా ఉండి ఐదోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టీడీపీ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్ పార్టీ వేరైనప్పటికి మంచినాయకుడని ప్రశంసించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బాగుపడిందన్నారు. 50వేల మెజార్టీతో కోమటి రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ సమావేశంలో జనసమితి నాయకులు పి.గోపాల్ రెడ్డి, పందుల సైదులు గౌడ్, సుంకరి వెంకన్నగౌడ్, పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, రియాజ్, ఎల్వీ యాదవ్, మిర్యాల యాదగిరి, మధుసూదన్ రెడ్డి, రవి, రఫి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, సైదులు, సుభాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
తిరుగులేని శక్తిగా కాంగ్రెస్
సాక్షి, నల్లగొండ : మీ రాకతో నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాలుగు సార్లు గెలిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ గౌరవాన్ని నిలబెట్టా...ఐదోసారి గెలిపించండి.. ఐదేళ్లు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు శనివారం మర్రిగూడలోని లక్ష్మీగార్డెన్‌లో కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. భారీగా వచ్చిన కార్యకర్తలను చూసి కోమటిరెడ్డి ఉద్వేగభరింతగా ప్రసగించారు. మీ ప్రేమను చూ స్తుంటే నాబాధను మరిచిపోతున్నాని అన్నారు. మీలో నాకొడుకును చూసుకుంటున్నారు. కార్యకర్తలకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ కోమటిరెడ్డి ప్రకటించారు. తాను సమావేశానికి వస్తుంటే కార్యకర్తలలు ప్రేమతో ఎదురువచ్చారు. కిక్కిరిసిన కార్యకర్తల మధ్య స్టేజిమీదికి వచ్చా నేను గట్టివాన్ని కాబట్టి తట్టుకున్నా.. అదే కేసీఆర్ ఆయితే ఎప్పుడో చచ్చేవాడని అనడంతో కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. మీ ప్రేమకు నేను మరిచిపోను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆశయ సాధనకు తనను గెలిపించాలని కోరారు. నన్నుగెలిపిస్తే అది మీగెలుపు, నేను ఓడితేమీరు ఓడినట్లేనన్నారు. తెలంగాణ కోసం పోరాడడంతో పాటు ఫ్లోరిన్ సమస్య పరిష్కారానికి ఆమరణ నిరాహారదీక్ష చేశానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. మెడికల్‌కళాశాలను పూర్తి చేసి నల్లగొండ రూపురేఖలు మారుస్తానన్నారు. లక్షమందితో నామినేషన్ తాను ఐదో సారి లక్షమందితో కలిసి నామినేషన్ వేయాలని,కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ని మంచి పొజీషన్లో చూస్తాము, కాబట్టి అందరం కలిసి గెపించాలని పిలుపు నిచ్చారు. అందుకు అందరం కష్టపడి పనిచేయాలని అన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నాని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపే ధ్యేంగా అందరం కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తామని చెప్పారు. పార్టీలో చేరిన మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 20 సంవత్సరాల ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సందర్భంలో నియోజక వర్గం ప్రశాతంగా ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి గెపుపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఖయూంబేగ్, హమీ ద్, బండమీది అంజయ్య, శ్రీనాథ్, మార్కెట్ వైస్ చైర్మన్ పాశం నరేష్‌రెడ్డి, జానకిరాములు, పనస శంకర్, సిరాజుల్లా ఖాన్, హజీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వంగాల స్వామిగౌడ్, జెడ్పీటీసీలు శ్రీనివాస్‌గౌడ్, రాధ,అల్లి సుభాష్, వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. అంతకు ముం దు ఎన్జీ కళాశాల నుంచి లక్ష్మిగార్డెన్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. దొంగల చేతివాటం ..! కాంగ్రెస్ సమావేశంలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. సమావేశానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడం కోమటిరెడ్డిని కలిసేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే దుండగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. నాయకుల జేబులో నుంచి డబ్బులు కొట్టేశారు. బుర్రిశ్రీనివాస్రెడ్డితో పాటు పలువురు నాయకుల వద్ద నుంచి రూ.3 లక్షల వరకు తస్కరించారు. ఓ నాయకుడి వద్ద లక్ష రూపాయలు పోగా మిగిలిన వారి జేబుల్లోనుంచి 10 నుంచి 20 వేల పైచిలుకు వరకు కొట్టేశారు. సమావేశం అనంతరం నాయకులు తమ జేబులు చూసుకుని అవాక్కయ్యారు. -
ఐదోసారి అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించండి
సాక్షి, నల్లగొండరూరల్ : నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే..మంత్రిగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. ఐదోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పట్టణంలోని పలువార్డులతో పాటు నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజలకు సేవ చేసేందుకే పరితపించానని పేర్కొన్నారు. ప్రజాభిష్టం మేరకు ఆమరణ నిరాహార దీక్ష, పదవీ త్యాగానికి కూడా వెనుకాడలేదని గుర్తు చేశారు. తనను ఓడించేందుకు టీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని.. వారి అభిష్టాన్ని ప్రజలే తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. నాడు తెల ంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఇందిరమ్మ’ తరహాలో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పథకం తరహాలో సొంతభూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు ఇస్తామన్నారు. అదే విధంగా రైతులందరికీ ఏక కాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 50శాతం ఉన్న మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక పట్టణంలోని 10, 11వార్డుల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలతో పాటు దండెంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ చింతపల్లి రమణా రామలింగం, నర్సింహతో మరికొందరు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సి పల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి ఆలకుంట్ల లింగయ్య, చాపల లింగయ్య, యాదగిరిగౌడ్, సిరిగిరి వెంకట్‌రెడ్డి, పసల శౌరయ్య, ఎల్లయ్య, వంగూరి లక్ష్మయ్య, జెడ్పీటీసీ రాధాలింగస్వామి, మాజీ సర్పంచ్ అల్లి నాగలక్ష్మిశంకర్ యాదవ్, ధర్మయ్య ,శ్రీధర్‌రెడ్డి, గోపగోని శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు. -
నేతన్నలకు అభయ‘హస్తం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకర్షించేలా ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని లక్షలాది మంది నేత కార్మికులను ఆదుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చేనేత, పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పించాలని మేనిఫెస్టోలో ప్రతిపాదించనుంది. దీంతోపాటు ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కూడా కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. ఈ అంశాలతోపాటు సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కో–చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ పాలనలో నేత కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, బతుకమ్మ చీరలన్నీ సిరిసిల్ల నేతన్నలకే ఇస్తామని చెప్పి సూరత్, ముంబైల నుంచి కిలోల లెక్కన చీరలు తెప్పించి అన్ని వర్గాల్లాగానే నేత కార్మికులనూ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో.. ఇప్పటికే అనేక వర్గాల నుంచి వినతులు స్వీకరించిన దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఈ నెల 27న రాహుల్ గాంధీ పాల్గొనే రెండో బహిరంగ సభ అనంతరం మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వచ్చిన వినతులను విభాగాలవారీగా వర్గీకరించి వాటిలోని ముఖ్యాంశాలతో ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనికి తుది రూపు ఇచ్చే ముందు ప్రధాన వర్గాలు, ఆ వర్గాల ముఖ్యులతో భేటీ కావాలని నిర్ణయించింది. ఈ నెల 27కు ముందే ఓ రోజంతా వర్క్‌షాప్ ఏర్పాటు చేసి కార్మిక, చేనేత, సింగరేణి, ఉపాధ్యాయ, ఆర్టీసీ, ఎన్ఆర్ఈజీఎస్, ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని భావిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీపై రాహుల్ తన ప్రసంగంలోనే ప్రకటన చేయగా రెండో బహిరంగ సభలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ ఏర్పాటు అంశాలను ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు రద్దు అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించగా దీన్ని రాహుల్‌తోనూ చెప్పించాలని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. రాహుల్ ప్రకటించే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతామని, ప్రజాకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ చెబుతున్నారు. ముసాయిదా మేనిఫెస్టోలో ప్రధానాంశాలు.. ♦ రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ, రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులను సాధారణ రైతులుగా గుర్తించి రైతుబంధు సహా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు. ♦ క్వింటాలు రూ. 2 వేలకు వరి, మొక్కజొన్న కొనుగోలు. పత్తి రూ. 7 వేలకు, మిర్చి రూ. 10 వేలకు కొనుగోలు. ♦ రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది. ♦ 10 లక్షల నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి. ♦ పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్. ♦ తొలి ఏడాదే ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో లక్ష ఉద్యోగ అవకాశాల కల్పన. ♦ ప్రతి మహిళా సంఘానికి రూ. లక్ష గ్రాం ట్, రూ. 10 లక్షల రుణం. ♦ వికలాంగులకు పెన్ష న్ రూ. 3,000కు పెంపు. ♦ వృద్ధులు, వితంతువు లు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్ రూ. 2 వేలకు పెంపు. ♦ ఇళ్లు లేని ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాం గులకు రూ. 6 లక్షలు. ♦ 58 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు. అర్హులైన భార్యాభర్తలిద్దరికీ పెన్షన్లు (ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు వర్తింపు). ♦ ఇంది రమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ.2 లక్షలు. ♦ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు, పరిమితి రూ.5 లక్షలకు పెంపు. ♦ తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలు. ♦ అన్ని బీపీఎల్ కుటుంబాలకు ఏటా ఆరు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం. ♦ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా. ♦ రేషన్ ద్వారా బియ్యం, గోధుమలతో పాటు మరి న్ని పప్పుధాన్యాలు. ♦ గల్ఫ్ బాధితుల కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు. ♦ గల్ఫ్ లో మరణించిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షలు. -
కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం
సాక్షి, నల్లగొండ : రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను సరఫరా చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆదివారం కోమటిరెడ్డి హైదరాబాద్‌నుంచి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అన్నెపర్తి బెటాలియన్ వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుం చి జిల్లా కేంద్రం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు విస్మరించి నియంతలా పరిపాలన సాగించిందని ధ్వజమెత్తారు. ము ఖ్యంగా కేసీఆర్ కుటుంబం దోచుకో దాచుకో అనే సిద్ధాంతానికే ప్రాధాన్యమిచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ తన కల్లబొల్లి మాటలు వల్లెవేస్తూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, ఎస్సీలకు మూడెకరాల భూమి ఏమయ్యాయని ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని కోమటిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పా ర్టీది మాటతప్పని.. మడమతిప్పని నైజమని అన్నారు. తా ము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. అదే విధంగా నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు పింఛన్లను పెంచుతామని చెప్పా రు. వచ్చే ఎన్నికల్లో నయవంచన పాలనకు చరమగీతం పా డి రైతురాజ్యాన్ని తీసుకురావాలని ప్రజలను అభ్యర్థించారు. వివిధ పార్టీలనుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో చర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అక్కడినుంచి పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అబ్బాసియా కాలనీలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించారు. అదే విధంగా పెద్ద సూరారం గ్రామం నంచి దాదాపు 300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బైకుర్యాలీగా వచ్చి కోమటిరెడ్డి గృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మంగమ్మ, మాజీ ఎంపీటీసీ జి. కర్ణమ్మ, నాగయ్య, తర్చన, పెండం అరుణ, రిజ్వాన్ అలి, మహమూద్, సమీర్, అస్కర్, ఇంతి యాజ్ అలీ, నిజాముద్దీన్, రజియద్దీన్, బషీర్ ఖాన్, పాష, షరీప్, అన్వర్, సుంకర బోయిన వెంకన్న పాల్గొన్నారు. -
వేడెక్కిన.. నల్లగొండ రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒక్క సభ.. ఒకే ఒక్క బహిరంగ సభ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో వేడెక్కించింది. ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న గురువారం నాటి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభతో గులాబీ శ్రేణులు ఫుల్ జోష్‌లోకి వచ్చాయి. దాదాపు వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి సభకు జనాన్ని సమీకరించారు. తాము ఆశించిన దానికంటే సభ విజయవంతం కావడంతో పార్టీ అభ్యర్థులు, నాయకులు సంబరంలో మునిగిపోయారు. ఈ బహిరంగ సభ వేదికగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలు కాంగ్రెస్‌లో చురుకు పుట్టించాయి. కేసీఆర్ తన ప్రసంగంలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తప్పుబడుతూనే.. ఉమ్మడి జిల్లా నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిలపై చేసిన విమర్శలకు గురువారం పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీటుగా స్పందించారు. జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులు, ఫ్లోరైడ్ సమస్య తదితరఅంశాలపై కేసీఆర్ చేసిన ప్రసంగంపై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు – ప్రతి విమర్శలు జిల్లా కాంగ్రెస్‌పై, గత కాంగ్రెస్ పాలనపై, ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై కేసీఆర్ చేసిన విమర్శలను కోమటిరెడ్డి తిప్పికొట్టారు. ఫ్లోరైడ్ సమస్యపై తానే పదకొండు రోజుల పాటు దీక్ష చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి టీడీపీ ప్రభుత్వం మెడలు వంచామని, కృష్ణా జలాలు సాధించామని, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీళ్లందించామని చెప్పుకొచ్చారు. దామరచర్లలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు మంత్రి జగదీష్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకు మొదలు పెట్టారని కోమటిరెడ్డి ప్రతి విమర్శ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును ఆపి తీరుతామని కుండబద్దలు కొట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ పనులకు నిధులు ఇవ్వడం లేదని, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తే తనెక్కడ పేరు వస్తుందోనని రైతులకు అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక వైపు గురువారం నాటి కేసీఆర్ ప్రసంగాన్ని తప్పుపడుతూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రతి విమర్శలు టీఆర్ఎస్కు ఆగ్రహం తెప్పించాయి. టీఆర్ఎస్ ఎదురు దాడి తమ అధినేత కేసీఆర్‌ను, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు తక్షణం స్పందించి ప్రతి విమర్శలు చేశారు. తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే కోమటిరెడ్డి కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టును తాము అధికారంలోకి వస్తే నిలిపివేస్తామన్న కోమటిరెడ్డి ప్రకటనపై ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత ప్రకటనా, లేకుంటే కాంగ్రెస్ పాలసీనా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తక్షణం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ప్రసంగంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నీ మాయమాటలు, అబద్దాలు మాట్లాడరని దుయ్యబట్టాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ప్రకటనలు జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి. -
ముందస్తు పై అంతుచిక్కని కోమటిరెడ్డి వ్యూహం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందస్తు ఎన్నికల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆయా మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బుధవారం చడీ చప్పుడు లేకుండా ముఖ్య కార్యకర్తలను పిలిపించుకుని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విషయం మీడియాకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ అధికార టీఆర్ఎస్ గురువారం నిర్ణయం తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి ఒకింత ముందుగానే తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కోమటిరెడ్డి సోదరులు టీఆర్ఎస్లో చేరుతారని ఒకవైపు ప్రచారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దక్షిణ తెలంగాణలో నల్లగొండ కేంద్రంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తార న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేగా నాలుగు టర్మ్‌ల పనిని, ఇక ముందు చేయాల్సిన నల్లగొండ అభివృద్ధి గురించి మాట్లాడారని పార్టీ వర్గాల సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చున్నానని, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సాధించానని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నా, పార్టీ నాయకత్వం శీతకన్నుతో అభివృద్ధి నిధులు రాలేదని, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచినా ప్రతిపక్షంలో ఉండిపోవడంతో అనుకున్నంత మేర అభివృద్ధి చేయలేకపోయాయని ఆవేదన చెందారని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వచ్చే ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటానని, నల్లగొండ అభివృద్ధిని పది తరాలు గుర్తుంచుకునేలా చేస్తానని కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చారని సమాచారం. అంతుబట్టని వ్యూహం కోమటిరెడ్డి అనుచరులు ఒకింత అయోమయంలోనే ఉన్నారని అంటున్నారు. పార్టీ మారుతారంటూ జరుగుతున్న సమాచారంపై కార్యకర్తలకు ఆయన కొంత స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే, నల్లగొండలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని చెప్పడంతో అసలు కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారా? అన్న ప్రశ్నలపై పార్టీ కేడర్‌లో తర్జనభర్జన జరిగిందని సమాచారం. గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆడిన రాజకీయ డ్రామాతో తక్కువ మెజారిటీ ఇచ్చారని, ఈసారి ఘన విజయం అందించాలని కార్యకర్తలకు సూచించారని వినికిడి. మొత్తంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల వ్యూహం ఏమిటో తమకు అంతుబట్టలేదని కొందరు కార్యకర్తలు అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కనగల్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్, కనగల్, నల్లగొండ, తిప్పర్తి మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా, నిత్యం పార్టీ కండువాతో కనిపించే కోమటిరెడ్డి ఈ ప్రత్యేక భేటీలో కండువా ధరించలేదు. దీంతోపాటు సమావేశానికి హాజరైన ఏ కార్యకర్త, నాయకుడి మెడలోనూ పార్టీ కండువా లేకపోవడం కొసమెరుపు. -
ధిక్కరణ’పై నేడు హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు తీర్పును అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై హైకోర్టు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను శాసన సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చారు. తీర్పును అమ లు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ శివశంకరరావు మరోసారి విచారణ జరిపి కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశామని, తీర్పుపై స్టే కోరు తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశా మని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వివరించారు. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఇద్దరు కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది తెలిపారు. జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసే విషయంపై మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. -
ఆ..మూడు స్థానాలపై!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైచేయి సాధించేందుకు అధికార టీఆర్ఎస్ ముందస్తుగానే కసరత్తు మొదలు పెట్టింది. పూర్వపు జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ చేతిలో ఎనిమిది (రెండు స్థానాలు చేరి కల ద్వారా వచ్చినవి) నియోజకవర్గాలు ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేతిలో మరో నాలుగు స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేతగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గులాబీ అధిష్టానం కూడా ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెబుతున్నారు. దీనిలో భాగంగానే, గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన చోట కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ గుర్తుతో గెలిచిన సూర్యాపేట, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, అదే విధంగా చేరికల ద్వారా పార్టీ గూటికి చేరిన మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు ఉండవని, సిట్టింగులకే ఈసా రి అవకాశమూ ఖాయమన్నది పార్టీ వర్గాల సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండనుంచి పోటీచేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహా రెడ్డి మూడేళ్లకుపైగా పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించా రు. ఆయన స్థానంలో టీడీపీనుంచి పార్టీలో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇన్చార్జ్ ఇవ్వడంతో, టికెట్ హామీ మీదనే ఆ బాధ్యతలు ఇచ్చారన్నది స్పష్టమైంది. ఈ స్థానంనుంచి బరిలోకి దిగే అభ్యర్థి విషయంలోనూ ఎలాంటి వివాదం లేదని అంటున్నా రు. ఇక, మిగిలిన కోదాడ, హూజూర్‌నగర్, నాగా ర్జునసాగర్ నియోజకవర్గాల్లో పోటీకి పెటాల్సిన నేతల గురించి మూడు రోజుల క్రితం చర్చ జరి గిందని సమాచారం. సీఎం కేసీఆర్ తనయు డు, మంత్రి కేటీఆర్.. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకులతో చర్చించారని తెలిసింది. మూడు చోట్ల పోటాపోటీ ! నాలుగు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఇన్చా ర్జులు ఉన్నారు. కానీ, ఆయా స్థానాల్లో కొత్త నాయ కత్వం ఉనికిలోకి రావడంతో ఈసారి టికెట్ కోసం పోటీ పెరిగిందని చెబుతున్నారు. ఈ పోటీ చివరకు పార్టీలో గుంపులను తయారు చేసింది. కోదా డలో గత ఎన్నికల్లో శశిధర్‌రెడ్డి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్రావు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడంతో గ్రూపులు మొదలయ్యాయి. ముందునుంచీ పార్టీలో కొనసాగుతున్న శశిధర్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌లో శంకరమ్మ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక్కడ కొత్తగా మరో నాయకుడు ఎన్ఆర్ఐ సైదిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా మంత్రికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. అదే మాదిరిగా నాగార్జునసాగర్ నియోజకవర్గం తరఫున సీపీఎం నుంచి చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి పోటీచేసిన నోముల నర్సిం హయ్య ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడ పార్టీకి ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక్కడినుంచే పార్టీ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి కూడా టికెట్ కో సం ప్రయత్నిస్తున్నారు. ఆయనా మం త్రికి దగ్గరి అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీలో రెండు వర్గాలు కనిపిస్తున్నా యి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోటీకి దిగబోయేది ఎవరనే విషయం కేడర్‌కు స్పష్టంగా తెలియకపోతే సమస్య అవుతుందని పార్టీ నాయకత్వం భావించిందని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మూ డు రోజుల కిందట మంత్రి కేటీఆర్ జిల్లా నాయకులతో చర్చించారని అంటున్నారు. ఈ హుజూర్నగర్, కో దాడల్లో ఎన్ఆర్ఐ సైదిరెడ్డి, శశిధర్‌రెడ్డిలకు లింకు పెట్టారని ఎవరో ఒకరికే అవకాశం ఉంటుం దని సూచాయగా చెప్పారని తెలిసింది. నాగార్జునసాగర్ విషయంలోనూ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా, బలంగా ప్రాబల్యం చూపగల సా మాజిక వర్గానికి చెందిన నాయకుడికే అవకాశం ఇవ్వాలన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. మొత్తం గా నల్లగొండ సహా నాలుగు స్థానాల్లోకే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు ఇస్తే, బీసీ లకు ప్రాతినిధ్యం కల్పిం చడం కష్టమన్న చర్చ జరి గిందని, అందుకే కోదా డ, హుజూర్‌నగర్‌లకు లింకుపెట్టారని అంటున్నారు. ఈ వ్యవహారంలో మరో రెండు మూడు భేటీలు జరిగాక కానీ మరిం త స్పష్టత రాదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
కోమటిరెడ్డి అనుచరుల ఆనందం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రెండు నెలలపాటు రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన అనుచర వర్గం సంబరాలు చేసుకుంది. గత నెల తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో చోటు చేసుకున్నపరిణామాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటిరెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గం పరిధిలోనే కాకుండా జిల్లాలో వివిధ మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నాయి. రెండు నెలలుగా అధికారికకార్యక్రమాలు లేకుండా.. కోమటిరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడంతో రెండు నెలలుగా ఆయన ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొనకుండా అయ్యారు. అంతేకాకుండా ఆయనకు ఉన్న గన్మెన్లను కూడా రద్దు చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఖాయమంటూ అధికార టీఆర్ఎస్ వర్గాలు హడావిడి చేశాయి. సభ్యత్వ వివాదంపై కేసు వాదనల్లో ఉన్నందున ఆరు వారాల వరకు ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించవద్దని కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతోనే నల్లగొండ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న వార్తలకు తెరపడింది. ఈ కేసు విషయంలోనే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కూడా రాజీనామా చేయడంతో అధికార పార్టీ ఇరుకున పడింది. ఇప్పుడు ఏకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరికాదని, కోమటిరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇది తమ గెలుపుగా కోమటిరెడ్డి, ఆయన అనుచరులు భావిస్తున్నారు. కాంగ్రెస్ సంబరాలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే పదవిలో కొనసాగించాలని, ఆయన సభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జిల్లాలో వివిధ మండలాల్లో సంబరాలు చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలో కోమటిరెడ్డి ఇంటినుంచి క్లాక్ టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో టపాసులు పేల్చారు. నకిరేకల్ నియోజకవర్గం శాలిగౌరారం, నార్కట్‌పల్లి, మునుగోడు నియోజకవర్గ కేంద్రం, చండూరులో, నల్లగొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. అదే విధంగా కొండమల్లేపల్లి, చింతపల్లిలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. నల్లగొండలో తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేశారని, కానీ, న్యాయం తమవైపు ఉన్నందునే హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని ఆయన అనుచరుడు, నల్లగొండ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఆ రెండు ఓట్లపై సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి కోమటిరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా ఓటరు జాబితాలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారు. దీంతో వీరి విష యంలో ఏం చేయాలని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహచార్యులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. ఆయన దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరారు. సభ్యత్వ రద్దు వ్యవహారంపై కేసు కోర్టు విచారణలో ఉంది. కోర్టు నిర్ణయం తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
కేటీఆర్ పేరుతో గూగుల్‌లో దోపిడీ దొంగ
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పేరు తో గూగుల్‌లో వెతికితే దోపిడీ దొంగ అని వస్తోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేటీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారమదంతో మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ సహా ఆయన కుటుంబం అంతా సోనియా గాంధీ కాళ్లు మొక్కారని, కానీ అధికారం రాగానే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. నిరాడంబరంగా ఉండే రాహుల్ గాంధీపై కేటీఆర్ అనుచితంగా మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్ఎస్లో చేరాలని కేటీఆర్ ఎన్నోసార్లు తనను బతిమిలాడినట్టుగా కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే కేసీఆర్ సహా కుటుంబం అంతా జైల్లో ఉండాల్సి వస్తుందనే భయంతోనే నోరు విప్పడంలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌తో సహా తాను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి అన్నారు. -
సీబీఐ విచారణా..? రాజీనామానా..?
సాక్షి, హైదరాబాద్: బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసు, ఎమ్మెల్యే వేముల వీరేశం సన్నిహితుల కాల్‌డేటాపై సీబీఐతో విచారణ జరిపించాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ‘కాల్‌డేటా తప్పు, ఎవరైనా తయారుచేసుకోవచ్చు’అన్న జగదీశ్‌రెడ్డిని మంత్రి అనడానికి సిగ్గుపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాల్‌డేటా తప్పయితే పోలీసులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ డేటా ప్రకారం తిరిగి విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మంగళవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చి బండి దగ్గర తగాదా అని పోలీసులు అంటుంటే, కాంగ్రెస్ అంతర్గత తగాదాలని మంత్రి అంటున్నారని విమర్శించారు. ఏది నిజమో తెలుసుకోకుండా మాట్లాడే వ్యక్తి మంత్రి స్థాయికి అనర్హుడని దుయ్యబట్టారు. మంత్రికి తెలివిలేదని వ్యాఖ్యానించారు. స్వగ్రామంలో, మరికొన్ని హత్య కేసుల్లో జగదీశ్‌రెడ్డి ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి 6 నెలలే మంత్రిగా ఉంటారని, ఆ తర్వాత చీప్ లిక్కర్ అమ్ముకుని బతకాలని ఎద్దేవా చేశారు. రాజకీయాల నుంచి కేసీఆర్ విరమించుకున్న తర్వాత హరీశ్‌రావు, కేటీఆర్ కొట్టుకుంటారన్నారు. -
'కేసీఆర్ అప్పులెందుకు చేస్తున్నారు?'
సాక్షి, నల్లగొండ : తన సొంత జిల్లాను మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అప్పులు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డికి వ్యవసాయంపై కనీసం అవగాహన లేదని దుయ్యబట్టారు. నీటి నిర్వహణపై సోమవారం నుంచి రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని స్పష్టం చేశారు. -
బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు వైఎస్ చలవే
నార్కట్‌పల్లి (నకిరేకల్): బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవేనని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమిం చేందుకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో మార్నింగ్‌వాక్‌లో భాగంగా ఉదయసముద్రం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు సాగునీరు లేక ఇబ్బందులు పడేవారని, త్వరలో ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. దీంతో తాగు, సాగునీరు సమస్య పరిష్కారమైనట్లేనన్నారు. అసెంబ్లీలో రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టుపై పదేపదే చర్చించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు ఒకే నెలలో రెండు సార్లు ప్రాజెక్టును పరిశీలించి పనులు వేగవంతం చేశారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. -
కోమటిరెడ్డీ.. నీకంత సీన్ లేదు !
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై పోటీ చేసేంత సీన్ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో తన సీటు గల్లంతవుతుందని, ఓటమి తప్పదన్న భయంతోనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని గుర్తించని ఆయన.. అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించడం ప్రచారం కోసమేనని అన్నారు. నల్లగొండలో అంత బలం ఉందనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో నిలబడితే ఎవరి బలమెంతో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణకు, సీఎం కేసీఆర్‌కు వస్తున్న గుర్తింపును చూసి ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌పై, మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా ఓర్వలేని తనంతోనే విమర్శలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. -
సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై గజ్వేల్లోనైనా పోటీకి సిద్ధమని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శనివారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ప్రజల సమస్యలు అర్థం కావడం లేదన్నారు, సచివాలయానికి వస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. మంత్రి కేటీఆర్‌కు అవార్డులు ఇస్తున్నరా, కొనుక్కుంటున్నరా అని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నల్లగొండ, మిర్యాలగూడ సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా చేయలేని అసమర్థుడు కేటీఆర్ అని విమర్శించారు. కేవలం 30 కోట్ల పనులనే మంత్రిగా కేటీఆర్ చేయలేకపోతే అవార్డులు ఎందుకిస్తున్నారో, ఎవరు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి మంత్రి కేటీఆర్‌కు అవార్డులు ఎలా వస్తున్నా యన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలే అవార్డులు ఇస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణాన్ని ప్రజలు 2019 ఎన్నికల్లో తీర్చుకుంటారని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి జిల్లా సమస్యలపై అవగాహన లేదని, సమస్యలే మంత్రికి పట్టవని అన్నారు. పీసీసీకి అధ్యక్షుడిగా ఎవరుండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, అదే ఫైనల్ అని కోమటిరెడ్డి చెప్పారు. -
‘చలో అసెంబ్లీ’లో హింసకు కేసీఆర్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని హింసాయుతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ సంపత్‌కుమార్, కార్యదర్శి టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. నిరసనలో ఏదైనా జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదదంటున్నారంటే.. టీఆర్ఎస్ కుట్రకు పాల్పడబోతోందని అర్థమవుతోందన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో వారు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన చేస్తామంటే మంత్రి హరీశ్ బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని, గూండాలను పెట్టి అల్లర్లు సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. చలో అసెంబ్లీలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఎంతమందిని అరెస్టు చేసినా కార్యక్రమం ఆగదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో సరుకు లేదంటున్న హరీశ్‌కు కాంగ్రెస్సే రాజకీయ భిక్ష పెట్టిందని, ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌ను మంత్రి చేసిందన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని మంత్రి హరీశ్‌ను సంపత్‌కుమార్ హెచ్చరించారు. -
రైతు సమస్యలపై 27న అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి గిట్టుబాటు ధర లభించడం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్ధం కావడం లేదని, రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు 27న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పరిమితం కావద్దని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వస్తున్న వార్తలపై తనకేమీ తెలియదని, రేవంత్ విషయాన్ని తనతో ఎవరూ చర్చించలేదని చెప్పారు. -
ఎనిమిదో నిజాంలా ఇనాంలిస్తున్నడు
కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్ సాక్షి, హైదరాబాద్: ఎనిమిదో నిజాం నవాబులా పండుగ లకు సీఎం కేసీఆర్ ఇనాంలు ఇస్తున్నార ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నియంతలాగా వ్యవహరిస్తున్న సీఎం తక్షణమే తెలంగాణ అక్కాచెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రోజులు ఎదురు చూసిన మహిళ లకు రూ.30 ఖరీదున్న చీరలిచ్చి అవమా నించారన్నారు. వైన్‌షాప్‌లకు సమయం పెంచి రూ.26వేల కోట్ల ఆదాయం పెంచు కున్నారని, ఇలాంటి నీచమైన పనుల కోసమా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నిం చారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లపై కేసులు పెట్టడం దారుణమ ని.. గొర్రెలు, బర్రెలు, చేపలు, చెట్లు, చీరలు అంటూ సీఎం తెచ్చిన ప్రతీ స్కీమ్ లోనూ భారీ స్కామ్ ఉందని ఆరోపించా రు. నల్లగొండ ఉపఎన్నికొస్తే పోటీకి సిద్ధమని, ఎంపీగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీచేసినా పనిచేస్తానని చెప్పారు. తాను పోటీచేస్తే వరంగల్‌లో టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లకన్నా మెజారిటీతో గెలుస్తానన్నారు. -
సర్కారు నిర్లక్ష్యంతో ఎండిన ఉదయ సముద్రం
సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం (పానగల్ రిజర్వాయర్) ఎండిపోయిందని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎండిపోయే ప్రమాదముందని అసెంబ్లీలో సర్కార్‌కు మొర పెట్టుకున్నానని, ఉదయ సముద్రం నింపకపోతే జిల్లాకు తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, తెలంగాణ వచ్చాక ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఉదయ సముద్రానికి నీళ్లివ్వక పోతే మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్లు తాగే దుస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. కృష్ణా బోర్డును కూడా ఒప్పించలేని అసమర్థుడు కేసీఆర్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అధిష్టానం అనుమతిస్తే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. -
పోలింగ్ కేంద్రం వద్ద కోమటిరెడ్డి హల్చల్
-
సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి
ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం జానా తీరుపై డీఎస్ అసంతృప్తి హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ విప్‌గా వి.సంపత్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు. పీఏసీ రేసులో ఆ నలుగురు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
అరుణకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, నల్లగొండ/కనగల్, న్యూస్‌లైన్: ప్రేమోన్మాది చేతిలో కిరోసిన్ దాడికి గురై మృత్యువుతో ఆరు రోజులు పోరాడి ఆదివారం ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్దిని తలారి అరుణ(21) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. వివిధ పార్టీలు, దళిత సంఘాల నాయకులతోపాటు ప్రజలు పెద్దఎత్తున అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనగల్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అరుణ కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నేతలు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్, భిక్షంయాదవ్, అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, వెంకన్న, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంటయ్య, లక్ష్మారెడ్డిలు ఉన్నారు. తెరుచుకోని విద్యాసంస్థలు ప్రేమోన్మాది నకిరేకంటి సైదులు చేతిలో దాడికి గురైన అరుణ మృతికి సంతాపంగా జిల్లాలో విద్యాసంస్థలు సోమవారం బంద్ పాటించాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్థిక చేయూత.. అరుణ తల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మలకు ప్రభుత్వం తరఫున రూ. 2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అంతేగాాక ఆరురోజులపాటు చికిత్స అవసరమైన డబ్బులు కూడా ప్రభుత్వమే భరించిందని ఆయన తెలిపారు. నిరసనలు... టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బంద్ పాటించారు. ఆధ్యాపకులు, విద్యార్ధులు మౌనం పాటించారు. దీంతో యూనివర్సిటీలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరకుండా ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ బార్ అసోసియేషన్ కోర్టు విధులు బహిష్కరించింది. అరుణ మృతికి కారణమైన నిందితునికి న్యాయసాయం అందించకూడదని న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. భువనగిరిలోని ఎస్సీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వలిగొం డలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో, కోదాడలో బీజే పీ మహిళా మోర్చా నిందితుడి దిష్టిబొమ్మకు నిప్పు పెట్టా రు. అరుణ మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓకు విన తిపత్రం అందజేశారు. దామరచర్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్‌చేశారు. నార్కట్పలిలో యూత్ కాంగ్రెస్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. చిట్యాలలో టీఆర్ఎస్వీ, తెలంగాణ జాగృతి, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు.