
ఎనిమిదో నిజాంలా ఇనాంలిస్తున్నడు
కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదో నిజాం నవాబులా పండుగ లకు సీఎం కేసీఆర్ ఇనాంలు ఇస్తున్నార ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నియంతలాగా వ్యవహరిస్తున్న సీఎం తక్షణమే తెలంగాణ అక్కాచెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రోజులు ఎదురు చూసిన మహిళ లకు రూ.30 ఖరీదున్న చీరలిచ్చి అవమా నించారన్నారు.
వైన్‌షాప్‌లకు సమయం పెంచి రూ.26వేల కోట్ల ఆదాయం పెంచు కున్నారని, ఇలాంటి నీచమైన పనుల కోసమా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నిం చారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లపై కేసులు పెట్టడం దారుణమ ని.. గొర్రెలు, బర్రెలు, చేపలు, చెట్లు, చీరలు అంటూ సీఎం తెచ్చిన ప్రతీ స్కీమ్ లోనూ భారీ స్కామ్ ఉందని ఆరోపించా రు. నల్లగొండ ఉపఎన్నికొస్తే పోటీకి సిద్ధమని, ఎంపీగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీచేసినా పనిచేస్తానని చెప్పారు. తాను పోటీచేస్తే వరంగల్‌లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లకన్నా మెజారిటీతో గెలుస్తానన్నారు.