అరుణకు కన్నీటి వీడ్కోలు | tearful farewell to Aruna | Sakshi
Sakshi News home page

అరుణకు కన్నీటి వీడ్కోలు

Published Tue, Dec 24 2013 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

తలారి అరుణ

తలారి అరుణ

సాక్షి, నల్లగొండ/కనగల్, న్యూస్‌లైన్:  ప్రేమోన్మాది చేతిలో కిరోసిన్ దాడికి గురై మృత్యువుతో ఆరు రోజులు పోరాడి ఆదివారం ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్దిని తలారి అరుణ(21) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. వివిధ పార్టీలు, దళిత సంఘాల నాయకులతోపాటు ప్రజలు పెద్దఎత్తున అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనగల్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అరుణ కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నేతలు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్, భిక్షంయాదవ్, అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, వెంకన్న, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంటయ్య, లక్ష్మారెడ్డిలు ఉన్నారు.
 తెరుచుకోని విద్యాసంస్థలు
  ప్రేమోన్మాది నకిరేకంటి సైదులు చేతిలో దాడికి గురైన అరుణ మృతికి సంతాపంగా జిల్లాలో విద్యాసంస్థలు సోమవారం బంద్ పాటించాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
 ఆర్థిక చేయూత..
 అరుణ తల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మలకు ప్రభుత్వం తరఫున రూ. 2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అంతేగాాక ఆరురోజులపాటు చికిత్స అవసరమైన డబ్బులు కూడా ప్రభుత్వమే భరించిందని ఆయన తెలిపారు.  
 నిరసనలు...
 టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బంద్ పాటించారు. ఆధ్యాపకులు, విద్యార్ధులు మౌనం పాటించారు. దీంతో యూనివర్సిటీలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరకుండా ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ బార్ అసోసియేషన్ కోర్టు విధులు బహిష్కరించింది. అరుణ మృతికి కారణమైన నిందితునికి న్యాయసాయం అందించకూడదని న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.

భువనగిరిలోని ఎస్సీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఎంఎస్‌ఎఫ్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వలిగొం డలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో, కోదాడలో బీజే పీ మహిళా మోర్చా నిందితుడి దిష్టిబొమ్మకు నిప్పు పెట్టా రు. అరుణ మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓకు విన తిపత్రం అందజేశారు. దామరచర్లలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు.

నకిరేకల్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్‌చేశారు. నార్కట్‌పలిలో యూత్ కాంగ్రెస్  ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. చిట్యాలలో టీఆర్‌ఎస్వీ, తెలంగాణ జాగృతి, టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement