
నార్కట్‌పల్లి (నకిరేకల్): బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవేనని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమిం చేందుకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో మార్నింగ్‌వాక్‌లో భాగంగా ఉదయసముద్రం ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు సాగునీరు లేక ఇబ్బందులు పడేవారని, త్వరలో ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. దీంతో తాగు, సాగునీరు సమస్య పరిష్కారమైనట్లేనన్నారు. అసెంబ్లీలో రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టుపై పదేపదే చర్చించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు ఒకే నెలలో రెండు సార్లు ప్రాజెక్టును పరిశీలించి పనులు వేగవంతం చేశారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment