talari aruna
-
అరుణకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, నల్లగొండ/కనగల్, న్యూస్‌లైన్: ప్రేమోన్మాది చేతిలో కిరోసిన్ దాడికి గురై మృత్యువుతో ఆరు రోజులు పోరాడి ఆదివారం ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్దిని తలారి అరుణ(21) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. వివిధ పార్టీలు, దళిత సంఘాల నాయకులతోపాటు ప్రజలు పెద్దఎత్తున అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు పలువురు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనగల్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అరుణ కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నేతలు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్, భిక్షంయాదవ్, అనూప్‌రెడ్డి, జియాఉద్దీన్, వెంకన్న, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంటయ్య, లక్ష్మారెడ్డిలు ఉన్నారు. తెరుచుకోని విద్యాసంస్థలు ప్రేమోన్మాది నకిరేకంటి సైదులు చేతిలో దాడికి గురైన అరుణ మృతికి సంతాపంగా జిల్లాలో విద్యాసంస్థలు సోమవారం బంద్ పాటించాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్థిక చేయూత.. అరుణ తల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మలకు ప్రభుత్వం తరఫున రూ. 2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అంతేగాాక ఆరురోజులపాటు చికిత్స అవసరమైన డబ్బులు కూడా ప్రభుత్వమే భరించిందని ఆయన తెలిపారు. నిరసనలు... టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బంద్ పాటించారు. ఆధ్యాపకులు, విద్యార్ధులు మౌనం పాటించారు. దీంతో యూనివర్సిటీలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిపో నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరకుండా ఆందోళనకారులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ బార్ అసోసియేషన్ కోర్టు విధులు బహిష్కరించింది. అరుణ మృతికి కారణమైన నిందితునికి న్యాయసాయం అందించకూడదని న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. భువనగిరిలోని ఎస్సీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వలిగొం డలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో, కోదాడలో బీజే పీ మహిళా మోర్చా నిందితుడి దిష్టిబొమ్మకు నిప్పు పెట్టా రు. అరుణ మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓకు విన తిపత్రం అందజేశారు. దామరచర్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్‌చేశారు. నార్కట్పలిలో యూత్ కాంగ్రెస్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. చిట్యాలలో టీఆర్ఎస్వీ, తెలంగాణ జాగృతి, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. -
అరుణకు అశ్రునివాళి
అంత్యక్రియలకు భారీగా హాజరైన జనం సాక్షి, నల్లగొండ: విద్యార్థిని అరుణ (21) అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన నల్లగొండజిల్లా కనగల్ మండలం కురంపల్లిలో సోమవా రం జరిగాయి. అంతిమ యాత్రకు ప్రజలు, విద్యార్థులు, పార్టీల నేతలు పెద్దఎత్తున హాజరై వీడ్కోలు పలికారు. ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించగా, ఆరు రోజుల పాటు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, అరుణ మృతి పట్ల జిల్లాలోని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. అరుణ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల చెక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య అందజేశారు. అలాగే, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో అరుణ కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం పరామర్శించారు. అరుణ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆరిపోయిన అరుణ దీపం
సాక్షి, న ల్లగొండ/న్యూస్‌లైన్,కనగల్: ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన విద్యార్థిని తలారి అరుణ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన నిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని అరుణపై.. ఈనెల 17వ తేదీన నకిరేకంటి సైదులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రేమించిన తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు కక్ష పెంచుకుని అరుణపై కర్కశంగా హత్యాయత్నం చేశాడు. నిలువెల్లా తీవ్రగాయాలైన ఆమెకు మొదటగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడి నుంచి ఈనెల 18వ తేదీన కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆమెకు ఐదు రోజులపాటు వైద్యులు చికిత్సనందించారు. 95 శాతానికిపైగా కాలిన గాయాలవడంతో కోలుకోవడం కష్టంగా మారింది. రోజురోజుకూ పరిస్థితి మరింత విషమించి చివరకు ప్రాణాలొదిలింది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన వ్యక్తి .. ఇక లేదన్న వార్తతో స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. ఉస్మానియాకు తరలింపు... పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం పోస్టుమార్టం ముగియగానే జిల్లాకు మృతదేహాన్ని తీసుకొస్తామని బంధువులు ‘సాక్షి’కి తెలిపారు. రిమాండ్‌లో నిందితుడు... సంచలనం రేకెత్తించిన కేసును జిల్లా పోలీసు యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుడు సైదులుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.. విద్యార్థుల ఆగ్రహం... అరుణ పట్ల దాడిని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థి సంఘాల నేతలు ఈనెల 18వ తేదీన విద్యాసంస్థలకు బంద్‌కు పిలుపునిచ్చి విజయవంతం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిందితుడి దొష్టిబొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రద్ధాంజలి.... అరుణ మృతిపట్ల విద్యార్థి సంఘాలు జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించాయి. నిందితుడు సైదులుకి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఘటనకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయిు. జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్, రామగిరి సెంటర్లో టీఆర్ఎస్వీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, టీఎన్ఎస్ఎఫ్, టీఎంఎస్‌వీ, బీజేపీ, బీఎస్పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రామగిరి సెంటర్లో రాస్తారోకో చేశారు. తల్లడిల్లిన కుటుంబం అరుణది నిరుపేద కుటుంబం. త ల్లిదండ్రులు ఈశ్వరయ్య, పిచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పులు చేసి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. కూలిపనులు చేస్తు చిన్న కూతురు అరణని చదివిస్తున్నారు. కూతురు పెద్ద చదువులు చదివి వారికింత కూడు పెడుతుందనుకుంటే కళ్ల ముందే కాటికి పోవడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.