మాట్లాడుతున్న మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ : మీ రాకతో నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాలుగు సార్లు గెలిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ గౌరవాన్ని నిలబెట్టా...ఐదోసారి గెలిపించండి.. ఐదేళ్లు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు శనివారం మర్రిగూడలోని లక్ష్మీగార్డెన్‌లో కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. భారీగా వచ్చిన కార్యకర్తలను చూసి కోమటిరెడ్డి ఉద్వేగభరింతగా ప్రసగించారు. మీ ప్రేమను చూ స్తుంటే నాబాధను మరిచిపోతున్నాని అన్నారు. మీలో నాకొడుకును చూసుకుంటున్నారు.
కార్యకర్తలకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ కోమటిరెడ్డి ప్రకటించారు. తాను సమావేశానికి వస్తుంటే కార్యకర్తలలు ప్రేమతో ఎదురువచ్చారు. కిక్కిరిసిన కార్యకర్తల మధ్య స్టేజిమీదికి వచ్చా నేను గట్టివాన్ని కాబట్టి తట్టుకున్నా.. అదే కేసీఆర్ ఆయితే ఎప్పుడో చచ్చేవాడని అనడంతో కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. మీ ప్రేమకు నేను మరిచిపోను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆశయ సాధనకు తనను గెలిపించాలని కోరారు. నన్నుగెలిపిస్తే అది మీగెలుపు, నేను ఓడితేమీరు ఓడినట్లేనన్నారు. తెలంగాణ కోసం పోరాడడంతో పాటు ఫ్లోరిన్ సమస్య పరిష్కారానికి ఆమరణ నిరాహారదీక్ష చేశానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. మెడికల్‌కళాశాలను పూర్తి చేసి నల్లగొండ రూపురేఖలు మారుస్తానన్నారు.
లక్షమందితో నామినేషన్
తాను ఐదో సారి లక్షమందితో కలిసి నామినేషన్ వేయాలని,కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ని మంచి పొజీషన్‌లో చూస్తాము, కాబట్టి అందరం కలిసి గెపించాలని పిలుపు నిచ్చారు. అందుకు అందరం కష్టపడి పనిచేయాలని అన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నాని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపే ధ్యేంగా అందరం కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తామని చెప్పారు.
పార్టీలో చేరిన మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 20 సంవత్సరాల ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సందర్భంలో నియోజక వర్గం ప్రశాతంగా ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి గెపుపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఖయూంబేగ్, హమీ ద్, బండమీది అంజయ్య, శ్రీనాథ్, మార్కెట్ వైస్ చైర్మన్ పాశం నరేష్‌రెడ్డి, జానకిరాములు, పనస శంకర్, సిరాజుల్లా ఖాన్, హజీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వంగాల స్వామిగౌడ్, జెడ్పీటీసీలు శ్రీనివాస్‌గౌడ్, రాధ,అల్లి సుభాష్, వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. అంతకు ముం దు ఎన్‌జీ కళాశాల నుంచి లక్ష్మిగార్డెన్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు.
దొంగల చేతివాటం ..!
కాంగ్రెస్ సమావేశంలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. సమావేశానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడం కోమటిరెడ్డిని కలిసేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే దుండగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. నాయకుల జేబులో నుంచి డబ్బులు కొట్టేశారు. బుర్రిశ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకుల వద్ద నుంచి రూ.3 లక్షల వరకు తస్కరించారు. ఓ నాయకుడి వద్ద లక్ష రూపాయలు పోగా మిగిలిన వారి జేబుల్లోనుంచి 10 నుంచి 20 వేల పైచిలుకు వరకు కొట్టేశారు. సమావేశం అనంతరం నాయకులు తమ జేబులు చూసుకుని అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment