
సాక్షి, నల్లగొండ : తన సొంత జిల్లాను మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అప్పులు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డికి వ్యవసాయంపై కనీసం అవగాహన లేదని దుయ్యబట్టారు. నీటి నిర్వహణపై సోమవారం నుంచి రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment