
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పేరు తో గూగుల్‌లో వెతికితే దోపిడీ దొంగ అని వస్తోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేటీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారమదంతో మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ సహా ఆయన కుటుంబం అంతా సోనియా గాంధీ కాళ్లు మొక్కారని, కానీ అధికారం రాగానే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.
నిరాడంబరంగా ఉండే రాహుల్ గాంధీపై కేటీఆర్ అనుచితంగా మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని కేటీఆర్ ఎన్నోసార్లు తనను బతిమిలాడినట్టుగా కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే కేసీఆర్ సహా కుటుంబం అంతా జైల్లో ఉండాల్సి వస్తుందనే భయంతోనే నోరు విప్పడంలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌తో సహా తాను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment