వాట్‌ యాన్‌ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..! | England Couple Purchase Old Ambulance And Converted Into luxury House | Sakshi
Sakshi News home page

వాట్‌ యాన్‌ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!

Published Sun, Aug 6 2023 8:06 AM | Last Updated on Sun, Aug 6 2023 9:09 AM

England Couple Purchase Old Ambulance And Converted Into luxury House - Sakshi

ఇంగ్లండ్‌కు చెందిన క్రిష్, మిషెల్‌ అనే దంపతులు పాతబడిన అంబులెన్స్‌ను కొనుక్కుని, దాన్ని చక్కని ఇల్లులా మార్చేశారు. ఇప్పుడు వారు ఈ అంబులెన్స్‌ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. యూట్యూబ్‌ వీడియోలు చూసి, ఈ దంపతులు అంబులెన్స్‌ను ఇల్లులా తీర్చిదిద్దుకున్నారు. సామాన్యమైన ఇంటికి కావలసిన వసతులన్నింటినీ ఇందులో ఏర్పాటు చేసుకున్నారు.

ఈ అంబులెన్స్‌ 2003 నాటి ‘తాన్యా’ ఈ–450 వాహనం. ఇందులో మంచం, స్టవ్, కిచెన్‌ కేబినెట్‌ సహా అవసరమైన సామగ్రిని పొందికగా అమర్చుకున్నారు. స్నానానికి వీలుగా ఫోల్డబుల్‌ వాటర్‌ టబ్‌ను కూడా తయారు చేసుకున్నారు. పని పూర్తయ్యాక ఈ టబ్‌ను మడతపెట్టి, దాచేసుకోవచ్చు. వీరు ఈ అంబులెన్స్‌ను అగ్నిమాపక శాఖ నుంచి 4500 పౌండ్లకు (రూ.4.72 లక్షలు) కొనుగోలు చేశారు. కోరుకున్న వసతులతో దీనిని ఇల్లులా మార్చుకోవడానికి మరో 8000 పౌండ్లు (రూ.8.40 లక్షలు) ఖర్చు చేశారు.  

(చదవండి: బస్సు డ్రైవర్‌ కూతురుకి లండన్‌లో ఉద్యోగం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement