కోమటిరెడ్డీ.. నీకంత సీన్‌ లేదు ! | veemula veeresam on komatireddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డీ.. నీకంత సీన్‌ లేదు !

Published Mon, Dec 25 2017 3:09 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

veemula veeresam on komatireddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై పోటీ చేసేంత సీన్‌ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో తన సీటు గల్లంతవుతుందని, ఓటమి తప్పదన్న భయంతోనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏనాడూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని గుర్తించని ఆయన.. అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించడం ప్రచారం కోసమేనని అన్నారు.

నల్లగొండలో అంత బలం ఉందనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో నిలబడితే ఎవరి బలమెంతో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణకు, సీఎం కేసీఆర్‌కు వస్తున్న గుర్తింపును చూసి ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌పై, మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా ఓర్వలేని తనంతోనే విమర్శలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement